నిజామాబాద్ అర్బన్: నగరానికి అపార్ట్‌మెంట్ సంస్కృతిని తెచ్చినవారే నిర్మాణ రంగంలో కీలకంగా మారారు. నగరంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లలో ఓ బిల్డర్ పెత్తనమే కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నిర్మాణానికి అయినా సరే ఆయన అనుమతి కావల్సిందేనని తెలుస్తోంది. కార్పొరేషన్‌లోనూ ఆయన హవానే కొనసాగుతోందని అంటున్నారు.
అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతి కోసం వచ్చే వారి నుంచి ఈయన సలహాలు, సూచనల పేరిట సుమారు రూ. ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని స మాచారం. సదరు బిల్డరు నగరంలో కొన్ని ప్రాంతాలలో భూమి కబ్జా చేసి మరీ అపార్టమెంట్లు నిర్మించారని చెబుతున్నారు. నగరంలో 89 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇ ందులో సుమారు 30 నుంచి 40 వరకు అపార్ట్‌మెంట్లకు అనుమతి లేదు. 110 ప్రయివేటు ఆసుపత్రులు ఉండగా 91 ఆస్పత్రులకు అనుమతులు లేవు. వీటిలో కొన్నిం టి కి ఈ బిల్డర్‌రే రక్షణగా ఉండి, కార్పొరేషన్ నుంచి చర్యలు లేకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది.
అక్రమ నిర్మాణాలు ఎన్నో: ఆ బిల్డర్ చెప్పేందే వేదంగా నగరంలో ఎన్నో అక్రమ అపార్ట్‌మెంట్లు వెలిశాయి. అధికారులు కూడా వీటిని గుర్తించకపోవడం గమనార్హం. నగరంలోని ఖలీల్‌వాడి ప్రా ంతంలో ఓ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఓ భవంతికి అనుమతి లేదు. సుభాష్‌నగర్‌లో అతి తక్కువ స్థలంలో ఒక అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగింది. వినాయ క్ నగర్‌లో వాణిజ్య సముదాయ నిర్మాణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలం తగ్గించి దుకాణాల సముదాయాలను ఏర్పాటు చేశారు.
ఇది ఆయన చొర వతోనే జరిగిందని అంటున్నారు. పక్కనున్న వెయ్యి గజాల స్థలంను అక్రమించుకొని అక్రమంగా నిర్మాణం చేపట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. ఖలీల్‌వాడిలోని దాదాపు సగం ఆసుపత్రులు అనుమతులు లేకుండానే నిర్మించారు. జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ కూడా ఈ కోవకే చెందింది. ఖలీల్ వాడి ము దిరాజ్ సమీపంలో ఓ నిర్మాణాన్ని అనుమతి లేకున్నా పూర్తి చేశారు.
న్యాల్‌కల్ రోడ్డులో అపార్టమెంట్ కూడా బిల్డరు సిఫారుసుతోనే అక్రమం నిర్మాణం కొనసాగిందని సమాచారం. సరస్వతీనగర్‌లోని ఓ ఆసుపత్రి నిర్మాణమూ అక్రమమేనని స్థానికులు పేర్కొంటున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ గదులు అంటూ ప్లాన్‌లు, సలహాల పే రిట అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. కార్పొరేషన్ అధికారులు స్పందించి ఇలాంటి చర్యలకు చమరగీతం పాడాలని నగరవాసులు కోరుతున్నారు.
అక్కడ ఆయనదే హవా!
Published Wed, Oct 1 2014 2:50 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement