బిల్డర్‌ ప్లాట్‌ స్కీమ్‌లో 8,000 ఫ్లాట్లు! | Greater Noida Authority launches builder plots scheme for 8000 flats | Sakshi
Sakshi News home page

బిల్డర్‌ ప్లాట్‌ స్కీమ్‌లో 8,000 ఫ్లాట్లు!

Published Wed, Jul 3 2024 5:09 PM | Last Updated on Wed, Jul 3 2024 5:14 PM

Greater Noida Authority launches builder plots scheme for 8000 flats

గ్రేటర్ నోయిడా అథారిటీ ఐదు బిల్డర్ ప్లాట్‌ల కేటాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో కనీస ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందని, 8,000 కొత్త ఫ్లాట్ల నిర్మాణం నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో ఈ-వేలం ద్వారా కేటాయింపు జరుగుతుందని అధికారిక ప్రకటనలో అథారిటీ తెలిపింది.

గ్రేటర్ నోయిడా అథారిటీ బిల్డర్ విభాగం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మొత్తం 99,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వన్ ఎ, ఎంయూ, సిగ్మా 3, ఆల్ఫా 2, పై వన్ సెక్టార్లలో ప్లాట్లు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాను ఆగ్రా, మథురలతో కలిపే యమునా ఎక్స్ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే (ఈపీఈ)తో ఈ సెక్టార్లకు మంచి కనెక్టివిటీ ఉందని అధికారులు తెలిపారు. ఈ సెక్టార్లు జెవార్‌లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడా అనుసంధానం కానున్నాయి.

ప్లాట్ పరిమాణం, స్థలాన్ని బట్టి చదరపు మీటరుకు రూ.48,438 నుంచి రూ.54,493 వరకు ధర నిర్ణయించారు. రిజర్వ్ ధర ప్రకారం ఈ ఐదు భూముల మొత్తం ధర సుమారు రూ.500 కోట్లు.  ప్లాట్ల కేటాయింపు ఈ-వేలం ద్వారా జరుగుతుంది. దీని తేదీని ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ జూలై 2న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 23. ఆసక్తి గలవారు జూలై 29లోగా తమ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement