
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయంలో చదువుతున్న విద్యార్థిని.. ఇంటికి పంపించలేదనే ఆవేదనతో భవనం పైనుంచి దూకగా గాయాలయ్యాయి. మండలంలోని తుంగారానికి చెందిన పప్పుల మురళి–కృష్ణ కుమారి దంపతుల కుమార్తె ప్రమీలను గత నెలలో కేజీబీవీలో చేర్పించారు. అప్పటి నుంచి ప్రమీల విద్యాలయంలో ఉండనని రోదిస్తుండగా, 3రోజులుగా ఇంటికి పంపించాలని కోరుతోంది.
ఈ క్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంతకుమారి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే మంగళవారం ఉదయం బట్టలు ఆరేసేందుకు భవనం పై అంతస్తుకు వెళ్లి ప్రమీల అందరూ చూస్తుండగానే దూకింది. అయితే, ఆమె పడిన ప్రదేశంలో బురద గుంత ఉండటంతో గాయాలతో బయటపడింది. ఈమేరకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తర్వాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment