సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రముఖ బిల్డర్‌కు ఆకాశరామన్న ఉత్తరాలు రాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ బిల్డర్‌కు జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో ఉంటున్న పీసీహెచ్ ఈజోన్ సంస్థ అధినేత బల్విందర్ సింగ్ పదేళ్ల క్రితం ఓ స్థలాన్ని డెవలప్‌మెంట్ కోసం ఇచ్చాడు. ఆ స్థలంలో ఐదేళ్ల క్రితమే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కాగా తనకు రావాల్సిన మొత్తానికంటే సుమారు ఐదు కోట్లు అదనంగా ఇవ్వాలని బల్విందర్ సింగ్ పలుమార్లు బిల్డర్‌ను డిమాండ్ చేశాడు.
ఒప్పందం ప్రకారం... తాను మొత్తం డబ్బులు చెల్లించానని అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని బిల్డర్ చెబుతూ వస్తున్నాడు. దీనిని మనసులో పెట్టుకున్న బల్విందర్ సింగ్ బ్లాక్‌మెయిల్ చేసి కక్ష సాధించాలని కుట్రకు తెరలేపాడు. బిల్డర్ కార్యాలయంలో పని చేసే ఓ యువతి(30) పేరుతో ఆకాశ రామన్న ఉత్తరాన్ని తయారు చేశాడు. బిల్డర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆ లేఖలో కోరారు. లేఖ ప్రతులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలకు పంపాడు.
ఈ లేఖలను పంపించే పనిని తన వ్యక్తిగత పనులు నిర్వహించే బాగ్‌లింగంపల్లికి చెందిన ప్రకాశ్ (39)కు, మైసూర్‌లో పని చేసే మరో ఉద్యోగి నరేందర్(40)కు అప్పగించాడు. ఈ మేరకు లేఖలు తయారు చేసిన ప్రకాశ్ వాటిని మైసూర్‌లో ఉండే నరేందర్‌కు కొరియర్ చేశాడు. అక్కడి నుంచి పలువురికి పోస్ట్ ద్వారా ఆ లేఖలను పంపించారు. వాటిని అందుకున్న కొంతమంది స్నేహితులు ఈ విషయం గురించి చెప్పడంతో సదరు బిల్డర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు బల్విందర్‌సింగ్, నరేందర్, ప్రకాశ్‌లపై ఐపీసీ 419, 469, 389 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బలి్వందర్ సింగ్ పరారీలో ఉండగా, నరేందర్, ప్రకాశ్‌లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన పేరును దురి్వనియోగం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యువతి కూడా ఇటీవల ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది.
చదవండి 15 నిమిషాల సెల్ఫీ వీడియో.. అమ్మాయిని గదిలోకి పంపించి.. షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment