Banjara Hills: ఊరిలో ఇల్లాలు, సిటీలో ప్రియురాలు.. చివరికి! | Banjara Hills Police Registered A Case On Husband For Harassing Wife | Sakshi
Sakshi News home page

Banjara Hills: ఊరిలో ఇల్లాలు, సిటీలో ప్రియురాలు.. నిజం తెలిసి!

Published Thu, Aug 26 2021 8:02 PM | Last Updated on Thu, Aug 26 2021 8:14 PM

Banjara Hills Police Registered A Case On Husband For Harassing Wife - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తపై బంజారాహిల్స్‌ పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్లగొండ జిల్లా దేవరకొండలోని శివాజీనగర్‌కు చెందిన కె. విజయ (27)కు 2010లో ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నాలుగేళ్ళ క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఆంజనేయులు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఓ భవనం వద్ద వాచ్‌మెన్‌గా చేరాడు. విజయ సొంతూరులోనే ఉంటోంది. గత కొంత కాలంగా మహేశ్వరి అనే మహిళతో ఆంజనేయులు కలిసి ఉంటున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య మూడు నెలల క్రితం నగరానికి వచ్చింది. విషయం తెలుసుకుని నిలదీసింది. దీంతో భార్యతో గొడవపడి, సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భర్త కొట్టడంతో మనస్తాపానికి గురైన విజయ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో విజయకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఆంజనేయులుపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: వివాహేతర సంబంధం వద్దన్నందుకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement