
ముంబై: మహారాష్ట్ర ముంబైలో ప్రముఖ బిల్డర్ పరాస్ పోర్వాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తు నుంచి దూకి బలవన్మరాణానికి పాల్పడ్డాడు. ముంబై చించ్‌పోక్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.
తన నివాసంలో జిమ్ బాల్కనీ నుంచి పరాస్ దూకినట్లు తెలుస్తోంది. అయితే తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని ఆయన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఈ లేఖను పరాస్ జిమ్‌లో స్వాధీనం చేసుకున్నారు.
పరాస్ కిందకు దూకిన వెంటనే అటువైపు నుంచి వెళ్తున్న ఒకరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి.. రెస్టారెంట్‌పై బకెట్ పెట్రోల్ పోసి
Comments
Please login to add a commentAdd a comment