kv ramanachari
-
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలి : కేవీ రమణాచారి
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం ,తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107 వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడుతూ కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం గా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతుందని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని,కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళోజీ సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు .తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు.ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం ,డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజి చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని అన్నారు సామాన్యులను సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి ,కార్యదర్శివి.ఆర్. విద్యార్థి ,కాళోజి కుమారుడు రవికుమార్ ,ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు. -
నేడు మహా బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. ఈ నెల 26న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం జరుగు తుందని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది పది వేల మంది మహిళలతో ఇదే స్టేడియంలో నిర్వహించామన్నారు. ఈ ఏడాది 30 నుంచి 35 వేల మందితో ‘మహా బతుకమ్మను’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సా యంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆట–పాట కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. బతుకమ్మ పండుగ కోసం జిల్లాకు రూ. 3 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నందునా, ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రచారం జరిగి పర్యాటకులు పెరిగి రూ. కోట్లలో ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 28న సద్దుల బతుకమ్మ ... ఈ నెల 28న సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు పర్యాటకం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. దీన్ని ఎల్బీ స్టేడియంలోనే నిర్వహిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలకు చెందిన 3 నుంచి 5 వేల మంది మహిళలు సద్దుల బతుకమ్మలతో పాల్గొని ఆట–పాట నిర్వహిస్తారని తెలిపారు. అనం తరం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వ ర్యంలో మహిళలందరూ వెళ్లి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ సద్దుల బతుక మ్మను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 28న గిన్నీస్ రికార్డు ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా ఛొంగ్తూ, సెర్ప్ సీఈవో పౌలోమిబసు పాల్గొన్నారు. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనుండటంతో ఆ ప్రాం తానికి వచ్చే మార్గాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పార్కింగ్ ప్రాంతాలివే... కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు అయ్యంకార్ భవన్ దిగాక నిజాం కాలేజీ గ్రౌండ్లో, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు బీజేఆర్ విగ్రహం వద్ద దిగాక ఎన్టీఆర్ స్టేడియంలో, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దిగాక పబ్లిక్ గార్డెన్స్‌లో, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు ఓల్డ్ పీసీఆర్‌లో దిగాక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేయాలి. వీఐపీ వాహనాలను అలియా కాలేజీ, మహబూబియా కాలేజీల్లో పార్క్ చేయాలి. మంత్రుల వాహనాలను అలియా మోడల్ స్కూల్లో, మీడియా వాహనాలను ఎస్సీఈఆర్టీలో పార్క్ చేయాలి. ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలివే.. - ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వైపునకు అనుమతించారు. వీటిని కేఎల్కే బిల్డింగ్ ద్వారా నాంపల్లి లేదంటే రవీంద్రభారతి నుంచి మళ్లించనున్నారు. - అబిడ్స్, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్ జంక్షన్ వైపునకు అనుమతించనున్నారు. వీటిని గన్‌ఫౌండ్రీ వద్ద మళ్లించి చాపెల్ రోడ్డుకు మళ్లించనున్నారు. - బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వెళ్లే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద మళ్లించి హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా అనుమతించనున్నారు. - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్‌కు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద మళ్లించి హిమాయత్‌నగర్ జంక్షన్వైపు అనుమతించనున్నారు. - కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్ వెళ్లే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్‌రోడ్డులోని భారతీయ విద్యాభవన్ వద్ద మళ్లించి తాజ్‌మహల్, ఈడెన్గార్డెన్కు అనుమతించనున్నారు. - లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్ వద్ద మళ్లించి హిమాయత్‌నగర్ మీదుగా అనుమతివ్వనున్నారు. - ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వచ్చే వాహనాలను నాంపల్లి రోడ్డు వద్ద మళ్లించనున్నారు. -
కళాపిపాసి కేవీఆర్
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాహిత్య, సాంస్కతిక భోజ్యుడు డాక్టర్ కేవీ రమణాచారి అని ఏపీ శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. గురువారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ పి. సావిత్రి సాయి సిద్ధాంత గ్రంథం, ‘డాక్టర్ కేవీ రమణాచారి సాంస్కతికోద్యమదక్పథం’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు తెలుగు సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పెద్ద దిక్కుగా మారారని ఆయన ప్రశంసించారు. భాషా, సాహిత్యం, సంస్కతి, కళలకు తోడ్పాటు అందించిన ఏకైక మహానీయమూర్తి కేవీ అని చెప్పారు. ఈ రోజుల్లో కళలు పరిరక్షించబడుతున్నాయంటే డాక్టర్ కేవీ రమణాచారి లాంటి వారు చేయూత నివ్వటంతోనేనని చెప్పారు. టీటీడీ ఈవోగా అనే సంస్కరణలు తీసుకవచ్చిన మహానుభావుడు డాక్టర్ కేవీ రమణాచారి అని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో టెక్నాలజీకి అనుగుణంగా ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మల్టీ మీడియా చక్కగా నడుస్తుందన్నారు. దీనికి తోడుగా సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సిద్దాంత గ్రంధం రచయిత డాక్టర్ పి. సావిత్రి సాయి మాట్లాడుతూ చీకోలు సందరయ్య రచించిన ప్రజలు, ప్రభుత్వం, ఒక ఐఏఎస్ గ్రంధం స్ఫూర్తితోనే డాక్టర్ కేవీ రమణాచారి సాంస్కతికోద్యమదక్పథం రచించినట్లు చెప్పారు. డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ప్రతి మనిషిలో మంచితనం ఉంటుందన్నారు. అది చూచే చూపును బట్టి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు, తెలుగు వర్సిటీ రంగస్థల కళల శాఖ అధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి ఎం రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టు అమ్మ లాంటిది: డాక్టర్ కేవీ రమణాచారి
చెట్టు అమ్మ లాంటిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సి బాధ్యత మనదేనన్నారు. ప్రకృతి సమతుల్యత ఉంది అంటే దానికి కారణం చెట్టేనని చెప్పారు. ఎప్పుడో మన పెద్దలు నాటిన మొక్కలతో మనం ఎంతో లబ్ధిపొందుతున్నామన్నారు. ఇప్పుడు నాటే మొక్కలు 20 ఏళ్ల తర్వాత ఫలితాలను మన భావితరాలకు అందిస్తాయని తెలిపారు. ఎంతోమంది కవులు, గాయకులు కూడా చెట్టు ప్రాధాన్యత విశదీకరించారన్నారు. సీఎం మందుచూపుతో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వంలోని ప్రతిశాఖ మరో మూడు నెలల పాటు చెట్లను నాటడం వాటిని రక్షించటం చేయాలని తెలిపారు. చెట్లపై సారధి కళాకారిణి స్పందన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇన్చార్జ్ ఏవో మనోహర ప్రసాద్, రవీంద్రభారతి, సాంస్కృతిక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులు భగవత్ స్వరూపులు
కరీంనగర్‌కల్చరల్ : కళాకారులు భగవత్ స్వరూపులని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కేవీ.రమణాచారి అన్నారు. దివంగత ఒగ్గు కథకుడు మిద్దెరాములు కళాపీఠం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న తరుణంలో మిద్దె రాములు తనయుడు పర్శరాములు కళాపీఠం ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా కళాకారులను సన్మానించడం, అవార్డులను బహూకరించడం అభినందనీయమన్నారు. మిద్దెరాములు గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందులో భాగంగానే పింఛన్లను రూ.1500కు పెంచిందని గుర్తు చేశారు. ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రతి కళాకారుడినీ ఆదుకుంటామని వివరించారు. ప్రభుత్వం తరఫున మిద్దెరాములు పురస్కార అవార్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 2013కు గాను ఒగ్గుకథ కళాకారుడు రాజీవ్‌కు ప్రతిభా పురస్కార్, హంస అవార్డు గ్రహీత చుక్క సత్తయ్యకు ప్రకటించిన అవార్డును ఆయన తనయుడు అంజనేయులుకు, 2014కుగాను జానపద కళాకారుడు ఎస్.ప్రభాకర్‌కు అవార్డు ప్రకటించగా.. వారికి రమణాచారి పురస్కారాలను అందించారు. మిద్దెరాములు ఒగ్గుకథ పురస్కారాలను యాంకర్ ఎండీ సలీం, సినీగీత రచయిత గుండేటి రమేశ్, జానపద గాయకులు జడల రమేశ్, ఆకునూరి దేవయ్య, లింగ శ్రీనివాస్, కుమారస్వామి, నృత్య కళానికేతన్ అధ్యక్షుడు ఎల్ల పోశెట్టి, గజల్ గాయకులు నర్సన్, ఒగ్గుకథకులు పూడూరి మల్లయ్య, గోపగాని ఓదెన్న, దీకొండ కొమురయ్య, దనే సాగర్, బొల్లి రాజుకు అందజేశారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్, ఆర్డీవో చంద్రశేఖర్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, సుంచు లింగయ్య, పత్తిపాక మోహన్, బుర్ర సతీష్, కోడూరి రవీందర్‌గౌడ్, కె.శ్రీనివాసాచారి, గోగుల ప్రసాద్, జి.కృపాదానం, మాడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.