builder
-
ఇళ్లకు జీఎస్టీ.. ఎవరు కట్టాలి?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు.ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూయజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూయజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు.కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూయజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపర్ చెల్లించాలని భూయజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది.భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూయజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
వరద రావచ్చేమో..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ ప్రగతినగర్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నెల రోజుల క్రితం అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు దరఖాస్తు చేసుకుంది. నెల రోజుల పాటు దరఖాస్తు పరిశీలన దశలోనే ఉంది. వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పరిశీలించి చివరకు ఆ ప్రాంతంలో వరద నీరు రావచ్చేమోననే సందేహాన్ని చల్లగా వ్యక్తం చేశారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి టోపోమ్యాప్తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కావాలంటూ కొర్రీలు పెట్టారు. నెలరోజుల పాటు ఎటూ తేల్చకుండా చివరకు ఎన్ఓసీలు కావాలంటూ షరతులు పెట్టడంతో సదరు నిర్మాణ సంస్థకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నిజానికి అదే ప్రాంతంలో దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలానికి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. పైగా హెచ్ఎండీఏ గతంలో ఇచ్చిన దరఖాస్తులతోనే ఆ భవనాలను కట్టారు. నిర్మాణానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆ స్థలానికి కొత్తగా టోపో మ్యాప్‌తో పాటు ఎన్ఓసీ కావాలని ఆంక్షలు విధించారు. ఒక్క ప్రగతినగర్‌లోనే కాదు. హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా బిల్డర్లు, మధ్యతరగతి వర్గాలు హడలెత్తుతున్నాయి. టీజీబీపాస్ ద్వారా హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఎండమావుల్లా ఎన్ఓసీలు... ⇒ భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఎల్ఆర్ఎస్లు, ఆక్యుపెన్సీ సరి్టఫికెట్లు వంటి వివిధ రకాల పనులపై సాధారణంగానే నెలలు గడిచినా అనుమతులు లభించడం దుర్లభంగా మారింది. కేవలం 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి అనుమతులను జారీ చేయాల్సి ఉండగా నెలలు గడిచినా అనుమతులు లభించడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్ జాబితాలో పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్ఎండీఏ అనుమతుల్లో ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను కూడా చేర్చారు. దీంతో ఫైళ్ల కదలికలో మరింత జాప్యం ఏర్పడుతోంది. ⇒ ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు హెచ్ఎండీఏ ఆంక్షల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి ఎన్ఓసీలు జారీ కావడం లేదు. తుర్కయంజాల్‌కు చెందిన ఓ దరఖాస్తుదారు ఏడాది క్రితం భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ పంట కాల్వ ఉన్నట్లు పరిగణించి ఎన్ఓసీ కోరారు. ఈ మేరకు ఆరు నెలల పాటు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్ఓసీ సంపాదించారాయన. కానీ.. అదొక్కటే చాలదు. రెవెన్యూ ఎన్ఓసీ కూడా అవసరమన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి ఎన్ఓసీ లభించలేదు. దీంతో భవన నిర్మాణాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.రెవెన్యూ అవసరం లేకపోయినా.. సాధారణంగా వర్షం కురిసినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వరద నీళ్లు ప్రవహిస్తాయి. టోపో మ్యాప్‌ల ఆధారంగా ఇలాంటి వరద కాల్వలను గుర్తిస్తారు. భవన నిర్మాణం చేపట్టనున్న స్థలానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి వరదలు రావని నిర్ధారిస్తూ ఎన్ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరిస్తే అది వరద ముప్పు ఉన్న ప్రాంతంగానే పరిగణించాలి. ఇందులో రెవెన్యూ శాఖ భాగస్వామ్యం అవసరం లేదు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలుగా అనుమానించి కొర్రీలు విధిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ ఎన్ఓసీలను కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. కాగా.. హైడ్రా రాకతోనే తాము ఇలాంటి ఎన్ఓసీలను కోరుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. -
పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?
కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా..ఇంకా నిర్మాణం పూర్తవ్వకముందే బుక్ చేసుకుంటున్నారా..అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే. ఒప్పందం ప్రకారమే నిర్మాణం పూర్తవుతుందని బిల్డర్ హామీ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి తాళాలు ఇవ్వకపోతే, జాప్యం జరిగిన సమయానికి అదనంగా 6 శాతం వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తానని చెబుతుంటాడు. అయితే అనుకున్న సమయానికి మీరే ఫ్లాట్ ధర చెల్లించడంలో ఆలస్యం చేస్తే మాత్రం సుమారు 18 శాతం వడ్డీ కట్టాలని ఒప్పందం చేసుకుంటాడు.రియల్ ఎస్టేట్ రిగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం..ముందే చేసుకున్న ఒప్పందం ఆధారంగా నిర్మాణం పూర్తి చేయడంలో బిల్డర్లు విఫలమైతే వినియోగదారులకు ఏమేరకు వడ్డీ చెల్లిస్తారో అదే మొత్తం వినియోగదారుల చెల్లింపులకు వర్తిస్తుంది. పైన తెలిపిన విధంగా చూస్తే, అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయకపోతే 6 శాతం వడ్డీతో డబ్బు చెల్లిస్తానని బిల్డర్ చెబుతాడు. ఒకవేళ ఫ్లాట్ కొనుగోలుదారుడు కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల చెల్లింపులు జాప్యం చేస్తే అదే వడ్డీని లెక్కగట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రెరా చట్టం ప్రకారం ఎక్కువ వడ్డీ చెల్లించకూడదు.ఇదీ చదవండి: భారీ పెట్టుబడులకు చర్చలు -
బిల్డర్ ప్లాట్ స్కీమ్‌లో 8,000 ఫ్లాట్లు!
గ్రేటర్ నోయిడా అథారిటీ ఐదు బిల్డర్ ప్లాట్ల కేటాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో కనీస ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందని, 8,000 కొత్త ఫ్లాట్ల నిర్మాణం నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో ఈ-వేలం ద్వారా కేటాయింపు జరుగుతుందని అధికారిక ప్రకటనలో అథారిటీ తెలిపింది.గ్రేటర్ నోయిడా అథారిటీ బిల్డర్ విభాగం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మొత్తం 99,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వన్ ఎ, ఎంయూ, సిగ్మా 3, ఆల్ఫా 2, పై వన్ సెక్టార్లలో ప్లాట్లు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాను ఆగ్రా, మథురలతో కలిపే యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే (ఈపీఈ)తో ఈ సెక్టార్లకు మంచి కనెక్టివిటీ ఉందని అధికారులు తెలిపారు. ఈ సెక్టార్లు జెవార్‌లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడా అనుసంధానం కానున్నాయి.ప్లాట్ పరిమాణం, స్థలాన్ని బట్టి చదరపు మీటరుకు రూ.48,438 నుంచి రూ.54,493 వరకు ధర నిర్ణయించారు. రిజర్వ్ ధర ప్రకారం ఈ ఐదు భూముల మొత్తం ధర సుమారు రూ.500 కోట్లు. ప్లాట్ల కేటాయింపు ఈ-వేలం ద్వారా జరుగుతుంది. దీని తేదీని ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ జూలై 2న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 23. ఆసక్తి గలవారు జూలై 29లోగా తమ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. -
జీఎస్టీ ఎవరు కట్టాలి? బిల్డరా? ఓనరా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిలర్లకు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) -
పరకాలలో ఫైరింగ్ కలకలం
సాక్షి, హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్ దుర్మరణం -
బిల్డర్‌కు బ్లాక్మెయిల్.. యువతిని లైంగికంగా వేధించాడంటూ లేఖ రాసి..
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రముఖ బిల్డర్‌కు ఆకాశరామన్న ఉత్తరాలు రాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ బిల్డర్‌కు జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో ఉంటున్న పీసీహెచ్ ఈజోన్ సంస్థ అధినేత బల్విందర్ సింగ్ పదేళ్ల క్రితం ఓ స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు. ఆ స్థలంలో ఐదేళ్ల క్రితమే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కాగా తనకు రావాల్సిన మొత్తానికంటే సుమారు ఐదు కోట్లు అదనంగా ఇవ్వాలని బల్విందర్ సింగ్ పలుమార్లు బిల్డర్‌ను డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకారం... తాను మొత్తం డబ్బులు చెల్లించానని అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని బిల్డర్ చెబుతూ వస్తున్నాడు. దీనిని మనసులో పెట్టుకున్న బల్విందర్ సింగ్ బ్లాక్మెయిల్ చేసి కక్ష సాధించాలని కుట్రకు తెరలేపాడు. బిల్డర్ కార్యాలయంలో పని చేసే ఓ యువతి(30) పేరుతో ఆకాశ రామన్న ఉత్తరాన్ని తయారు చేశాడు. బిల్డర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆ లేఖలో కోరారు. లేఖ ప్రతులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలకు పంపాడు. ఈ లేఖలను పంపించే పనిని తన వ్యక్తిగత పనులు నిర్వహించే బాగ్‌లింగంపల్లికి చెందిన ప్రకాశ్ (39)కు, మైసూర్లో పని చేసే మరో ఉద్యోగి నరేందర్(40)కు అప్పగించాడు. ఈ మేరకు లేఖలు తయారు చేసిన ప్రకాశ్ వాటిని మైసూర్లో ఉండే నరేందర్‌కు కొరియర్ చేశాడు. అక్కడి నుంచి పలువురికి పోస్ట్ ద్వారా ఆ లేఖలను పంపించారు. వాటిని అందుకున్న కొంతమంది స్నేహితులు ఈ విషయం గురించి చెప్పడంతో సదరు బిల్డర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు బల్విందర్‌సింగ్, నరేందర్, ప్రకాశ్లపై ఐపీసీ 419, 469, 389 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బలి్వందర్ సింగ్ పరారీలో ఉండగా, నరేందర్, ప్రకాశ్‌లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన పేరును దురి్వనియోగం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యువతి కూడా ఇటీవల ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. చదవండి 15 నిమిషాల సెల్ఫీ వీడియో.. అమ్మాయిని గదిలోకి పంపించి.. షాకింగ్ విషయాలు -
తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందం.. అంతలోనే ఊహించని విషాదం!
సాక్షి, చెన్నై: తమ కుటుంబంలోకి తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని ఏసీ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం తాగి నిద్రకు ఉపక్రమించిన బిల్డర్ ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై చూలైమేడు ఇలంగో అడిగల్ వీధికి చెందిన సురేష్ కుమార్(52) భవన నిర్మాణ సంస్థ నడుపుతున్నాడు. ఆయనతో పాటు ఇంట్లో కుమారుడు స్టీఫెన్ రాజ్, కోడలు సుజిత ఉన్నారు. కోడలు సుజిత బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వడపళణిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న తల్లీబిడ్డను కుటుంబసభ్యులందరూ వెళ్లి పరామర్శించారు. ఇక సురేష్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. మనవరాలు పుట్టిన ఆనందంతో మిత్రులు, సహచరులకు ఫోన్లు చేసి మరీ చెప్పేశాడు. కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలో ఉండడంతో బుధవారం రాత్రి ఒంటరిగా సురేష్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. మిత్రులకు ఫోన్లు చేస్తూ, మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించాడు. తన గదిలో ఏసీ సైతం వేసుకుని నిద్రకు ఉపక్రమించినట్టుంది. గురువారం వేకువజామున సురేష్‌కుమార్ ఇంటి పై అంతస్తు నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టిలోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ సురేష్‌కుమార్ సజీవదహనమై పడి ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ గదిలో మద్యం బాటిళ్లు, సిగరేట్ ముక్కలు ఉండటాన్ని గుర్తించారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించడంతో విద్యుదాఘాతం నుంచి తప్పించుకోలేక ఆయన ఆహుతై ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
ఫిర్యాదు చేసేందుకు వచ్చి....ఏకంగా పోలీస్ అధికారి సీటులో కూర్చొని....
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చిలో కూర్చొన్న వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తి బిల్డర్ సురేష్ పాండురంగ పాటిల్ అలియాస్ చౌదరి అని, మాన్పాడ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడానికి వచ్చి ఈ వీడియోని షూట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో రాణి నహీం హై తో క్యా హుమా యే బాద్షా ఆజ్ భీ లకోన్ దిలోన్ పే రాజ్ కర్తా హై (నాకు రాణి లేకపోయినప్పటికీ లక్షల హృదయాలను పాలిస్తున్నాడు) అనే డైలాగ్ వస్తుంది. అంతేగాదు సదరు వ్యక్తి తన స్నేహితులతో కలిసి తుపాకీ ఊపుతూ ఫోజ్ పెట్టిన మరో వీడియోని కూడా జోడించి మరీ పోస్ట్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏ పోలీస్టేషన్లో షూట్ చేశాడో అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వోద్యోగిగా నటించడం, ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి నేరాలకు గాను కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...బిల్డర్ సురేష్ మాన్పాడ పోలీస్ స్టేషన్లో నరబలి, మూఢనమ్మకాలకు పేరుతో ఓ వ్యక్తి చేతిలో రూ. 19 లక్షలు పొగొట్టుకున్నానంటూ ఫిర్యాదు చేశాడు. ఆ తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆ డబ్బులు వసూలు చేసుకునేందుకు పోలీస్టేషన్‌కి వచ్చినప్పుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వివిధ పోలీస్టేషన్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాగే అతని వద్ద నుంచి లైసెన్సు తుపాకిని, మెర్సిడేజ్ కారు, కొడవలి, ఐదు లైవ్ కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నారు. Man Shoots Video From Cop's Chair, Gets Locked Up At Same Police Station https://t.co/Fe9ToXGilt pic.twitter.com/fsAICzuthK — NDTV News feed (@ndtvfeed) November 1, 2022 (చదవండి: దాగుడుమూతలు ఆడుతూ.. లిఫ్ట్ కిటికిలో తల పెట్టి...) -
23వ అంతస్తు నుంచి దూకిన ప్రముఖ బిల్డర్
ముంబై: మహారాష్ట్ర ముంబైలో ప్రముఖ బిల్డర్ పరాస్ పోర్వాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తు నుంచి దూకి బలవన్మరాణానికి పాల్పడ్డాడు. ముంబై చించ్‌పోక్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. తన నివాసంలో జిమ్ బాల్కనీ నుంచి పరాస్ దూకినట్లు తెలుస్తోంది. అయితే తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని ఆయన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఈ లేఖను పరాస్ జిమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. పరాస్ కిందకు దూకిన వెంటనే అటువైపు నుంచి వెళ్తున్న ఒకరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి.. రెస్టారెంట్‌పై బకెట్ పెట్రోల్ పోసి -
సేవా సంపన్నత
అది 1993, సెప్టెబర్ 13వ తేదీ. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిందో పీజీ స్టూడెంట్. ఆ అమ్మాయి కడపలో దిగాలి. నడవలేని వ్యక్తి, అతడికి సహాయంగా మరో వ్యక్తి కూడా అదే కంపార్ట్మెంట్లో ఎక్కారు. రైలు కదిలింది. ఆ నడవలేని వ్యక్తి సీట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ‘మేము తినాలి, పడుకోవాలి. మీరు లేవండి’ అని గట్టిగా చెబుతున్నారొకరు. అప్పుడర్థమైందా అమ్మాయికి ఆ వ్యక్తికి రిజర్వేషన్ లేదని... ఆ బెర్తును రిజర్వ్ చేసుకున్న వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని! అంతే... సీట్లో స్థిమితంగా కూర్చోవడం కష్టమైందామెకి. ఎదుటి వారు కష్టంలో ఉంటే ‘నాకెందుకు, నా బెర్త్ నాకుంది చాలు’ అనుకోలేని సున్నితమైన గుణమే... ఈ రోజు ఆమెను ఓ శ్రీమంతురాలిని చేసింది. శ్రీమంతుడు సినిమాలో రీల్ హీరో మహేశ్ బాబు ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం మనకు తెలుసు. ఈ రియల్ శ్రీమంతురాలు కామారెడ్డి జిల్లా, సీతారామ పల్లి గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్రీమంతురాలి పేరు మారంరెడ్డి రజనీరెడ్డి. తండ్రి కడప గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. పెళ్లితో పాతికేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జనగామలో అడుగుపెట్టారు. ఎల్ఐసీ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన లైఫ్ జర్నీని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది విద్యావంతుల కుటుంబం. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యంగా ఉండేది. నా భర్త నన్ను బైక్ మీద ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర దించి తాను ఆఫీస్‌కి వెళ్లాలని, సాయంత్రం పికప్ చేసుకుని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరాలని... నా ఊహలు సాగుతుండేవి. మా వారిది వ్యవసాయ కుటుంబం. ఆడవాళ్లు పెద్ద చదువులు చదవడం, ఉద్యోగం చేయడం అలవాటు లేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కోడలిగా రావడం మా మామయ్యకు ఇష్టంగా ఉండేది. కానీ ‘మన గ్రామాల్లో ఉండగలదా’ అనే సందేహం ఇంట్లో వాళ్లలో. మా అత్తమ్మ మాత్రం ‘ఒకమ్మాయికి మాట ఇచ్చిన తర్వాత ఇక వెనక్కి పోకూడదు’ అని మా వారికి మద్దతుగా నిలిచింది. అలా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చాను. గొప్ప మలుపు అప్పట్లో మా దగ్గర డబ్బు పెద్దగా ఉండేది కాదు. ఓ రోజు మావారు ఒక దోమకొండ కుర్రాడి గురించి చెప్పారు. ఆ కుర్రాడికి టెన్త్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చాయి. కాలేజ్ ఫీజులు కట్టడం కూడా కష్టమే. దాంతో కాలేజ్ వాళ్లతో మాట్లాడి ఫీజు తగ్గించి, ఆ కుర్రాడికి ఐదు వేలు ఇవ్వగలిగాం. సుభాష్ బిల్డర్‌గా కామారెడ్డిలో చిన్న కాంట్రాక్ట్‌లు చేసినప్పటికీ జీవితం అప్పటికింకా గాడిలో పడలేదు. 2004లో హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి కూడా మినిమమ్ గ్యారంటీ నా ఉద్యోగమే. అయితే హైదరాబాద్ రావడం మా లైఫ్‌లో గొప్ప టర్నింగ్ పాయింట్. ఒక ఏడాదిలోనే నిలదొక్కుకోగలిగాం. మరో ఏడాదికి భరోసా వచ్చింది. ‘కష్టపడినంత కాలం కష్టపడ్డావు, రోజూ హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఉద్యోగం మానేయచ్చు కదా’ అన్నారు. చదువుకోవడానికి వచ్చే బంధువుల పిల్లలతో నాకు ఇంటి బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. సమాజం గురించి ఆలోచించే సమయం వచ్చింది కూడా అప్పటి నుంచే. మా ఊరికి అవసరమైన పనులు చేసే వెసులుబాటు కూడా వచ్చింది. భర్త చదువుకున్న స్కూల్ జనగామలో ‘ఇంటిగ్రేటెడ్ సచివాలయం’ పేరుతో పంచాయితీ భవనం కట్టాం. అన్ని ఆఫీసులూ అందులోనే. ఆ తర్వాత లైబ్రరీ, వీథుల్లో ఎల్ఈడీ లైట్లు కూడా వేయించాం. మా ఊరిని చూసి పొరుగు గ్రామాల వాళ్లు కూడా అడిగేవాళ్లు. అలా మరో 30 గ్రామాలకు కూడా ఎల్ఈడీ లైట్లు వేయించాం. మంచి నీటి కోసం ఐదు గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు పెట్టించాం. బీబీపేటలో మా వారు చదువుకున్న స్కూల్‌ని పునర్నిర్మించాం. ఆ స్కూల్‌ని చూసిన వాళ్లు మా వారి చేతికి ఎముకలేదంటుంటారు. కోటితో మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆరు కోట్లకు చేరింది. ఆయన బిల్డర్ కావడం తో నాణ్యత విషయంలో రాజీ పడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే... మా ఊరిలో పేదవాళ్లకు ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే. ఆ బడ్జెట్ నుంచి మిగుల్చుకోవడానికే చూస్తారెవరైనా. అత్తమామలు సుశీల – నారాయణ రెడ్డిల పేరిట బీబీపేటలో కట్టించిన స్కూల్ ఆయన మాత్రం ప్రతి ఇంటికి అదనంగా రెండు లక్షలు కలిపి యాభై రెండు ఇళ్లు మంచి క్వాలిటీతో కట్టారు. మన ఊరి వాళ్లకే కదా, లెక్క చూసుకోవడం ఎందుకన్నారు. మా ఊరితోపాటు జంగంపల్లిలో మరో యాభై ఇళ్లను కూడా అలాగే కట్టారు. నాలుగు నెలల కిందట సీతారామపల్లిని దత్తత చేసుకున్నాం. ఆరు వందల జనాభా ఉన్న గ్రామం అది. ఊరంతా డ్రైనేజ్ పనులు, సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి. ఇక ఇంటిగ్రేటెడ్ సచివాలయం, కమ్యూనిటీ హాలు, లైట్లు... చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇళ్లకు మంచి నీటి సరఫరా లైన్లు మామూలుగా వేస్తే ఊరంతటికీ సమంగా అందవు. కొన్ని ఇళ్లకు ప్రెషర్ బాగా ఉంటుంది, కొన్ని వీథులకు యావరేజ్‌గా, మరికొన్ని ఇళ్లకు అరకొరగా అందుతాయి. ఆ ఇబ్బంది లేకుండా న్యూమాటిక్ సిస్టమ్ అనుసరించాలని ఎక్స్‌పర్ట్‌లతో మాట్లాడుతున్నాం’’ అని వివరించారు రజని. ఇరవై శాతం సమాజం కోసం సమాజం కోసం ఇంతగా చేస్తున్నా ఎప్పుడూ వార్తల్లో కనిపించరామె. ‘‘గ్రౌండ్ వర్క్ నాది, ప్రశంసలందుకునేది మా వారు. మహేశ్‌బాబు నుంచి కేటీఆర్ వరకు ప్రశంస లు కురిపించేది ఆయనకే. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులో ఇరవై శాతం లాభాలు సొసైటీ కోసమే అనే నియమం పెట్టుకున్నాం. ఆయన లాభాలెంత, మిగులు ఎంత అనే లెక్క నా దగ్గరే ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త పని తీసుకోవచ్చు, ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చనే అంచనా కూడా నాకే బాగా తెలుసు. తన ఖర్చులకు కూడా డబ్బు నేనే ఇవ్వాలి’’ అన్నారామె నవ్వుతూ. వీటితో సంతృప్తి చెందినట్లేనా ఇంకా చేయాలనుకుంటున్నవేమైనా ఉన్నాయా అన్నప్పుడు... తన డ్రీమ్ ప్రాజెక్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు రజని. ‘మంచి వైద్యం కోసం మా గ్రామాల వాళ్లు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కువమందికి అనువైన ప్రదేశం చూసి చారిటీ హాస్పిటల్ కట్టించాలి. తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలి. కంఫర్టబుల్‌గా జీవించే అవకాశం వచ్చింది, ఇప్పుడైనా పదిమందికి ఉపయోగపడాలి కదా’ అన్నారామె సౌమ్యంగా. తన బెర్త్‌ను దివ్యాంగుడికి ఇచ్చి తాను నిలబడిన నాటి సౌమ్యతే ఇప్పుడు కూడా ఆమె మాటల్లో. రియల్ లవ్ స్టోరీ మా పరిచయం చాలా సినిమాటిక్‌గా, రీల్ లవ్‌స్టోరీలా జరిగింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వెళ్తున్నాను. ఆమె కడపకు వెళ్తోంది. చాలా సేపటి నుంచి నిలబడి ఉంది... బహుశా టికెట్ కన్ఫర్మ్ కాలేదేమో అనుకుని పలకరించాను. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్‌కి తన బెర్త్ ఇచ్చి తాను నిలబడి ఉండడం నా మనసును కదిలించింది. అలా మాటలు కలిశాయి. ఆమె రైలు దిగి వెళ్లి పోతే ఇక ఎప్పటికీ కనిపించదేమోనని భయం పట్టుకుంది. మొబైల్ ఫోన్లు లేని రోజులవి. పేపర్ మీద నా అడ్రస్ రాసి, ‘నేను తిరుపతి నుంచి తిరిగి మా ఊరికి వెళ్లేటప్పటికి మీ నుంచి ఉత్తరం ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఆ కాగితాన్నిచ్చాను. నేను కోరుకున్నట్లే ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ప్రతి పనిలో నన్ను వెన్నంటి నడిపిస్తోంది. మనం సెటిల్ అయిన తర్వాత లాభాల్లో మిగులును సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన పాలసీనే నేను ఫాలో అయిపోతున్నాను. – టి. సుభాష్ రెడ్డి, ఎం.డి, కెడాల్ డెవలపర్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
బిల్డర్ కారును అడ్డగించి కారం పొడి చల్లి.. ఆపై కిరాతకంగా..
యశవంతపుర: బెళగావిలో మంగళవారం తెల్లవారుజామున జామున ఓ బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని గురుప్రసాద్‌నగరలో నివాసం ఉంటున్న బిల్డర్ రాజు దొడ్డబణ్ణవర (46) హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూడటానికి ఆయన కారులో వెళ్తుండగా దుండగులు కారును అడ్డగించి కారం పొడి చల్లి మారణాయుధాలతో నరికి పరారయ్యారు. మరో ఘటనలో.. వివాహిత ఆత్మహత్య యశవంతపుర: వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. బాగలకోటకు చెందిన విద్యాశ్రీ (22)ని మూడేళ్ల క్రితం బెళగావికి చెందిన ఆనంద్‌కు ఇచ్చి వివాహం చేశారు. హనూరు తాలూకా హొగ్యం గ్రామపంచాయతీ పీడీఓగా పని చేస్తున్న ఆనంద్ కొళ్లేగాలలో నివాసం ఉంటున్నారు. విద్యాశ్రీని కట్నం కోసం వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉంది. ఆనంద్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నకిలీ పత్రాలతో మాయ.. రూ. 7 కోట్లు కాజేసిన ముఠా
సాక్షి, సిటీబ్యూరో: వివాదంలో ఉన్న ప్రభుత్వ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, నగరానికి చెందిన ఓ బిల్డర్‌కు రూ.7 కోట్లకు విక్రయించిన కేసులో నిందితుల్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్కారుది కాగా... తమదే అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులూ క్లెయిమ్ చేస్తున్నారు. ఓపక్క ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా జరిగిన మోసం బయటపడింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా 9 ఎకరాల 17 గుంటల స్థలం ఉంది. ఇది తమదేనంటూ తిరుమల రాంచందర్ రావు, దర్పల్లి సంపత్, తిరుమల హరిలు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ ముగ్గురూ కలిసి ఆ స్థలంతో 2 ఎకరాలు విక్రయిస్తామని, మిగిలిన స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించడానికి ఇస్తామంటూ జుబ్లీహిల్స్‌కు చెందిన మిహిరా బిల్డ్‌కాన్ మేనేజింగ్ పార్టనర్ సి.సుఖేష్ రెడ్డిని కలిశారు. ఆ స్థలానికి సంబంధించి తయారు చేసిన నకిలీ పత్రాలు ఆయనకు అందించారు. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన సుఖేష్ కొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో రూ.7 కోట్లు చెల్లించి పత్రాలు రాసుకున్న సుఖేష్ 2 ఎకరాలు ఖరీదు చేసేలా, మిగిలింది అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆర్ధిక లావాదేవీలు కమలేశ్వర్‌రావు, ఈగ మల్లేశం, సుభాష్ చౌదరీల సమక్షంలో జరిగాయి. సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైన సుఖేష్ అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్థలం పత్రాలపై అనుమానాలు వ్యక్తమై ఆరా తీయగా అవి నకిలీవిగా తేలింది. దీంతో ఆయన జరిగిన మోసంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి నిందితులు రాంచందర్, సంపత్, హరిలను అరెస్టు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. చదవండి: మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు.. -
2కోట్లు వసూలు..ఢిల్లీ పోలీసు అరెస్ట్
న్యూఢిల్లీ : బిల్డర్ నుంచి డబ్బులు లాగేందుకు ఏకంగా గ్యాంగ్‌స్టర్ సహాయాన్ని తీసుకొని కటకటాలపాలయ్యాడు ఏ పోలీసు అధికారి. గతంలో ఈయన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి పురస్కారం సహా పలు అవార్డులు అందుకున్నారు. వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్బీర్ సింగ్ (48) ఓ బిల్డర్‌ను బెదిరించి 2 కోట్లు వసూలు చేయాలని ప్రణాళిక రచించారు. వెంటనే బిల్డర్ ఫోన్ నెంబర్‌ను గ్యాంగ్‌స్టర్ కాలాకు పంపి ప్లాన్ అమలు చేయమని కోరాడు. బిల్డర్ డబ్బులు ఇవ్వకపోతే అతని కొడుకు కారుపై దాడిచేయమని డెరెక్షన్ కూడా ఇచ్చాడు. కాల్ ఉదంతాన్ని బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదు నెలల అనంతరం రాజ్బీర్ సింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో సింగ్‌తోపాటు గ్యాంగ్‌స్టర్, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (33 కేసులు.. 22 సార్లు జైలు.. ) 2005లో రాజ్బీర్ సింగ్ రాష్ట్రపతి పురస్కారంతో పాటు, ఏడుసార్లు అసాధారన్ కార్య పురస్కార్ అవార్డులు అందుకున్నారు. 2015లో అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ కూడా పొందారు. అయితే తాజా వ్యవహారంతో పతకాలు వెనక్కి తీసుకోవాలని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ అన్నారు. ఇప్పటికే సింగ్‌ను పదవి నుంచి తొలిగించామన్నారు. ఫోన్‌డేటా ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని, ఇప్పటికే వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ కాలాకు రాజ్బీర్ సింగ్‌తో గత పది, పన్నెండేళ్లుగా పరిచయం ఉన్నట్లు విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. అయితే తనపై చేస్తున్న ఆరోపణల్ని రాజ్బీర్ సింగ్ ఖండించారు. తాను నేరం చేశానని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని తెలిపాడు. (200 మీటర్ల సొరంగం; ఆత్మాహుతి దాడికి యత్నం! ) -
రెరా పరిధిలో ఉంటే నో మార్టిగేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్టిగేజ్ వ్యవస్థకు కాలం చెల్లనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్‌లకు మార్టిగేజ్ మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 200 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలోని ప్రాజెక్ట్‌లకు 10 శాతం బిల్టప్ ఏరియాను మార్టిగేజ్ (తనఖా) చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ స్థలాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన తర్వాతే రిలీజ్ చేస్తారు. అయితే రెరా ప్రకారం.. కొనుగోలుదారులు అపార్ట్మెంట్ ధరలో 10 శాతం సొమ్మును ఓసీ వచ్చిన తర్వాతే డెవలపర్‌కు చెల్లించాలనే నిబంధన ఉంది. అలాంటప్పుడు ముందుగా జీహెచ్ఎంసీకి 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్ చేయడమనేది సరైంది కాదని డెవలపర్ల సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం స్థలాన్ని, కొనుగోలుదారులు సొమ్మును మొత్తంగా 20 శాతం నిలిచిపోతే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే డెవలపర్‌కు భారంగా మారుతుందని.. అందుకే రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్‌లకు మార్టిగేజ్ నిబంధనను తొలగించాలని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రతినిధులు బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమీషనర్ దాన కిశోర్, సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సంఘాల ప్రతినిధుల డిమాండ్లు ఏంటంటే.. అపార్ట్మెంట్ల ఎత్తు 21 మీటర్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎకరం లోపు స్థలంలో నిర్మించే అపార్ట్మెంట్లకు తప్పనిసరి సెల్లార్ నిబంధనను తొలగించాలి. 33 శాతం స్థలం పార్కింగ్ నిబంధన కారణంగా సెల్లార్, స్టిల్ట్ రెండూ తీయాల్సి వస్తుంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం.. 18 మీటర్ల లోపు ఉండే నివాస సముదాయాలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) అవసరం లేదు. దీన్ని 21 మీటర్లకు పెంచాల్సిన అవసరముంది. దీంతో జీ+5 భవనాలకు సెల్లార్ అవసరం లేకుండా రెండు స్టిల్ట్స్ నిర్మించే వీలుంటుంది. దీంతో సెల్లార్ తవ్వకం, వ్యర్థాలను పారేయడం వంటి అదనపు ఖర్చులు తగ్గుతాయి. పైగా అపార్ట్మెంట్ల ఎత్తును గణించడంతో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. మున్సిపల్ విభాగం ప్రకారం అపార్ట్మెంట్ ఎత్తు పార్కింగ్ నుంచి మొదలైతే.. అగ్నిమాపక శాఖ మాత్రం గ్రౌండ్ లెవల్ నుంచి లెక్కిస్తుంది. వెంటిలేషన్ 10 శాతం చాలు.. ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరణ (వెంటిలేషన్) సరిగా ఉండేందుకు గది బిల్టప్ ఏరియాలో 7.5 మీటర్లకు ఒక్క కిటికీ ఉండాలనే నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) చెబుతోంది. అయితే ఈ రోజుల్లో భవన నిర్మాణాలే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు వెంటిలేషన్స్ను కూడా ఎన్బీసీ నిబంధనలు వర్తింపజేయడం సరైంది కాదు. గ్రీన్ బిల్డింగ్ ప్రకారం.. గోడల ఏరియాలో 10 శాతం కిటికీలు ఉంటే సరిపోయేలా నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరముంది. డీపీఎంఎస్అప్గ్రేడ్ వర్షన్ అపార్ట్మెంట్లకు సెట్‌బ్యాక్స్, ఎత్తు వంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 21 రోజుల్లోనే అనుమతులు కూడా వచ్చేస్తున్నాయి. అదే.. మల్టీ స్టోర్, గేటెడ్ కమ్యూనిటీ వంటి ప్రత్యేక ప్రాజెక్ట్‌ల విషయంలో మాత్రం ఆన్లైన్ డీపీఎంఎస్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు సుమారు 4 నెలల సమయం పడుతుంది. అందుకే ప్రత్యేక ప్రాజెక్ట్‌లకూ డీపీఎంఎస్ వినియోగంలో ఇబ్బందుల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. -
బిల్డర్‌తో వివాదం.. ప్రధాని సాయం కోరిన నటి
తన భర్త నివాసానికి సంబంధించిన ఓ వివాదం విషయమై ప్రధాని నరేంద్ర మోదీ సాయాన్ని అర్థించాలని భావిస్తున్నారు అలనాటి బాలీవుడ్ నటి సైరాబాను. వివరాలు.. ముంబై బాంద్రా ఏరియాలో నటుడు దిలీప్ కుమార్‌కు విలాసవంతమైన భవనం ఉంది. అయితే సమీర్ భోజ్వానీ అనే బిల్డర్ నకిలీ పత్రాలతో సదరు బిల్డింగ్‌ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సైరాబాను ఆరోపించారు. గతంలో ఇదే విషయమై సదరు బిల్డర్ మీద సైరాబాను జనవరిలో కేసు పెట్టారు. ముంబయి పోలీసు విభాగానికి చెందిన ఆర్ధిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యు) అతడిపై కేసు నమోదు చేసింది. అంతకు ముందే అతడి నివాసంపై దాడులు నిర్వహించి కత్తులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకోవడమే కాక ఈ ఏడాది ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేసింది. అయితే సదరు బిల్డర్ జైలు నుంచి విడుదల కావడంతో మళ్లీ తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తాడని భావించిన సైరాబాను.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. దాంతో తన భర్త దిలీప్‌కుమార్ అధికారిక ట్విటర్ ద్వారా ‘ల్యాండ్ మాఫియా సమీర్ భోజ్వానీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతని మీద సీఎం ఫడ్నవీస్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డబ్బు, బలంతో అతను బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. భోజ్వానీ కొన్ని కీలకపత్రాలను ఫోర్జరీ చేయడం ద్వారా నాటి నటుడు దిలీప్‌కుమార్ బంగ్లాను చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. Request from Saira Banu Khan: The Hon’ble @PMOIndia Shri @narendramodi Sir, Land Mafia Samir Bhojwani realeased from Jail. No Action Taken despite assurances by CM @Dev_Fadnavis Padma Vibhushit betrayed, Threatened by money n muscle power. Request meeting wth u in #mumbai — Dilip Kumar (@TheDilipKumar) December 16, 2018 -
ఆ హీరోకు బిల్డర్ టోకరా..
న్యూఢిల్లీ : పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్‌పురి సినిమా మెగాస్టార్ రవికిషన్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్‌ను బుక్ చేసిన రవికిషన్‌కు ఇంతవరకూ బిల్డర్ ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్స్ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్న రవికిషన్‌కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్‌ను అప్పగించలేదు. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై రవికిషన్ ఫిర్యాదు చేశారు. సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
విశాఖలో బిల్డర్ రౌడీయిజం
-
జీహెచ్ఎమ్సీ అధికారులనే బురిడీ కొట్టించాడు
-
జీఎస్టీ ప్రయోజనాలు కస్టమర్లకు అందాలి
బిల్డర్లకు ప్రభుత్వం ఆదేశాలు న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రయోజనాలను ఇళ్ల ధరలు/ఇన్స్టాల్మెంట్ల తగ్గింపు రూపంలో ఇళ్ల కొనుగోలుదారులకు అందజేయాలని బిల్డర్లను ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వస్తోన్న విషయం తెలిసిందే. జీఎస్టీ అమలును బూచిగా చూపిస్తూ, మొత్తం చెల్లింపులను జూలై 1కి ముందే చెల్లించాలని ఇళ్ల కొనుగోలుదారులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జీఎస్టీ కారణంగా ఫ్లాట్ల, కాంప్లెక్స్‌ల, బిల్డింగ్‌ల నిర్మాణంపై తక్కువ పన్ను భారం పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతంలో విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష పన్నులను పరిగణనలో తీసుకుంటే, జీఎస్టీ అమలు వల్ల పన్ను భారం తక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఫ్లాట్లు బుక్ చేసుకున్న, కొంత మొత్తం చెల్లించిన కొనుగోలుదారులపై మొత్తం సొమ్ములు జూలై1కి ముందే చెల్లించాలని బిల్డర్లు ఒత్తిడి తెస్తున్నారన్న ఫిర్యాదులు తమకు అందుతున్నాయని, ఇది జీఎస్టీ చట్టానికి వ్యతిరేకమని వివరించింది. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, కాంప్లెక్స్‌లు, బిల్డింగ్‌లపై జీఎస్టీ కాంట్రాక్ట్ సర్వీస్ ట్యాక్స్రేటు 12 శాతమేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. -
పథకాలు భళా ఎంపిక ఇలా!
♦ రాయితీల ఎంపికలో తొందరపడొద్దు ♦ నిర్ధారించుకున్నాకే.. ముందడుగేయాలని సూచన ‘బుకింగ్ రోజు 25 శాతం.. మిగతా సొమ్ము గృహప్రవేశం రోజు కట్టండి’ ‘తొలి వంద మంది కస్టమర్లకు చ.అ.కు రూ.500 తగ్గింపు’ ‘రిజిస్ట్రేషన్ ఖర్చులో 25 శాతం తగ్గింపు’.. ‘క్లబ్/రిసార్ట్‌లో ఉచిత సభ్యత్వం’ ‘మాడ్యులర్ కిచెన్ ఉచితం (లేదా) కుటుంబంలో ఒకరికి ఫారిన్ ట్రిప్’ .. ఇవీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మాణ సంస్థలు ప్రకటించే తాయిలాలు. పూర్వవైభవాన్ని సంతరించుకున్న భాగ్యనగర స్థిరాస్తి రంగం.. తగ్గుముఖం పట్టిన గృహరుణాల వడ్డీ రేట్లు.. కస్టమర్ల సెంటిమెంట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు రాయితీలతో ఊరిస్తున్నారు. ఎప్పుడైనా సరే రాయితీలనేవి రెండు వైపులా పదునున్న కత్తిలాంటివే. సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ధర, ప్రాంతం, వసతులు, సౌకర్యాలు ఎంత ముఖ్యమో.. బిల్డర్ గత చరిత్ర, రాయితీలూ అంతే ముఖ్యం. ఆఫర్లున్నాయనో.. ఇప్పుడు వదులుకుంటే మళ్లీ అందుకోలేమోననో తొందరపడ్డారో అసలుకే మోసం వస్తుంది. ఎల్ఈడీ టీవీ, వాషింగ్ మిషన్, హోమ్ థియేటర్లు, పవర్ బ్యాకప్, చ.అ.కు రూ.500 వరకూ తగ్గింపు, ఉచిత పార్కింగ్, స్టాంప్ డ్యూటీ కట్టక్కర్లేదు, క్లబ్బులో ఉచిత సభ్యత్వం.. ఇలా వివిధ ప్రకటనలు గుప్పించే డెవలపర్లు బోలెడు మంది. ప్రస్తుతానికి మార్కెట్లో అమ్మకాలూ పెద్దగా లేవు కాబట్టి ఫ్లాట్లు/ప్లాట్లను ఎలాగైనా విక్రయించాలని ఆరాటపడే సంస్థలకూ లెక్కేలేదు. అసలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇవి నిజంగానే అక్కరకొస్తాయా? అనే అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకు ఆకర్షితులవుతున్నారంటే.. రెండే రెండు కారణాల వల్ల ఇలాంటి పథకాల్ని చూసి కొనుగోలుదారులు ఆకర్షితులవుతారు. ఎలాగైనా సొంతిల్లు కొనాలన్న ఆత్రుత మొదటిది కాగా.. స్థిరాస్తి విలువలు ఎప్పుడైనా పెరుగుతాయనే నమ్మకం ఉండటమే రెండో కారణం. చెల్లింపులు కూడా విడతల వారీగా చేయాల్సి ఉంటుంది కాబట్టి సొంతిల్లు కొనాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అలా ఇల్లు కొనగానే ఇలా ఇంటి విలువ పెరుగుతుందని భావించేవారంతా.. తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. గత కొన్నేళ్లుగా వ్యక్తిగత గృహాలు, ఫ్లాట్ల విలువలు పెద్దగా పెరగలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ధరల దిద్దుబాటు భారీ స్థాయిలో జరగడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. కాబట్టి నివసించడానికే ఇల్లు కావాలని భావించేవారంతా డెవలపర్లు అందించే పథకాల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసి అడుగుముందుకేయాలి. ఈఎంఐలు గృహప్రవేశం దాకా వద్దు.. ఈ పథకంలో గృహరుణం సాయంతో ఇల్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. నెలసరి వాయిదాలు కొనుగోలుదారులే భరించాలి. ఒకవేళ నిర్మాణ పనులు ఆలస్యమై.. గృహప్రవేశం ఆలస్యమైతే రుణచరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది డెవలపర్, బ్యాంకు, కొనుగోలుదారుల మధ్య కుదిరే ఒప్పందం కాబట్టి, నిర్మాణం ఆలస్యమైతే కొన్నవారే భరించాలి. పైగా ఒకవైపు అద్దె ఇంట్లో ఉంటూనే మరోవైపు బ్యాంకు వాయిదా చెల్లించాలి. ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఆ ఫ్లాట్లను విక్రయించేసి బయటపడదామనుకుంటే.. కొన్ని కారణాల వల్ల కుదరదు. నెలసరి వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. ఫలితంగా భవిష్యత్తులో రుణాలు లభించడం కష్టమవుతుంది. ఇలాంటి పథకాల్లో బ్యాంకు అందించే వడ్డీ రేటునూ పరిశీలించాలి. సాధారణ రేట్లకు సమానంగానే ఉందా? ఆర్బీఐ నిబంధనల మేరకు చలన వడ్డీ రేటు మారుతున్నప్పుడల్లా ఈ వడ్డీ రేటు కూడా తగ్గుతుందా? ఇంటి నిర్మాణం పూర్తయి అప్పగించిన తర్వాత వడ్డీ ఎంతుంటుందో రుణ ఒప్పంద పత్రాన్ని ఓసారి పరిశీలించాలి. పైగా నిర్మాణ పనులు మూడేళ్లు మించితే ముందస్తు నిర్మాణానికి సంబంధించిన వడ్డీ రాయితీని కూడా అందుకోలేరు. కాబట్టి ఈ పథకాల్ని పక్కాగా పరిశీలించాకే నిర్ణయానికి రావాలి. ఈ పథకాన్ని అందించే డెవలపర్ గత చరిత్రనూ క్షుణ్నంగా గమనించాకే అడుగుముందుకేయాలి. పార్కింగ్/రిజిస్ట్రేషన్.. ఇలాంటి పథకాల్ని డెవలపర్లు ప్రకటించినప్పుడు.. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత ధర ఎంత? అక్కడి చుట్టుపక్కల ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలెలా ఉన్నాయి? ఫ్లాటును ఎప్పుడు అందజేస్తారు? తదితర విషయాల్ని ఆరా తీయాలి. మార్కెట్ రేటు కంటే కాస్త ఎక్కువ రేటు పెట్టి ఇలాంటి రాయితీలను అందించే డెవలపర్లు లేకపోలేదు. కాబట్టి రాయితీలు ఇచ్చినప్పటికీ సకాలంలో ఫ్లాట్లను అందించకపోతే పరిస్థితి ఏంటి? నెలసరి అద్దె చెల్లిస్తారా? లేదా డెవలపర్ వడ్డీ ఏమైనా అందజేస్తాడా? ఓసారి కనుక్కోండి. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రంలో స్పష్టంగా రాతకోతలు ఉండేలా చూసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినా పరిహారం దక్కేలా చూసుకోండి. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి రాయితీల బదులు నగదు రాయితీని అందజేయమని కోరాలి. అద్దె గ్యారంటీ ఇంటికి సంబంధించిన సొమ్ము పూర్తిగా చెల్లించినవారికి కొందరు డెవలపర్లు నెలసరి అద్దె చెల్లిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్త్తున్నారు. ఏడాదికి పదికి అటుఇటుగా ఈ సొమ్ము ఉండే అవకాశముంది. ఇలాంటి పథకాల్ని డెవలపర్ ప్రకటించాడంటే.. ఆయా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన నిధుల్ని బయటి నుంచి సేకరించడంలో కష్టమవుతుందని దానర్థం. ఒకవేళ తను అద్దె చెల్లించడంలో విఫలమైతే మీకు ఆర్థిక చిక్కులు తప్పవు. కాకపోతే మీ సొమ్మును కోర్టుల ద్వారా అయినా రాబట్టుకునేలా ఒప్పం ద పత్రం ఉండేలా చూసుకోవాలి. డెవల పర్ గతంలో ఇలాంటి పథకాలకు కొనుగోలుదారులకు సొమ్ము చెల్లించాడా? లేదా? తెలుసుకోవాలి. బిల్డర్లకూ లాభమే.. సాఫ్ట్‌లాంచ్, ప్రీలాంచ్ ఆఫర్ల వంటి వాటితో కేవలం కొనుగోలుదారులకే కాదు.. నిర్మాణ సంస్థలకూ ప్రయోజనమే. ఎలాగంటే అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజె క్ట్కు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద ఆధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఈ లాంచ్ అమ్మకాలు సంస్థలకు కలిసొస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చిపెడతాయి. అంయితే ఇదంతా ఆయా నిర్మాణ సంస్థలకు మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధారపడుతుంది సుమీ. -
పోతున్న ప్రాణాలు ఒడిసిపట్టింది
బ్రిస్టల్: 'ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే బతికుండే వాడు' సాధారణంగా ఇది అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వైద్యుల నోట వినిపించే డైలాగ్. ఈ మాట వినగానే అతడి తలరాత అంతేలే అందుకే చనిపోయాడని అనుకుంటాం. కానీ, వాస్తవానికి ఆ నిమిషానికి సరిగ్గా కాపలా కాస్తే పోయే ప్రాణాన్ని అరచేతపట్టుకొని తిరిగి ఆ వ్యక్తిని బతికించవొచ్చని బ్రిస్టల్ నగరంలో నిరూపితం అయింది. పట్టపగలే కత్తిపోట్లతో పడి ఉన్న ఓ 40ఏళ్ల బిల్డర్‌ను చూసి అందరూ తమకెందుకులే అని వెళ్లిపోతుండగా నర్సుగా పనిచేస్తున్న ఆమె మాత్రం ఆగిపోయింది. తన స్నేహితుడితో కలిసి అతడి వద్దకు గబాగబా వెళ్లి మొకాలిపై కూర్చొని అతడి ప్రాణం కోసం ఎంతో ఆరాటపడింది. అతడు ఎవరూ ఏమిటీ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిగ్నిటీ అనే అహంకారానికి వెళ్లకుండా నేరుగా అతడి చేయి చేతుల్లోకి తీసుకొని పల్స్ చెక్ చేసింది. శ్వాస కూడా ఆగిపోయిన ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) పద్ధతి ద్వారా తిరిగి ఊపరిపోసింది. అంతకుముందు అతడి ఛాతీపై తన శాయశక్తులా బలంగా నొక్కుతూ క్షణాల్లో దూరమవుతున్న ఆయుషును తిరిగి తనకు అందించింది. అలా దాదాపు ఐదు నిమిషాలపాటు రోడ్డుపక్కనే ఓ ప్లాట్ ఫాం పై పడుకోబెట్టి ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆ వెంటనే బాధితుడిని బ్రిస్టల్ లోని సౌత్ మెడ్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగానే ఉంది. -
రూ.15 కోట్ల మోసగించిన బిల్డర్
విజయవాడ : తుక్కవ ధరలకే ఫ్లాట్లు ఇస్తానని విజయవాడకు చెందిన ఓ బిల్డరు కోట్లకు ఎగనామం పెట్టాడు. గుణదల ప్రాంతానికి చెందిన చలసాని శ్రీకృష్ణ సుమారు రూ. 15 కోట్ల మేర మోసగించాడంటూ బాధితులు ప్రసాదంపాడులో అతని కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2002-03 సంవత్సరం నుంచి బిల్డరు అవతారమెత్తిన శ్రీకృష్ణ కోట్ల రూపాయల్లో అడ్వాన్సులు, అప్పులు తీసుకున్నాడు. ప్రసాదంపాడులో అతనికి బంధువులు ఎక్కువగా ఉండడంతో ఈ గ్రామంలోనే రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభించి కార్యకలాపాలు మొదలు పెట్టాడు. గ్రామంలోని కొందరు స్థల యాజమానుల వద్ద నుంచి డెవలప్మెంట్కు స్థలాలు తీసుకుని గ్రూప్ హౌస్‌లు, అపార్టుమెంట్ల నిర్మాణం ప్రారంభించాడు. తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తానని నమ్మించి ముందుగానే అడ్వాన్సుల రూపంలో కోట్లలో సేకరించాడు. ప్రసాదంపాడులో బంధువులు ఎక్కువగా ఉండటం, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులను బంధు వరుసలతో పిలవడంతో అతనిపై నమ్మకం ఏర్పడి ఫైనాన్సర్లతో పాటు చిన్న వర్తకులు మొత్తం 150 మంది భారీ మొత్తంలో అప్పులు ఇచ్చారు. ఈ మొత్తం కలిపి రూ.15 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. చేసిన అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, అడ్వాన్సులు తీసుకుని ఫ్లాట్లు ఇవ్వకపోవడంపై అనుమానం వచ్చిన బాధితులు శ్రీకృష్ణను నిలదీశారు. తన బండారం బయట పడడంతో గత రెండు నెలలుగా మాయమయ్యాడు. బాధితులు గుణదలలోని అతని ఇంటి వద్దకు వెళ్లి విచారించగా అప్పటికే సొంత ఇంటిని అమ్మేసి కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. బాధితులు చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెజవాడలో బిల్డర్ ఘారానా మోసం
-
బెజవాడలో బిల్డర్ ఘారానా మోసం
విజయవాడ: విజయవాడలో ఓ బిల్డర్ ఘారానా మోసానికి పాల్పడ్డాడు. ప్రసాదంపాడులో చలసాని కృష్ణ అనే బిల్డర్ ఇళ్లు కటిస్తానని చెప్పి భారీగా నగదు వసూలు చేసి పరారయ్యాడు. సుమారు 80 మంది నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ పరారీ కావడంతో బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడ ఆయనదే హవా!
నిజామాబాద్ అర్బన్: నగరానికి అపార్ట్మెంట్ సంస్కృతిని తెచ్చినవారే నిర్మాణ రంగంలో కీలకంగా మారారు. నగరంలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో ఓ బిల్డర్ పెత్తనమే కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నిర్మాణానికి అయినా సరే ఆయన అనుమతి కావల్సిందేనని తెలుస్తోంది. కార్పొరేషన్‌లోనూ ఆయన హవానే కొనసాగుతోందని అంటున్నారు. అపార్ట్మెంట్ నిర్మాణ అనుమతి కోసం వచ్చే వారి నుంచి ఈయన సలహాలు, సూచనల పేరిట సుమారు రూ. ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని స మాచారం. సదరు బిల్డరు నగరంలో కొన్ని ప్రాంతాలలో భూమి కబ్జా చేసి మరీ అపార్టమెంట్లు నిర్మించారని చెబుతున్నారు. నగరంలో 89 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇ ందులో సుమారు 30 నుంచి 40 వరకు అపార్ట్మెంట్లకు అనుమతి లేదు. 110 ప్రయివేటు ఆసుపత్రులు ఉండగా 91 ఆస్పత్రులకు అనుమతులు లేవు. వీటిలో కొన్నిం టి కి ఈ బిల్డర్రే రక్షణగా ఉండి, కార్పొరేషన్ నుంచి చర్యలు లేకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలు ఎన్నో: ఆ బిల్డర్ చెప్పేందే వేదంగా నగరంలో ఎన్నో అక్రమ అపార్ట్మెంట్లు వెలిశాయి. అధికారులు కూడా వీటిని గుర్తించకపోవడం గమనార్హం. నగరంలోని ఖలీల్‌వాడి ప్రా ంతంలో ఓ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఓ భవంతికి అనుమతి లేదు. సుభాష్‌నగర్‌లో అతి తక్కువ స్థలంలో ఒక అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. వినాయ క్ నగర్లో వాణిజ్య సముదాయ నిర్మాణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలం తగ్గించి దుకాణాల సముదాయాలను ఏర్పాటు చేశారు. ఇది ఆయన చొర వతోనే జరిగిందని అంటున్నారు. పక్కనున్న వెయ్యి గజాల స్థలంను అక్రమించుకొని అక్రమంగా నిర్మాణం చేపట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. ఖలీల్వాడిలోని దాదాపు సగం ఆసుపత్రులు అనుమతులు లేకుండానే నిర్మించారు. జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ కూడా ఈ కోవకే చెందింది. ఖలీల్ వాడి ము దిరాజ్ సమీపంలో ఓ నిర్మాణాన్ని అనుమతి లేకున్నా పూర్తి చేశారు. న్యాల్కల్ రోడ్డులో అపార్టమెంట్ కూడా బిల్డరు సిఫారుసుతోనే అక్రమం నిర్మాణం కొనసాగిందని సమాచారం. సరస్వతీనగర్‌లోని ఓ ఆసుపత్రి నిర్మాణమూ అక్రమమేనని స్థానికులు పేర్కొంటున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ గదులు అంటూ ప్లాన్లు, సలహాల పే రిట అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. కార్పొరేషన్ అధికారులు స్పందించి ఇలాంటి చర్యలకు చమరగీతం పాడాలని నగరవాసులు కోరుతున్నారు. -
చీటింగ్ బిల్డర్ చిక్కడా?
►ఒక ఫ్లాట్‌కు నాలుగైదు రిజిస్ట్రేషన్లు ►రూ.కోట్లలో మోసగించాడని ►బాధితుల లబోదిబో ►నిందితుడికి ఓ పోలీస్ అధికారి అండ? గుంటూరు క్రైమ్ : అత్యాధునిక హంగులు.. తక్కువ ధరకే అపార్టమెంట్ ఫ్లాట్లంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లతో కొందరు బిల్డర్లు మధ్యతరగతి కుటుంబీకులను మోసగిస్తున్నారు. ఇలాంటి మోసాలపైనే ఎక్కువగా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒకే ప్లాట్‌ను నలుగురైదుగురికి చూపి.. వారివద్ద భారీగా డబ్బు దండుకుని దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న వైనం తాజాగా పోలీసుల దృష్టికి వచ్చింది. స్థానిక ఎస్వీఎన్ కాలనీ, విద్యానగర్‌లో నిర్మాణం సగంలో ఆగిపోయిన అపార్ట్మెంట్లకు సంబంధించి ప్లాట్ల కోసం డబ్బు కట్టినవారు మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఓ బిల్డర్ మోసాలపై ఏడాది క్రితం పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు, గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో నిందితుడైన బిల్డర్‌ను అరెస్ట్‌చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వున్నాయి. నిందితుడికి ఓ పోలీస్ అధికారి అండ ఉందనే ఆరోపణలు లేకపోలేదు. మోసం చేసిందిలా... ఆకురాతి శ్రీనివాసరావు అనే బిల్డర్ గుంటూరు నగరంలో రెండుచోట్ల అపార్ట్మెంట్ల నిర్మాణాలను మొదలుపెట్టారు. స్థానిక ఎస్వీఎన్ కాలనీ, విద్యానగర్లలో సాయిద్వారకా గిరిధామ్, వెంకటసాయి రెసిడెన్సీ పేరుతో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని .. రెండు, మూడు గదుల పడకగదులతో హాలు, వంట గది, అటాచ్డ్ బాత్రూమ్ సౌకర్యాలతో లగ్జరీ ప్లాట్లంటూ బుకింగ్‌లు చేశారు. నగరంలో 85 మందిపైగా వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒకే ఫ్లాట్‌ను ఒకరికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్లు చేయడం, కొందరి వద్ద అడ్వాన్స్‌లు వసూలుచేశారు. ఈ విధంగా ఒక్కో ఫ్లాట్‌ను నలుగురైదుగురు రిజిస్ట్రేషన్ చే యించుకుని డబ్బులు కట్టారు. రెండు అపార్ట్మెంట్లపై ఇలా వసూలు చేసిన మొత్తం సుమారు రూ.16 కోట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. తెనాలికి చెందిన జి.బిక్షంరెడ్డి టాంజేనియా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ పదేళ్లుగా అక్కడే భార్యాపిల్లలతో నివాసం వుంటున్నారు. విద్యానగర్‌లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ల విక్రయాలు జరుగుతున్నట్లు బంధువుల ద్వారా తెలుసుకున్నారు. బిల్డర్ శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి అన్ని వసతులతో పూర్తిచేసి ఇచ్చేలా రూ.32 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. బంధువుల ద్వారా విడతల వారీగా గతేడాది రూ. 30లక్షలు చెల్లించారు. గతేడాది నవంబరులో గుంటూరు వచ్చిన బిక్షంరెడ్డి ఫ్లాట్ చూసేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. అప్పటికే అతనికి కేటాయించిన ఫ్లాట్ మరొకరికి విక్రయంచినట్లు తెలియడంతో మోసపోయామని గుర్తించారు. ఈ తరహాలోనే మరో ఐదుగురు కూడా తమను బిల్డర్ మోసం చేశాడంటూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులో జాప్యం ఎందుకో? ఈక్రమంలో తనపై నమోదైన కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టకుండా వుండేలా బిల్డర్ శ్రీనివాసరావు గత డిసెంబరులో కోర్టును ఆశ్రయించి స్టే పొందాడు. స్టే గడువు కూడా గతనెల మూడో తేదీతో ముగిసింది. అర్బన్ జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓపోలీస్ అధికారితో శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు వున్నందు వలన అతని ఆచూకీ తెలిసినప్పటికీ సంబంధిత పోలీసు అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సాహసించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
డబ్బులిచ్చి...రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ : కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవటంతో మనస్తాపం చెందిన ఆల్విన్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఇచ్చిన రూ.30 లక్షలు తిరిగి ఇవ్వనందువల్లే తన ఆత్మహత్యకు బిల్డర్ కారణమంటూ అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దాంతో బిల్డర్ ఇంటి ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.