June 9
-
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ
పంజగుట్ట (హైదరాబాద్): కరోనా కారణంగా మూడేళ్ల నుంచి వాయిదాపడిన చేప ప్రసాదం జూన్ 9న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవ్వనున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని లక్షల మంది తమ చేప ప్రసాదం తీసుకుని వారి సమస్యలను శాశ్వతంగా తగ్గించుకున్నారన్నారు. ప్రభుత్వం తరఫున కొర్రమీను లైవ్ చేపలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటలు ఏమీ తినకూడదని, 45 రోజులు పత్యం ఉండాలని చెప్పారు. ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. -
పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌హైవే మూసివేత
హైదరాబాద్ : పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేను గురు, శుక్రవారాల్లో కొన్ని గంటలపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైవేపై సెంట్రల్ లైన్ రోడ్డు మార్కింగ్, రెయిలింగ్‌తోపాటు క్రాష్ బారియర్లకు రంగులు వేసే పనులు చేపడుతున్న కారణంగా 9, 10వ తేదీల్లో రాత్రి 11 గంటల నుంచి మరునాడు ఉదయం 5 గంటల వరకు ఎక్స్‌ప్రెస్ హైవేపై రాకపోకలను రద్దు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి, సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు. -
గుల్బర్గ్ సొసైటీ కేసు.. తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: 2002 గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో 24 మంది దోషులకు శిక్ష ఖరారుపై విచారణను ప్రత్యేక సిట్ కోర్టు జూన్9కి వాయిదా వేసింది. ఈ నెల 2న ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. దీనివెనక కుట్ర లేదని స్పష్టం చేసింది. నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు కోర్టులో నలిగిన ఈ కేసును నలుగురు జడ్జిలు విచారించారు. 2002లో గోద్రా అల్లర్లలో సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పంటించిన తర్వాతి రోజు 30 విల్లాలు, 10 అపార్ట్ మెంట్ బ్లాక్ లు ఉండే గుల్బర్గ్ సొసైటీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీని దుండగులు చంపారు. ఘటనా స్థలంలో 31 శవాలు లభ్యంకాగా, జాఫ్రీ, పార్శీ బాలుడు అజార్ మోదీల ఆచూకీ లేకుండా పోయింది. వీరిలో 30 మంది మరణించగా ముజఫర్ షేక్ అనే బాలుడు బతికి బయటపడ్డాడు. అతని కుటుంబసభ్యులు ఆయన పేరును వివేక్ గా మార్చివేశారు. సుప్రీంకోర్టు వేసిన తొమ్మిది ప్రత్యేక సిట్ కోర్టుల్లో గుల్బర్గ్ కేసు ఎనిమిదోది.