
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్‌పై శనివారం రాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్‌లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్‌ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.
కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment