jumped
-
బెంగళూరు పబ్‌లో చెలరేగిన మంటలు: ప్రాణభయంతో దూకేసిన యువకుడు
కర్ణాటకలోని బెంగళూరులో బహుళ అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం హుక్కా బార్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో జనం పరుగలు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టంలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత పేలుడు సంభవించింది. దీంతో మంటల్లో చిక్కుకున్న ఒక యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఇది వీడియోలో రికార్డు కావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బాధితుడు తిలక్‌నగర్‌లోని కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రద్దీగా ఉండే కోరమంగళ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం టెర్రస్‌పై ఉన్న మడ్‌పైప్ కేఫ్‌లో జరిగింది. ఈ సంఘటన వెనుక కారణాన్ని మేము ఇంకా నిర్ధారించనప్పటికీ, గ్యాస్ లీకేజీ కారణంగా పైకప్పు రెస్టారెంట్లో పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. దాదాపు 10 మంది సిబ్బంది ఉండగా వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పించుకున్నారు. 35కి పైగా అగ్నిమాపక సిబ్బందితో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలుమంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.మరోవైపు పాకిస్థాన్, ఆస్ట్రేలియా క్రికెట్ మధ్య శుక్రవారం ఇక్కడ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనలో పడిపోయారు. Blast in Bangalore. And they say India is safe. Pakistan must raise security concerns for the cricket team which is currently in this city and have their match against Australia on Friday. pic.twitter.com/SP3kkD6BjQ — Wajahat Kazmi (@KazmiWajahat) October 18, 2023 -
ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి..
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఒక యువతి 30 అడుగుల ఎత్తయిన ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకిన ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి అంతకుముందు రోజే ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలిస్తుండగా, ఆమె పిన్నికి ఖండ్వా రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై ఆ యువతి కనిపించింది. పిన్నిని చూసి ఆందోళనకు లోనైన ఆమె వెంటనే ఆ ఓవర్‌బ్రిడ్జిపై నుంచి ఒక్క ఉదుటన కిందకు దూకేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువతితో పాటు ఘటన జరిగిన సమయంలో ఒక యువకుడు ఆమె పక్కనే ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ఎస్ఎన్ కాలేజీ సమీపంలో జరిగింది. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆ యువతితో పాటు ఒక యువకుడు ముఖానికి రుమాలు కట్టుకుని ఉన్నాడని, ఈ ఘటన జరగిన వెంటనే పారిపోయాడని తెలుస్తోంది. ఆ యువతి ముందురోజు రాత్రి ఇంటిలోని ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె కారులో లిఫ్టు తీసుకుని, ఖండ్వా చేరుకున్నదని స్థానికులు చెబుతున్నారు. ఆ యువతి మర్నాటి ఉదయం తన ఇంటిలోని వారికి వీడియోకాల్ చేసి, తాను ఎవరితో ఉన్నదీ తెలియజేసింది. ఆ వీడియో కాల్లో ఎస్ఎన్ కాలనీ కనిపించిన నేపధ్యంలో ఆ యువతి తల్లి తన సోదదరిని ఆ ప్రాంతానికి వెళ్లాలని కోరింది. దీంతో ఆమె ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్లింది. ఆ యువతి తన పిన్ని తనను పిలవడాన్ని గమనించి, ఆందోళన పడుతూ బ్రిడ్రిపై నుంచి దూకేసింది. వెంటనే పిన్ని స్థానికుల సహాయంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకాశాన్ని చీల్చి, రోడ్డును తాకి, అగ్నిగోళంలా మారి.. వణికిస్తున్న పిడుగు వీడియో! -
23వ అంతస్తు నుంచి దూకిన ప్రముఖ బిల్డర్
ముంబై: మహారాష్ట్ర ముంబైలో ప్రముఖ బిల్డర్ పరాస్ పోర్వాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తు నుంచి దూకి బలవన్మరాణానికి పాల్పడ్డాడు. ముంబై చించ్‌పోక్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. తన నివాసంలో జిమ్ బాల్కనీ నుంచి పరాస్ దూకినట్లు తెలుస్తోంది. అయితే తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని ఆయన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఈ లేఖను పరాస్ జిమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. పరాస్ కిందకు దూకిన వెంటనే అటువైపు నుంచి వెళ్తున్న ఒకరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి.. రెస్టారెంట్‌పై బకెట్ పెట్రోల్ పోసి -
అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..
ముప్పాళ్ల(పల్నాడు జిల్లా): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆలనా పాలనా చూడాల్సిన తల్లి క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి కన్నబిడ్డకు అమ్మప్రేమను దూరం చేయగా, తన తోబుట్టువులా భావించే మనిషి కళ్ల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బీచ్‌లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు.. కాలువలో దూకిన చెల్లి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు ఇద్దరూ మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలోని నార్నెపాడు సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్‌రెడ్డికి నాలుగేళ్ల కిందట ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి(22)తో వివాహం జరిగింది. వారికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది కిందట ప్రమాదం జరిగి హరినాథ్‌రెడ్డికి కాలు విరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 15 రోజుల కిందట భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. హరినాథ్‌రెడ్డి వరుసకు బావ అయిన మోదుగుల వెంకటరమణారెడ్డి(47)ని తన భార్య, కుమారుడిని తీసుకురావాలని కోరారు. ఆ నేపథ్యంలో వెంకటరమణారెడ్డి ఏల్చూరు వెళ్లి ఆమె తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడాడు. కృష్ణవేణి, ఆమె కుమారుడు మహీందర్‌రెడ్డిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పాకాలపాడు బయలుదేరాడు. మండల పరిధిలోని నార్నెపాడు రోడ్డు వద్ద గల గుంటూరు బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఆమె బైకు ఆపమని కోరింది. బైకు ఆపగా వెళ్లి కాలువలో దూకింది. ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతిన్న వెంకటరమణారెడ్డి బండిపై బాలుడిని కూర్చోబెట్టి ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. అప్పటికే నీటి ప్రవాహంలో ఆమె మునిగి పోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంకటరమణారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అతను మునిగిపోయాడు. అతని మృతదేహాన్ని బయటకు తీయగా, ఆమె మృతదేహం కనిపించలేదు. నీటి ఉధృతిని మరో కాలువకు మళ్లించి గాలింపు చేపట్టారు. కాసేపటికి మృతదేహం లభ్యమైంది. ఇరువురి మృతదేహాలను శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య తెలిపారు. అమ్మ కావాలి... అమ్మ కావాలి అంటూ బాలుడు ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. అప్పటి వరకు తనతోపాటు వచ్చిన అమ్మ, మామయ్యలు కనిపించకపోవటంతో పాటు, జనాలు పెద్దఎత్తున గుమికూడి ఉండటంతో ఏమి జరిగిందో తెలియక బాలుడు విలపించసాగాడు. కొద్దిసేపటికి మృతుల బంధువులు అక్కడికి చేరుకుని బాలుడిని ఓదార్చారు. వెంకటరమణారెడ్డికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి. -
పోలీస్‌స్టేషన్ పైనుంచి దూకిన వ్యక్తి మృతి.. పోలీసులు చెప్తున్నదేంటి?
ఖిలా వరంగల్: వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన కోమాండ్ల కుమార్(40) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ గరీబ్ కాలనీకి చెందిన కోమాండ్ల కుమార్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 6న ఉదయం అబ్బనికుంటకు చెందిన సాయిని లక్ష్మి ఇంట్లో సామగ్రి సర్దేందుకు కుమార్‌తోపాటు శివరాత్రి కుమార్, కిషన్, వీరు(వీరన్న) కూలీకి వచ్చారు. ఇల్లు సర్దే క్రమంలో రూ.5వేల విలువైన ముత్యాల గొలుసు, రూ.35 వేల విలువైన బంగారు గొలుసు మాయమయ్యాయని ఇంటి యజమాని లక్ష్మి తన సోదరుడు శ్రీనివాస్‌కు చెప్పగా అతను అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఉదయం నలుగురిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. భవనంపై అంతస్తులో విచారిస్తుండగానే కుమార్ కిందికి దూకాడు. స్థానికంగా వైద్యమందించిన పోలీసులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు. కాగా.. కోమండ్ల కుమార్, శివరాత్రి కుమార్ మధ్య వాగ్వాదం జరిగిందని.. తన పేరు చెబితే చంపుతానని శివరాత్రి కుమార్ బెదిరించడం వల్లే కోమండ్ల కుమార్ భవనంపై నుంచి కిందకు దూకాడని పోలీసులు వివరణ ఇచ్చారు. తాము కొట్టడం వల్లే దూకాడన్న విషయం అవాస్తవమని పేర్కొన్నారు. పోలీసుల దెబ్బలు భరించలేకే.. మా నాన్నను పోలీసులు తీసుకొచ్చారని తెలిసి వెంటనే మేం స్టేషన్‌కు చేరుకున్నాం. అప్పటికే భవనంపై నుంచి నాన్న అరుపులు వినిపించాయి. క్షణాల్లోనే భవ నంపై నుంచి మాకళ్లెదుటే కిందకు దూకాడు. పోలీసుల దెబ్బలు భరించలేకే మా నాన్న దూకాడు. బా«ధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. – సంధ్య, మృతుడి కుమార్తె -
ఇంటికి పంపలేదని.. భవనం పైనుంచి అందరూ చూస్తుండగానే..
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయంలో చదువుతున్న విద్యార్థిని.. ఇంటికి పంపించలేదనే ఆవేదనతో భవనం పైనుంచి దూకగా గాయాలయ్యాయి. మండలంలోని తుంగారానికి చెందిన పప్పుల మురళి–కృష్ణ కుమారి దంపతుల కుమార్తె ప్రమీలను గత నెలలో కేజీబీవీలో చేర్పించారు. అప్పటి నుంచి ప్రమీల విద్యాలయంలో ఉండనని రోదిస్తుండగా, 3రోజులుగా ఇంటికి పంపించాలని కోరుతోంది. ఈ క్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంతకుమారి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే మంగళవారం ఉదయం బట్టలు ఆరేసేందుకు భవనం పై అంతస్తుకు వెళ్లి ప్రమీల అందరూ చూస్తుండగానే దూకింది. అయితే, ఆమె పడిన ప్రదేశంలో బురద గుంత ఉండటంతో గాయాలతో బయటపడింది. ఈమేరకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తర్వాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి...
తాడిపత్రి(అనంతపురం జిల్లా): పేకాటరాయుడు సాహసం చేశాడు. పోలీసులు వస్తున్నారంటూ మేడపై నుంచి కిందకు దూకేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు పద్మావతి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఓ శుభకార్యానికి హాజరైన వారిలో సుమారు 70 మంది పేకాటలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చదవండి: పోర్న్ భూతం: అరచేతిలో ‘అశ్లీలం’.. పోలీసుల రాకను గమనించిన రైల్వే కొండాపురం మండలం కోనవారిపల్లికి చెందిన శేఖరరెడ్డి.. వెంటనే చేతిలోని పేకముక్కలు పక్కన పడేసి ఫంక్షన్ హాల్ పైగది నుంచి కిందకు దూకాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిని శేఖరరెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దిక్కుకొకరు చొప్పున పరారైన మిగిలిన వారిలో ఐదుగురిని గుర్తించి గ్యాంబ్లింగ్ యాక్ట్ మేరకు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత: నీళ్లు లేని ట్యాంక్‌లో
బనశంకరి: వేట కోసం వచ్చిన చిరుత నీళ్లులేని ట్యాంక్‌లో పడిపోయిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుందాపుర కొడ్లాడిలోకి శుక్రవారం ఉదయం చొరబడిన చిరుత చంద్రశెట్టి అనే వ్యక్తి ఇంటి సమీపంలో కుక్కను వెంబడిస్తూ నీళ్లు లేని ట్యాంక్‌లో పడిపోయింది. అటవీశాఖాధికారి ప్రభాకర్ బృందం చేరుకొని చిరుతను పైకి లాగి బోనులో వేసి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. చిరుతకు 5ఏళ్ల వయస్సు ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: మామిడి తోట రక్షణ కంచెకు చిరుత బలి -
నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో
సాక్షి, ఒంగోలు: స్థానిక రంగారాయుడు చెరువులో దూకి ఓ తల్లి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో రంగారాయుడు చెరువు సమీపంలో ఓ తల్లి తన బిడ్డను ఆడిస్తూ స్థానికులకు కనిపించింది. జనం పూర్తిగా పలచబడిన తర్వాత ఆమె తన 11 నెలల బిడ్డను పొట్టకు చున్నీతో కట్టుకుని నీటిలోకి దూకింది. ఎదురుగా ఉండే అపార్టుమెంట్‌లోని ఓ మహిళ చూసి సమీపంలో వాకింగ్ చేస్తున్న యువకుడికి పెద్దగా కేకలు వేసి చెప్పింది. ఆ యువకుడు తాను నీటిలోకి దూకలేనని, పోలీసులను తీసుకొస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరకు విషయం పోలీసులకు తెలిసి 2.10 గంటలకు సంఘటన స్థలానికి వచ్చారు. అప్పటికే తల్లి, బిడ్డ మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా విషయాన్ని పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. గంట వ్యవధిలోనే మృతురాలి సోదరుడు, తల్లి సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: నిజమే.. ముగ్గురు కాదు ..ఒక్కడే! మెట్టినింట వివాదమే కారణం సుమారు రెండేళ్ల క్రితం ఒంగోలు గోపాల్‌నగర్ మొదటి లైనుకు చెందిన ఉలిచి విజయమ్మ కుమార్తె కమలను నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరిగొండకు చెందిన చిల్లకూరు అఖిలేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడో నెలలోనే బాబు జన్మించాడు. వీరితోపాటు అఖిలేష్ తల్లి, అమ్మమ్మ కూడా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో కమలకు వారితో మనస్పర్థలు వచ్చాయి. భర్త అఖిలేష్‌తో వేరు కాపురం పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అతడు ససేమిరా అన్నాడు. చివరకు ఆమె అలిగి పుట్టింటికి వస్తుంటే కన్న బిడ్డను కూడా వారి వద్దే ఉంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు అక్కడి పోలీసులు జోక్యం చేసుకుని బిడ్డను తల్లికి అప్పగించారు. అనంతరం దంపతుల మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించి పలు పర్యాయాలు పెద్ద మనుషులు, పోలీసుల ద్వారా పుట్టింటి వారు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. 40 రోజులుగా పుట్టింటి వద్ద ఉంటున్న ఆమెకు భర్త వైపు నుంచి వేరు కాపు రానికి సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. తీవ్ర మనస్తాపం చెంది కమల అఘాయిత్యానికి పాల్పడింది. చదవండి: బాగా చదువుకో.. వెళ్తున్నా ! డైరీలో అన్నకు సూచనలు కమల తన ఆవేదనను ఆత్మహత్యకు ముందు డైరీలో రాసింది. తల్లి విజయమ్మ, అన్న సిద్ధార్థలు తనను ఎంత ప్రేమగా చూసుకునేవారో పేర్కొంది. నా మరణాన్ని త్వరగా మర్చిపోవాలని, పెళ్లి చేసుకుని వదినను నాకంటే బాగా చూసుకోవాలని కోరింది. అమ్మా.. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సిందని, అత్తింటికి వెళ్లి అక్కడ నరకయాతనను ఊహించుకోవాలంటేనే కన్నీళ్లు ఆగడం లేదంటూ బాధను వ్యక్త పరిచింది. నా బిడ్డను నేను చంపుకోవాలంటే బాధగానే ఉందని, వదిలేస్తే పెద్దయ్యాక నేను ఒంటరిని చేసి వెళ్లాననే బాధ నా బిడ్డకు ఉండకూడదని, అందుకే ధైర్యం చాలకున్నా నా బిడ్డను నాతోటే తీసుకెళ్తున్నా.. అంటూ పేర్కొంది. నా మరణాన్ని అవమానకరంగా చూడొద్దని, మనం ఇచ్చిన కట్నకానుకలు తీసుకుని వారిని వదిలేయాలని అత్తింటి వారిని ఉద్దేశించి తన తల్లిని, అన్నను కమల డైరీలో కోరింది. అంతేకాకుండా తన అంత్యక్రియలు అన్న సిద్దు చేతుల మీదుగానే జరగాలని. తన పేరును కూడా ఉలిచి (పుట్టింటి పేరు) కమలగానే చూడాలంటూ కోరింది. ఒన్‌టౌన్ సీఐ సీహెచ్ సీతారాం మాట్లాడుతూ కమల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసిందని తెలిసిందని, డైరీని సీజ్ చేస్తున్నామని, పూర్తి విషయాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఎంత పని చేశావు తల్లీ!
ఆలూరు రూరల్: భర్త దారి తప్పాడు. పెళ్లి ప్రమాణాలను మరచిపోయి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయినా ఆమె భరించింది. కానీ భర్త, అతని ప్రియురాలి వేధింపులు అధికమయ్యాయి. ఇక ఓర్చుకునే శక్తి లేకపోయింది. మూడేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డకు దిక్కు ఉండరన్న భయంతో ఆ చిన్నారినీ వెంట తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన వినాయక చవితి పండుగ నాడు ఆలూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరులోని గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసముంటున్న ఏక్నాథ్ ఈరన్న, హైమావతి కుమారుడు నాగార్జునకు కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా దరూరు గ్రామానికి చెందిన చంద్రప్ప, వన్నూరమ్మ కుమార్తె శిల్పా (24)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్ఞానేశ్వరి (3) అనే కుమార్తె ఉంది. నాగార్జునకు పట్టణానికే చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం నుంచి ఆ అమ్మాయితో కలిసి వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు. విషయం తెలిసినా శిల్పా ఏమీ చేయలేక.. అత్తామామ దగ్గర ఉండేది. నాగార్జున తన ప్రియురాలిని అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి శిల్పాను మానసికంగా వేధించేవారు. ఇటీవల కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక తన భర్త ప్రవర్తనలో మార్పు రాదని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డ అనాథ అవుతుందని భయపడింది. శనివారం అత్తమామలతో కలిసి పొలానికి వెళ్లింది. అందరూ పొలం పనులలో నిమగ్నమై ఉండగా.. శిల్పా బిడ్డతో సహా సమీపంలోని నీటికుంటలో దూకింది. పొలంలో పనిచేస్తున్న వారు గమనించి బయటకు తీసేలోపు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలకు ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
అభిమానుల కోసం బారికేడ్ దూకిన ప్రియాంక గాంధీ
-
గీళ్లు జంప్ జిలానీలు
సాక్షి, మాచారెడ్డి: ఎన్నికల సమీపిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో తలమునకలవుతున్నారు. సమీకరణలు జోరందుకున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీ స్టాల్ వద్ద నరేందర్, సురేందర్ అనే ఇద్దరు యువకుల మధ్య జరిగిన ముచ్చటి ఇది. నరేందర్ టీస్టాల్ వద్ద యమ సీరియస్‌గా న్యూస్‌పేపర్ చదువుతున్నారు. ఏమ్రా నరీ అగో ఏమో గంత సీరియస్‌గా పేపర్ చదువుతున్నవేందిరా. ఏమైందిరా అండ్ల నేనచ్చి ఎంత సేపాయే ఇటుదిక్కు సూడకుండా పేపర్ల ముఖం బెట్టినవ్ ఏమ్జెప్పమంటున్నవ్రా సూరీ పేపర్ చదువుతంటు నవ్వాల్నో... ఏడ్వాల్నో సొసయిస్తలేదు. అరే నీయవ్వ బళ్లు ఓడలు, ఓడలు బళ్లవుతాయంటే ఇదేనోమేరా. అరే ఏంద్రాబై ఏమైంద్రా గట్లంటున్నవ్. అరే సూరీ ఇగో గీ వార్త సూడు మొన్నటి దాక గాల్ల వగస్ పార్టోళ్లను తిట్టరాని తిట్లు తిట్టరాకుండా తిట్టిండు. తిట్టి పోసియనంక గీయిన గా పార్టీల జేరిండు. గా పార్టీల ఉన్న ఇంకో పెద్ద మనిషి గీళ్లను దిట్టిండు. ఆగట్టునుంటవా నాగన్న... ఈ గట్టుకొస్తావా అన్నట్టు గిండ్లోళ్లు గండ్ల పోవట్టిరి. గండ్లోళ్లు గిండ్ల రావట్టిరి. ఛ నీయవ్వ మనసొంటొళ్లం గట్లవోతమారా అవురా నరీ మన పానం బోయిన గట్ల పోము. గా పెద్ద పెద్దొళ్లే జంప్ జిలానీలు అవుతుండ్రు. ఇగ గీళ్ల వశమేమొచ్చింద్రా. ఆళ్లకు నడుస్తదిరాబై... అవ్రా సూరీ గీళ్లు పార్టీలు ఎందుకు మారుతారంటవ్. అరే నరీగా గద్దెల్వదారా ఆ పార్టీల విలువ తగ్గినోళ్లు...ఈ పార్టీలొకిస్తుండ్రు. ఈ పార్టీల విలవలేనోళ్లు ఆ పార్టీలకు వోతుండ్రు గంతే గింత దానికి బుర్ర బద్దలు కొట్టుకోవడ్తివేందిరా. నిజ్జంగారా సూరీ గీళ్లను జూసీ ఆ ఊసరెల్లులు సిగ్గుపడేట్టున్నయ్. పాపం గవి ఆత్మరక్షణ కోసం రంగు మారిస్తే గీళ్లేమో వాళ్ల జేబులు నింపుకునేందుకు, పదవులు పొందేందుకు పార్టీలు మారుస్తుండ్రు. అవ్రా మస్తుగ జెప్పినవ్రా. నరీ పదవుల కోసం పజీత్ (ఇజ్జత్) దీస్కునే గీళ్లు సేవ జేస్త్రారా ఛ... ఏం రాజకీయాలో ఏమో... అరే గీ వార్త జూడు, మూడు, నాలుగు సార్లు పదవుల్ల ఎక్కినోళ్లు పాపం ఇల్లు గూడ కట్టుకోకుండా సేవ జేసిండ్రట. గీళ్లున్నారా పదవుల కోసం పాకులాడుతూ పబ్బం గడుపుకుంటరా. అవ్రా సురీ గింత మంచి ముచ్చట చెప్పున్తవ్. మరి నువ్వు రాజకీయాలల్లకు రారాదురా మస్తుగుంటది. ఆ... పోరాబై మనసొంటోళ్లను గీళ్లు గెల్వనిత్తార్నా... వద్దురా బాబు గీ రాజకీయాల జోలికి నేనువోను. అరే గట్లంటే ఎట్లరాబై.. జెర సోసాయించురా... అరే నా వంతుకు నీకు వెయ్యి ఓట్లు ఏపిస్త నువ్వు నిలవడు... అరే జోకు జెయ్యకురా బై... టీ తాగు చల్లగైతది. మస్తయింది బాతకానీ.. ఇగ పోదాంపా ఆకలైతుంది.. -
ముంబై టెక్స్టైల్ వ్యాపారులకు ఏమైంది?
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో టెక్స్టైల్ వ్యాపారుల ఆత్మహత్యలు కలవర పరుస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో మనస్తాపానికి గురైన వ్యాపార వేత్త శ్యామ్ సుందర్ కేజ్రీవాల్(54) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖాండివ్లి (ఈస్ట్) లోని ఒక ఎత్తైన టవర్ నుంచి దూకి ప్రాణాలు విడవడం ఆందోళన రేపింది. దేశీయ వస్త్రవ్యాపారానికి పెట్టింది పేరైన ముంబైలో వస్త్ర పరిశ్రమను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వ్యాపారి శ్యామ్ సుందర్ కేజ్రీవాల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కేజ్రీవాల్ తల్లి, భార్య , కుమారుడు(24) తో కలిసి థాకూర్ గ్రామంలో ఛాలెంజ్ టవర్‌లో నివసిస్తున్నారు. బోరివిలి వెళుతున్నానని చెప్పిఇంట్లోనుంచి బయలుదేరిన కేజ్రీవాల్ సమీపంలోని టవర్ పైకి ఎక్కి దూకేశారు. దీనికిముందు ‘టేక్ కేర్ ’ అంటూ కుమారుడికి వాట్సాప్ ద్వారా సందేశం పంపించారు. ఘటనా స్థలంలో తన మృతికి ఎవరూ కారణం కాదంటూ కేజ్రీవాల్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కాగా ఒక నెలలోనే ఇదే ఏరియాలో ఇద్దరు వస్త్ర వ్యాపారవేత్తలు తనువు చాలించారు. జూలై 13న టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ మనీష్ మెహతా (54) 17వ అంతస్తులోని బెడ్ రూమ్ బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో భారీ నష్టాలొచ్చాయని కుటుంబ సభ్యులతో వాపోవడం గమనార్హం. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
ధరూరు : పొలంలో కరిగెట చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడటంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధరూరుకు చెందిన దర్శెల్లి(35) కొన్నాళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్యలు పద్మ, బీసమ్మతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం పారుచర్ల స్టేజీ సమీపంలోని పొలంలో అతను కరిగెట చేస్తుండగా వాహనం బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ విశ్వనాథ్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ భర్త గోవిందు పరామర్శించారు. -
సఫారీ కారుపై చిరుత హల్చల్!
ఆఫ్రికాలో పర్యాటకులకు ఎదురైన వింత అనుభవం.. వారిని ఊపిరాడకుండా చేసింది. సఫారీ జీప్ లో ప్రయాణిస్తున్న వారికి అకస్మాత్తుగా ఎదురుపడ్డ ఓ చిరుత... ఉన్నట్టుండి జీపుపై ఉరికి ఎంతో ఆనందంగా వారిని చూస్తూ కూర్చుంది. అయితే ఎంతైనా చిరుత కదా.. దాని మౌనం వెనుక ఏ ఆలోచన ఉందోనని పర్యాటకులు ఎంతో భయపడ్డారు. గంటపాటు వారి ఓపికను పరీక్షించిన చిరుత చివరకు తనంతట తానుగా జీపు దిగి.. దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడా పర్యాటకులు తీసిన వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కెన్యాలోని మారా నేషనల్ రిజర్వ్ లో ప్రయాణికుల సఫారీ కారును అడ్డుకున్న చిరుత దాదాపు గంటపాటు వారిని కదలనీయలేదు. అయితే జీపులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టలేదు. చిరుత ఉన్నంతసేపు వారు ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తూ ఉన్న ఈ మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మసాయ్ మారా రిజర్వ్ పార్కునుంచి ఓపెన్ టాప్ సఫారీ కారు ప్రయాణిస్తుండగా ఉన్నట్లుండి కారుపైకి చిరుత ఎక్కడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ముందుగా పక్కనే ఉన్న గడ్డిలోంచి ప్రత్యక్షమైన ఆ అడవి మృగం... కుడిపక్కనుంచి జీపుఎక్కి పర్యాటకుల కెమేరావైపు తేరిపార చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడే ప్రశాతంగా కూర్చుండిపోయింది. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కారులోని పర్యాటకులు తమ భయాన్ని పంచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరుత వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. అమ్మో గుండె ఎంత స్పీడుగా కొట్టుకుందో అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. 45 నిమిషాలపాటు ఊరుకున్న టూరిస్టు గైడ్ ఇక లాభం లేదని.. చిరుత కదిలేలా లేదని తమ వాహనం ఇంజిన్ ను మెల్లగా స్టార్ట్ చేశాడు. దీంతో అప్పటిదాకా తీరిగ్గా కూచున్న చిరుత పులి పెద్దగా కాళ్ళు చాచి ప్రయాణీకులవైపు చూసింది. ఒళ్ళు విరుచుకొని కారు ముందుకు దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎట్టకేలకు ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీడియో ముగుస్తుంది. -
192 ఫీట్ల ఎత్తైన శిఖరం నుంచి నదిలోకి జంప్