Madhya Pradesh: A Girl Jumped Off The Railway Over Bridge After Seeing Her Aunt - Sakshi
Sakshi News home page

ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి..

Published Mon, Jul 17 2023 12:41 PM | Last Updated on Mon, Jul 17 2023 1:13 PM

a girl jumped off the railway over bridge after seeing her aunt - Sakshi

మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఒక యువతి 30 అడుగుల ఎత్తయిన ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకిన ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి అంతకుముందు రోజే ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎ‍క్కడికో వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలిస్తుండగా, ఆమె పిన్నికి ఖండ్వా రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై ఆ యువతి కనిపించింది. 

పిన్నిని చూసి ఆందోళనకు లోనైన ఆమె వెంటనే ఆ ఓవర్‌బ్రిడ్జిపై నుంచి ఒ‍క్క ఉదుటన కిందకు దూకేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువతితో పాటు ఘటన జరిగిన సమయంలో ఒక యువకుడు ఆమె పక్కనే ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఉదంతం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ఎస్‌ఎన్‌ కాలేజీ సమీపంలో జరిగింది. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆ యువతితో పాటు ఒక యువకుడు ముఖానికి రుమాలు కట్టుకుని ఉన్నాడని, ఈ ఘటన జరగిన వెంటనే పారిపోయాడని తెలుస్తోంది. 

ఆ యువతి ముందురోజు రాత్రి ఇంటిలోని ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె కారులో లిఫ్టు తీసుకుని, ఖండ్వా చేరుకున్నదని స్థానికులు చెబుతున్నారు. ఆ యువతి మర్నాటి ఉదయం తన ఇంటిలోని వారికి వీడియోకాల్‌ చేసి, తాను ఎవరితో ఉన్నదీ తెలియజేసింది. ఆ వీడియో కాల్‌లో ఎస్‌ఎన్‌ కాలనీ కనిపించిన నేపధ్యంలో ఆ యువతి తల్లి తన సోదదరిని ఆ ‍ప్రాంతానికి వెళ్లాలని కోరింది. దీంతో ఆమె ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్లింది. ఆ యువతి తన పిన్ని తనను పిలవడాన్ని గమనించి, ఆందోళన పడుతూ బ్రిడ్రిపై నుంచి దూకేసింది. వెంటనే పిన్ని స్థానికుల సహాయంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: ఆకాశాన్ని చీల్చి, రోడ్డును తాకి, అగ్నిగోళంలా మారి.. వణికిస్తున్న పిడుగు వీడియో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement