plots
-
బిల్డర్ ప్లాట్ స్కీమ్‌లో 8,000 ఫ్లాట్లు!
గ్రేటర్ నోయిడా అథారిటీ ఐదు బిల్డర్ ప్లాట్ల కేటాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో కనీస ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందని, 8,000 కొత్త ఫ్లాట్ల నిర్మాణం నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో ఈ-వేలం ద్వారా కేటాయింపు జరుగుతుందని అధికారిక ప్రకటనలో అథారిటీ తెలిపింది.గ్రేటర్ నోయిడా అథారిటీ బిల్డర్ విభాగం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మొత్తం 99,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వన్ ఎ, ఎంయూ, సిగ్మా 3, ఆల్ఫా 2, పై వన్ సెక్టార్లలో ప్లాట్లు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాను ఆగ్రా, మథురలతో కలిపే యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే (ఈపీఈ)తో ఈ సెక్టార్లకు మంచి కనెక్టివిటీ ఉందని అధికారులు తెలిపారు. ఈ సెక్టార్లు జెవార్‌లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడా అనుసంధానం కానున్నాయి.ప్లాట్ పరిమాణం, స్థలాన్ని బట్టి చదరపు మీటరుకు రూ.48,438 నుంచి రూ.54,493 వరకు ధర నిర్ణయించారు. రిజర్వ్ ధర ప్రకారం ఈ ఐదు భూముల మొత్తం ధర సుమారు రూ.500 కోట్లు. ప్లాట్ల కేటాయింపు ఈ-వేలం ద్వారా జరుగుతుంది. దీని తేదీని ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ జూలై 2న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 23. ఆసక్తి గలవారు జూలై 29లోగా తమ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. -
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దికరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే ... ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్, భట్టి విక్రమార్క సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూ లు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ భట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. నాడు భట్టి విక్రమార్క చేసిన డిమాండ్‌నే నేను పునరుద్ఘాటిస్తున్నా. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తుంటే భట్టి ఎందుకు మాట్లాడడం లేదు? ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా? ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దు. ఆ మాటలేవీ గుర్తులేవా? తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ‘నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్’అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటున్నారనే విషయం తెలియడం లేదా? అప్పుడు ఉచితంగా క్రమబద్దికరిస్తామ న్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కారు డబ్బులు లాక్కోవడంపై స్పందించాలి. ఎల్ఆర్ఎస్ అంటే డబ్బులు దోచుకోవడానికేనని ప్రస్తుత మంత్రి సీతక్క అప్పట్లో మాట్లాడారు. మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్ఆర్ఎస్పైన మంత్రి కోమటిరెడ్డి అప్పట్లో కోర్టులో కేసువేశారు. ఆ కేసును వెనక్కి తీసుకున్నారా? లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేసు వేస్తారా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు. మార్చి 31 కల్లా డబ్బులు కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రభుత్వ ఖజానా నింపడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6, 7 తేదీలలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని అడుగుతున్న అధికారులను నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ మనదే.. రెండు ఎంపీ సీట్లూ మనవే ‘స్థానిక’ఎమ్మెల్సీతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలపైన పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీతోపాటు రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్లు దోచుకునే పన్నాగం ఎల్ఆర్ఎస్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.లక్ష చొప్పున భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31వ తేదీలోగా రాష్ట్ర ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20 వేల కోట్లు దోచుకునేలా పన్నాగం పన్నారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా అమలు చేయాలి. ఈ డిమాండ్‌తో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపడతాం. 7న ప్రతి జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తాం. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఓపెన్ ప్లాట్లే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: 1991లో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 320 మంది ఉద్యోగులకు ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్లాట్లను ఫ్లాట్లు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 32ను కొట్టివేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు హైదరాబాద్ కూకట్పల్లి సర్వే నంబర్ 964, 1009లో 13 ఎకరాలను ప్రభుత్వం 1991లో కేటాయించింది. గజం రూ.45 చొప్పున కేటాయించాలని చెబుతూ ప్లాట్లను సిద్ధం చేసే బాధ్యతను హౌసింగ్ బోర్డుకు అప్పగించింది. అయితే లేఅవుట్ సిద్ధమయ్యాక ఆ మొత్తాన్ని రూ.116కు పెంచింది. దీనిపై చర్చ కొనసాగుతుండగానే కేటాయింపును నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్లకు బదులు ఫ్లాట్లను కేటాయించాలంటూ జీవో 32ను విడుదల చేసింది. దీన్ని ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వం పేర్కొన్న విధంగా రూ.116 చెల్లించిన 107 మందికి ప్లాట్లను అప్పగించాలని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, హౌసింగ్‌బోర్డు, మరికొందరు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి సొమ్ము వసూలు చేసినందున ఆ భూమిపై వారికే హక్కులు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించడం కొత్తకాదని, జీవో 32ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 320 మందికి ప్లాట్లను 4 నెలల్లో రిజి్రస్టేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
సీఎం జగన్‌ను కలిసిన జర్నలిస్టులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్ -
ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు
సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది. అందుకు అనుగుణంగానే పూలింగ్‌కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
రీసేల్.. రివర్స్
సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. ఇది నిమ్జ్‌కు అతి సమీపంలో ఉండడంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆశపడ్డాడు. గజానికి రూ. 8 వేలు చెల్లించి 150 గజాల ప్లాట్ కొన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సదరు ఉద్యోగి తన కొడుకు చదువుకని ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.. రెట్టింపు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం బ్యాంకు వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఐదు మాసాల్లో సుమారు 3.5 లక్షల దస్తావేజులు నమోదు కాగా, ఈసారి మాత్రం 2.2 లక్షలకు డాక్యుమెంట్లు కూడా దాటలేదు. రియల్ వ్యాపారం పూర్తిగా మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. సాక్షి, హైదరాబాద్: ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు..? పిల్లల చదువుకోసమో.. అమ్మాయి పెళ్లి కోసమో.. ఇతరత్రా భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు అస్సలు గిరాకీ లేదు. కుప్పలుతెప్పలుగా వెంచర్లు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవటం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ఎన్నికల వాతావరణం కావడంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ లేకుండా పోయింది. నగరం చుట్టూ ఇదే పరిస్థితి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చేస్తున్నా యంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల తదితర ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. స్థలం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతోంది. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లు విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెరాలో నమోదు లేకుండానే నిబంధనల ప్రకారం స్థిరాస్తి సంస్థల ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíసియా, దుబా య్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తు న్నాయి. ప్రతి ఆదివారం బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నారు. రెండు మూడేళ్లుగా.. జనరద్దీ లేని చోట... అటవీ ప్రాంతాలకు సమీపంగా కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరమైతే అమ్ముకోలేక అగచాట్లు పడుతు న్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలు చేశారు. వారంతా రెండుమూడేళ్లుగా విక్రయించడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అభివృద్ధి జరిగే ప్రాంతంలోనే కొనాలి అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటేనే భవిష్యత్‌లో విక్రయించినా మంచి ధర వస్తుంది. అనుమతులు ఉన్న వెంచర్లలో కొనడమే ఉత్తమం.– సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్‌తేజ ఇన్ఫ్రా -
నాల్గో రోజూ మోకిలలో అదే జోరు.. గజం రూ.66 వేలు
హైదరాబాద్: మోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05,000 వరకు ధర పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్–2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ. వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్లు, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: అమరావతిలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది. జీవో 45పై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. కాబట్టి నిర్మాణాలు చేసుకోవచ్చని అర్థం అని ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనానికి వినిపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కొంతమంది అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు 1656 ఎకరాలను సంస్థలకు అమ్మేస్తే ఎందుకు స్పందించలేదు? మాస్టర్ ప్లాన్ తప్పు కాబట్టే సవరించామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ సీఆర్డీఏ చట్టంలో 5 శాతం భూమిని నిరుపేదలకు ఇవ్వాలని ఉంది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. -
టీడీపీ హయాంలో కాళ్ళరిగేలా తిరిగినా ఇవ్వని ఇళ్ళు
-
ఏపీలో ఇళ్ల పండగ
-
‘జగనన్నకు చెబుదాం’తో దిగొస్తున్న అధికారులు
పెనుకొండ/హనుమాన్‌జంక్షన్ రూరల్ : ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేసిన బాధితుల కోసం అధికారులు, పోలీసులు దిగొస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించి, ఆధారాలు తీసుకుని న్యాయం చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు, వీఆర్వో నిర్లక్ష్యంతో ఇబ్బందిపడుతున్న మరో బాధితుడు 1902 నంబర్‌కు ఫోన్ చేయడంతో అధికారులు ఫిర్యాదుదారులను సంప్రదించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మూడేళ్లుగా ముప్పుతిప్పలు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రానికి చెందిన దిలీప్‌రెడ్డి మండలంలోని గొల్లపల్లి–చంద్రగిరి మధ్య రోడ్డు పక్కన ప్లాట్లు వేశాడు. తన వద్ద ప్లాట్లు కొనేవారికి బ్యాంకులోను కూడా తానే ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. దీంతో పెనుకొండకు చెందిన గొల్ల గోపాల్, ఓబుళరెడ్డిలు ఆయన వద్ద ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లగా, ఒక్కో ప్లాట్ రూ.16 లక్షలుగా చెప్పాడు. ఒక్కో ప్లాట్‌కు రూ.4 లక్షల చొప్పున అడ్వాన్స్ ఇస్తే.. మిగతా మొత్తం తానే బ్యాంకు ద్వారా లోను ఇప్పిస్తానన్నాడు. దీంతో వారిద్దరూ 2020, జనవరిలో చెరో ప్లాట్ కోసం రూ.4 లక్షల చొప్పున దిలీప్‌రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్‌రెడ్డి ముఖం చాటేశాడు. లోన్ సంగతి తర్వాత కనీసం తాము చెల్లించిన డబ్బులన్నా వెనక్కి ఇవ్వాలని కోరగా.. చెక్కులిచ్చాడు. వాటిని బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపగా.. దిలీప్‌రెడ్డి వాటిని తీసుకోలేదు. ఇలా మూడేళ్ల పాటు పోరాటం చేస్తున్న బాధితులు రెండు రోజుల కిందట ‘జగనన్నకు చెబుదాం’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 1902 కాల్ సెంటర్ వారు వివరాలన్నీ నమోదు చేసుకుని, సమీప పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపారు. దీంతో బుధవారం ‘కియా’ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటరమణ బాధితులకు ఫోన్ చేయగా గొల్ల గోపాల్ అందుబాటులోకి వచ్చాడు. అతన్ని స్టేషన్‌కు పిలిపించి వివరాలపై ఆరా తీసి, ఆధారాలు తీసుకున్నారు. అనంతరం దిలీప్‌పై కేసు నమోదు చేశారు. మరో బాధితుడు ఓబుళరెడ్డిని కూడా స్టేషన్‌కు పిలిపించి ఫిర్యాదు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. మూడేళ్లుగా కనీసం కేసు కూడా నమోదు కాలేదని, 1902కు ఫోన్ చేయగానే పోలీసులే కేసు నమోదు చేశారని బాధితుడు గొల్ల గోపాల్ చెప్పారు. అర్జీదారు ఇంటికి ఆర్డీవో ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన గోళ్ల రాణికి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలోని ఆర్ఎస్ నంబర్ 110–2లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పట్టా భూమి అయినప్పటికీ కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు 22ఏ కేటగిరీ కింద ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. అప్పటి నుంచి రాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వీఆర్వో సరిగ్గా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. విసుగుచెందిన గోళ్ల రాణి కుటుంబ సభ్యులు ఈ నెల 13వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, బాపులపాడు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, మల్లవల్లి వీఆర్వో ప్రసాద్‌ను వెంటపెట్టుకుని బుధవారం మీర్జాపురంలోని గోళ్ల రాణి ఇంటికి వెళ్లారు. మల్లవల్లి వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేయడంతో పాటుగా, గోళ్ల రాణి వద్ద ఉన్న పత్రాలను కూడా ఆర్డీవో పద్మావతి పరిశీలించారు. సమస్య పరిష్కరించకుండా పదే పదే అర్జీదారులను తిప్పుకోవడం తగదని వీఆర్వో ప్రసాద్‌ను ఆర్డీవో మందలించారు. దీర్ఘకాలంగా ఉన్న మల్లవల్లి ఆర్ఎస్ నంబర్ 110–2 సెక్షన్ 22ఏ సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. -
కోకాపేట్ తరహాలో.. మరో భారీ వెంచర్‌కు హెచ్ఎండీఏ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: మరో భారీ వెంచర్‌కు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో, ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి దగ్గరలో రాజేంద్రనగర్ బుద్వేల్ వద్ద సుమారు 200 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మధ్యతగతి, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రెండు రోజుల క్రితం టెండర్లను సైతం ఆహ్వానించింది. 200 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో పాటు విల్లాల కోసం 2 నుంచి 3 ఎకరాల ప్లాట్లు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని 500 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల ప్లాట్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు కార్యాచరణ సిద్థం చేశారు. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ వరకు నగరానికి దక్షిణం వైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ లేఅవుట్‌కు భారీ డిమాండ్ ఉండే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లేఅవుట్ ఔటర్ రింగురోడ్డుకు దగ్గర్లో ఉండడం, రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి చేరువలో ఉండడంతో బుద్వేల్ లేఅవుట్ హాట్‌కేక్‌లా అమ్ముడవుతుందని అధికారులు భావిస్తున్నారు. కోకాపేట్ తరహాలో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఎక్కడ లే అవుట్లను అభివృద్ధి చేసినా కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. హెచ్ఎండీఏ స్థలాల్లో ఎలాంటి వివాదాలు లేకపోవడం, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్ఎండీఏ స్థలాల విక్రయాలకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బాచుపల్లిలో చదరపు గజం అత్యధికంగా రూ.68 వేల వరకు డిమాండ్ రావడం గమనార్హం. గతంలో ఉప్పల్‌లోనూ బిల్డర్లు, రియల్టర్లు, వ్యాపారవర్గాలు, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ రింగ్ రోడ్‌కు అందుబాటులో అభివృద్ధి చేస్తున్న వెంచర్ల పట్ల నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సుమారు 500 ఎకరాల్లో కోకాపేట్లో అభివృద్ధి చేస్తోన్న నియో పోలీస్ లేఅవుట్ కు సైతం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. నియో పోలీస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. కోకోపేట తరువాత బుద్వేల్‌లో చేపట్టనున్న ప్రాజెక్టు అతిపెద్ద లేఅవుట్ అవుతుందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 200 ఎకరాల్లో దీన్ని చేపట్టి విస్తరిస్తారు. అక్కడ ప్రభుత్వభూమి అందుబాటులో ఉండడం వల్ల 350 ఎకరాల వరకు కూడా విస్తరించేందుకు అవకాశం ఉంది. కాగా.. జంట జలాశయాలకు సమీపంలో ఉన్న బుద్వేల్ లే అవుట్‌కు అన్నీ అనుకూలమైన అంశాలే ఉన్నాయి. చదవండి: సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్! -
అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో 16, ఆర్సీపురంలో 6 ప్లాట్లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్ వేలం.. 39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్‌టీసీలో నమోదు చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
ఇంటికి హక్కు.. ఖజానాకు కిక్కు.. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్దీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇళ్లు, నిర్మాణాలను ఎలా క్రమబద్ధీకరించాలి, ఇందుకోసం ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై వారం రోజులుగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సేకరించిన వివరాలను పరిశీలించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం సమావేశం కానుంది. ఇళ్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణతోపాటు ఈ హక్కుల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై ఆదాయార్జన శాఖల అధికారులతోనూ సోమవారమే కేబినెట్ సబ్ కమిటీ విడిగా సమావేశం కానుంది. రెండు కీలక అంశాలపై ఒకేరోజు సబ్ కమిటీ భేటీలు జరుగుతుండటంతో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల నుంచి సాదాబైనామాల దాకా.. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రశీదులు లేని ఇళ్లు, నిర్మాణాల వివరాలను మొత్తం 12 కేటగిరీల్లో రెవెన్యూ శాఖ సేకరించింది. ఇందులో ప్రభుత్వ స్థలాలు, సాంఘిక సంక్షేమశాఖ సేకరించిన భూములు, సీలింగ్ భూములు, ఆబాదీ/గ్రామకంఠం, దేవాదాయ, వక్ఫ్, శిఖం/ఎఫ్టీఎల్, పలు శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, పలు సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం లీజుకిచ్చిన భూములు, నోటరీలు మాత్రమే ఉన్న భూములు, సాదాబైనామా లావాదేవీలు జరిగిన భూములు, ఇతర కేటగిరీల స్థలాలు ఉన్నాయి. ఈ కేటగిరీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు గ్రామాల నుంచీ వివరాలను పంపాలని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్దేశిత ఫార్మాట్ పంపగా.. తహసీల్దార్లు ఆ వివరాలను సేకరించి అందజేశారు. 12.5 లక్షల నిర్మాణాలు? కొన్నిరోజులుగా రెవెన్యూ యంత్రాంగం సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు 12.5 లక్షల వరకు ఉన్నట్టు తేల్చారు. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. ఒక్కో రెవెన్యూ డివిజన్లో 15వేల నుంచి 17 వేల వరకు ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. మొత్తంగా 60శాతానికి పైగా నిర్మాణాలు గ్రామ కంఠాలు, ఆబాదీ భూముల్లోనే ఉన్నాయని.. అలా ఉన్నవాటి సంఖ్య ఏడున్నర లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక గ్రామాలు, పట్టణాల్లో కలిపి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు కలిపి మరో రెండున్నర లక్షలు (16–20 శాతం) ఉండవచ్చని.. మిగిలిన కేటగిరీల్లో మరో 2–3 లక్షల వరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతానికి తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ లెక్కలు వేశామని.. సమగ్రంగా పరిశీలన చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత సోమవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ డేటా సేకరణకు నిర్ణయం తీసుకున్నారని.. ఈ వారం రోజుల్లో 20 జిల్లాల నుంచే పూర్తి సమాచారం వచ్చిందని, మరికొన్ని జిల్లాల నుంచి అందాల్సి ఉందని అంటున్నాయి. రెగ్యులరైజ్ చేసేదెలా? దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుంటే.. వాటిని క్రమబదీ్ధకరించడం ఎలాగన్న దానిపై సోమవారం జరిగే కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్దీకరించాల్సిన ఇళ్లు, నిర్మాణాలు ఎన్ని ఉంటాయి? వాటిని క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలేమిటన్న వివరాలను ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జీవో 58, 59 (పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న నివాసాల క్రమబదీ్ధకరణ) మాదిరిగా స్థలాల ప్రభుత్వ విలువ ఆధారంగా సీలింగ్ నిర్ణయించి.. చదరపు గజాల లెక్కన ఫీజు వసూలు చేసి క్రమబద్దీకరించాలా? లేక ప్రతి ఇల్లు/ నిర్మాణానికి గ్రామాలు/పట్టణాల వారీగా గంపగుత్తగా రుసుము నిర్ణయించి క్రమబదీ్ధకరించాలా? అన్న దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సాదాబైనామాలు, నోటరీ (జీహెచ్ఎంసీ పరిధిలో) భూముల విషయంలోనూ క్రమబదీ్ధకరణకు అవకాశాలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఈ అన్ని అంశాలపై సబ్ కమిటీ తీసుకునే నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదికగా అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగతంగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని.. క్రమబదీ్ధకరణ కటాఫ్ తేదీని, దరఖాస్తు గడువును త్వరలో ప్రకటించవచ్చని అంటున్నాయి. బూమరాంగ్ అవుతుందా? ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠాలు, ఇతర భూముల్లోని ఇళ్లు, నిర్మాణాల క్రమబద్దీకరణ అంశం బూమరాంగ్ అవుతుందా అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. గతంలో పట్టణాలు, గ్రామాల్లోని ఓపెన్ ప్లాట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రకటించింది. రూ.1,000 చెల్లించి వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకోవాలని.. తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లించి స్థలాలు, భవనాలను క్రమబదీ్ధకరించుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనతో లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. తమ భూములు, భవనాలపై ప్రభుత్వానికి మళ్లీ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రజల నుంచి ప్రతికూల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను ఎటూ తేల్చకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఇళ్లు, నిర్మాణాల క్రమబదీ్ధకరణ చేపడితే.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా క్రమబదీ్ధకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి, అదే సమయంలో ఆదాయం సమకూర్చుకోవడానికి గల అవకాశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనున్నట్టు తెలిసింది. ఆదాయ వనరులపెంపుపైనా నజర్ సోమవారమే మరో ప్రధాన అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ కానుంది. పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం పెంపునకు మార్గాలపై ఆర్థిక, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించనుంది.ఇందులో ప్రభుత్వ భూముల వేలం, విలువైన అసైన్డ్ భూముల సేకరణ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, దిల్ వంటి సంస్థల చేతుల్లో ఉన్న ఆస్తుల అమ్మకాలు తదితర అంశాలను పరిశీలించి.. ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. -
హైదరాబాద్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఈ ఏరియా ఓపెన్ ప్లాట్లు!
సాక్షి, హైదరాబాద్: కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువుల కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో కారణమేదైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లను కొనేందుకే ఇష్టపడుతుంటారు. సొంతంగా ఉండేందుకు ఇల్లు మొదటి ప్రాధాన్యత పూర్తయితే ఇక వారి లక్ష్యం శివారు ప్రాంతమైనా సరే ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయటమే. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వెలిసిన వెంచర్లలో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2018 నుంచి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, గుర్గావ్ నగరాలలో ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని హౌసింగ్.కామ్ సర్వే వెల్లడించింది. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్త్రైమాసికాలలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. కరోనాతో బూస్ట్..: సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. -
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్‌లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్‌లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్‌ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాటు ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది. బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్లను బ్లాక్‌లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్‌కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
బాబోయ్, హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 8 శాతం పెరిగాయి. చరదపు అడుగు ధర రూ.9,266కు చేరుకుంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు 14 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.7,741గా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల రియల్టీ ధరల వివరాలతో క్రెడాయ్–కొలియర్స్, లియాసెస్ ఫొరాస్ నివేదిక విడుదలైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అత్యధికంగా గోల్ఫ్‌కోర్స్ రోడ్డులో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగాయి. ► కోల్‌కతాలో సగటున 12 శాతం అధికమై, చదరపు అడుగు ధర రూ.6,954గా ఉంది. ► అహ్మదాబాద్ పట్టణంలో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.6,077గా ఉంది. ► పుణెలో 9 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.8,013కు చేరింది. ► బెంగళూరులో 6% పెరిగి రూ.8,035గా ఉంది. ► చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరల్లో పెద్ద మార్పు లేదు. చెన్నైలో చదరపు అడుగు రూ.7,222గా, ఎంఎంఆర్‌లో రూ.19,485 చొప్పున ఉంది. ► 2022 ఆరంభం నుంచి డిమాండ్ బలంగా ఉండడం, నిర్మాణ వ్యయాలు అధికం కావడంతో ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘కే’ షేప్డ్ రికవరీ ‘‘దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ మార్కెట్ ధరల పరంగా ‘కే’ ఆకారపు రికవరీ తీసుకుంది. వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ బలంగా కొనసాగింది. అద్దె ఇంటి కంటే సొంతిల్లు అవసరమనే ప్రాధాన్యత కరోనా తర్వాత ఏర్పడింది’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ పటోడియా చెప్పారు. డిమాండ్ ఉన్నందున అమ్ముడుపోని మిగులు ఇళ్ల నిల్వలు ఇక ముందు తగ్గుతాయని అంచనా వేశారు. ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ ధోరణలకు అనుగుణంగానే ఉందన్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో ఇళ్ల ధరల పెరుగుదల ఇంక ముందూ కొనసాగొచ్చని అంచనా వేశారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ) -
అపార్ట్మెంట్లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్లే ముద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ తెలిపింది. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. (ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!) 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. (ఉడాన్‌లో రెండో రౌండ్ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు) -
AP: మంగళగిరి టౌన్షిప్లో ప్లాట్లకు ఈ–వేలం.. వారికి 20 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్లను ఈ–వేలం వేయనున్నట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎంఐజీ లే అవుట్–2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్‌లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేయడంతో పాటు 20 శాతం రాయితీ కల్పించామని, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చన్నారు. ప్లాట్‌కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు. 40 శాతం మినహాయింపు ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతంపై రిజి స్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇచ్చిందని వివేక్‌యాదవ్ తెలిపారు. ప్లాట్ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు వివరించారు. అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు సమీపంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాట్లు పొందాలనుకునే వారు పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. చదవండి: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! -
ప్లాట్ల కొనుగోలుదారులూ అదంతా మాయ.. కొంటే నిండా మునిగినట్టే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: లేఅవుట్లో ఉన్న భూములకు కన్వర్షన్ జరిగిందా? ప్లాన్ అప్రూవల్ వచ్చిందా? వాస్తవంగా ప్లాట్లు వేశారా? రోడ్లు, సామాజిక అవసరాలకు భూమిని మినహాయించారా? ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలున్నాయా..? సొంతింటి కల సాకారం చేసుకోవాలనే ఆతృతతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇప్పుడవేవీ తెలుసుకోవడం లేదు. స్థలం దొరికిందని ఆదరాబాదరాగా చెల్లింపులు చేసేస్తున్నారు. లొసుగును బయటపెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా చెక్ పెట్టడం లేదు. దీంతో చివరికి కొనుగోలుదారులు మోసపోవాల్సి వస్తోంది. రణస్థలం మండలం వరిశాంలో ఉన్న రామ్‌నగర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అంతా మాయ.. వరిశాంలోని రామ్‌నగర్ లే అవుట్లో సర్వే నంబర్.23–7ఎ, 23–11, 23–12, 23–13, 23–14, 23–15లో గల ఏడెకరాల భూమిలో లేఅవుట్ వేసినట్టుగా నిర్వాహకులు కాగితాల్లో చూపిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు వేశారో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ ల్యాండ్ పొజిషన్ లేదు. దానికి కారణం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించలేదు. లేఅవుట్ వేసేందుకు అనుమతి తీసుకోలేదు. అంతా కాగితాల్లోనే మాయాజాలం ప్రదర్శించి రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ముందస్తు ఒప్పందమో మరేమిటో తెలియదు గానీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. తమకు డాక్యుమెంట్ వచ్చిందని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. పక్కాగా ఉన్న ప్లాట్లపై జరిగే క్రయ, విక్రయాలకు అనేక ప్రశ్నలు, అభ్యంతరాలు తెలిపే రిజిస్ట్రేషన్ అధికారులు.. వరిశాంలోని రామ్‌నగర్ లేఅవుట్‌కు సంబంధించి వస్తున్న అక్రమ డాక్యుమెంట్లపై కనీసం అడగడం లేదు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చీ రాగానే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. దీనివెనక ఉన్న లాలూచీ ఏంటో వారికే తెలియాలి. ల్యాండ్ కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్ లేని రామ్‌నగర్ లేఅవుట్లోని నంబర్.74 ప్లాట్ క్రయ, విక్రయాలకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొనుగోలుదారులు మునిగినట్టే.. వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా వేయాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దాని కోసం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వానికి భూమి విలువలో 5శాతం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. దీని తర్వాత లేఅవుట్ వేసేందుకు వుడా లేదంటే సుడా నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. ఇందుకు భూమి విలువలో 12శాతం చెల్లింపులు చేయాలి. తదననుగుణంగా వచ్చిన అనుమతుల మేరకు రోడ్లు, సామాజిక అవసరాల కోసం స్థలం మినహాయించి మిగతా స్థలాన్ని ప్లాట్లుగా విభజన చేయాలి. కానీ వరిశాంలోని రామ్‌నగర్ లేఅవుట్ భూమికి కన్వర్షన్ గాని, ప్లాన్ అప్రూవల్ గాని తీసుకోలేదు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండానే కాగితాల్లో లేఅవుట్ సృష్టించారు. అందమైన బ్రోచర్లతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. వారికి నమ్మకం కలిగేలా కొనుగోలుదారు పేరున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. అంతే తప్ప వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం లేదు. లేఅవుట్లో విద్యుత్ సౌక ర్యం గాని, కాలువలు గాని ఉండడం లేదు. రోడ్లు, సామాజిక అవసరాల కోసం ఖాళీగా స్థలాన్ని మినహాయించిన పరిస్థితి లేదు. అసలు కొనుగోలుదారుల ప్లాట్ ఎక్కడో భౌతికంగా తెలియదు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతి రాదు. ప్లాన్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్ చేస్తే తప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్‌కు మళ్లీ డబ్బులు చెల్లించాలి. రోడ్లు, సామాజిక అవసరాల కోసం కొనుగోలు చేసిన స్థలాల నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు చేసే స్థలం విస్తీర్ణం కూడా తగ్గిపోనుంది. ఈ పరిస్థితి రాకుండా ముందుగా లేఅవుట్కున్న అనుమతులు పరిశీలించాలి. ప్లాన్ అప్రూవల్తో ఉన్న ప్లాట్లను గుర్తించి కొనుగోలు చేయాలి. ఇలా జరగకపోవడం వల్ల కొనుగోలుదారులు నిండా మునిగిపోతున్నారు. మరో వైపు ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వ పరంగా ఆదాయానికి గండిపడుతోంది. రెండు తేదీల్లో తొమ్మిది ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు.. వరిశాంలోని అనధికారికంగా వేసిన రామ్‌నగర్ లేఅవుట్లో రెండు తేదీల్లో ఏకంగా తొమ్మిది ప్లాట్లకు రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సర్వే నంబర్ 23–7ఎలో 60, 64, 65, 66, 74, 75, సర్వే నంబర్ 23–14లో 8, 23–14,23–15లో 6 నెంబర్ల గల ప్లాట్లకు గత నెల 25న రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే నంబర్ 23–14, 23–15లో గల 23వ ప్లాట్‌ను ఆగస్టు 3న రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. -
పట్నంలో 50 గజాలు .. పల్లెల్లో 75 గజాలు!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే సరికొత్త గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర సర్కారు విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు పడక గదుల (డబుల్ బెడ్రూమ్) ఇళ్ల నిర్మాణ పథకం పూర్తిస్థాయి సవరణలతో, దానితో ఏ మాత్రం పోలిక లేకుండా కొత్త రూపుతో ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇంటికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరొక గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. వీటితో పాటు ఇతర విధివిధానాలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని భారీగా సవరించి చేపడుతున్న నేపథ్యంలో..కొత్త పథకంలో సీఎం కేసీఆర్ మార్పులు, చేర్పులు చేస్తారని భావిస్తున్నారు. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం విఫలమైందన్న ప్రచారానికి అవకాశం కల్పించకుండా, దీన్ని కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఆయన మార్పులు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాగానే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మార్పులు చేర్పుల ఆధారంగా తుది విధివిధానాలు రూపొందించి అధికారికంగా వెల్లడించనున్నారు. లేదంటే ప్రాథమిక అంశాలే తుది విధివిధానాలుగా ఖరారు కానున్నాయి. ఆదినుంచీ అవాంతరాలే.. రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆది నుంచి ఎదురవుతున్న అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు సాగనీయటం లేదు. మొత్తం 2.27 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అయితే 1.10 లక్షల ఇళ్లే పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు కనీసం 20 వేల ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదు. మిగతా వాటికి సంబంధించి అసలు లబ్ధిదారుల జాబితాలనే రూపొందించలేదు. దీన్ని తప్పుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సొంత ఇంటి పథకం మార్పు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రాథమికంగా విధివిధానాలు ఖరారు చేసింది. ప్రాథమికంగా ఇలా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రాథమికంగా రూపొందించారు. ►ఈ ఇళ్లను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి (బీపీఎల్) మాత్రమే మంజూరు చేస్తారు. ►ఈ ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన దాఖలాలున్నాయి. సొంత స్థలాలున్న వారి సంఖ్య అందుకు సరిపడా లేదనుకున్నప్పుడు జనాభాలో వారి శాతం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికి 12 శాతం ఇళ్లు కేటాయించాలి. ►ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రెండు గ్రామ సభల ద్వారా చేపట్టాలి. తొలి గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించాలి. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటి పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితా రూపొందించి రెండో సభలో వివరాలు వెల్లడించాలి. అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించాలి. ►ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను కేటాయిస్తారు. మరికొన్ని ఇళ్లు ముఖ్యమంత్రి విచక్షణాధికారం పరిధిలో ఉంటాయి. వెరసి 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు. ►ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.3 లక్షలు కేటాయిస్తారు. వాటిని ఇళ్ల నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు. ►కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు 58, 59 జీవోల ద్వారా కల్పించిన వెసులుబాటు పరిధిలో ఉన్నవారు ఈ ఇళ్లు పొందేందుకు అనర్హులు. -
మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ ర్యాండమ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. చదవండి: ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ -
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు.