![V Vijay Kumar Gives 101 Plots To Poor Artist - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/6/Movie-News_1_1.jpg.webp?itok=XkwJNUEY)
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు.
విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment