kasturba gandhi school
-
ఇంటికి పంపలేదని.. భవనం పైనుంచి అందరూ చూస్తుండగానే..
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయంలో చదువుతున్న విద్యార్థిని.. ఇంటికి పంపించలేదనే ఆవేదనతో భవనం పైనుంచి దూకగా గాయాలయ్యాయి. మండలంలోని తుంగారానికి చెందిన పప్పుల మురళి–కృష్ణ కుమారి దంపతుల కుమార్తె ప్రమీలను గత నెలలో కేజీబీవీలో చేర్పించారు. అప్పటి నుంచి ప్రమీల విద్యాలయంలో ఉండనని రోదిస్తుండగా, 3రోజులుగా ఇంటికి పంపించాలని కోరుతోంది. ఈ క్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంతకుమారి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే మంగళవారం ఉదయం బట్టలు ఆరేసేందుకు భవనం పై అంతస్తుకు వెళ్లి ప్రమీల అందరూ చూస్తుండగానే దూకింది. అయితే, ఆమె పడిన ప్రదేశంలో బురద గుంత ఉండటంతో గాయాలతో బయటపడింది. ఈమేరకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తర్వాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
40 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇటా: ఉత్తరప్రదేశ్‌లో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటాలో కస్తూర్బా గాంధీ స్కూల్లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం విషపూరితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. Etah: More than 40 students of Kasturba Gandhi School admitted to hospital due to food poisoning after consuming mid-day meal. pic.twitter.com/q513AvDwPt — ANI UP (@ANINewsUP) March 16, 2018 -
కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన
తిప్పర్తి: కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతుల విషయంలో ప్రిన్సిపల్‌ను ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహించిన విద్యార్థినులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. -
అడ్మిషన్ తీసుకొని వెళ్లగొట్టారు
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘటన వికారాబాద్ రూరల్: నెల రోజుల క్రితం పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని అనంతరం బాలికను బయటకు పంపించారు. ఈ సంఘటన వికారాబాద్ పట్టణ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. షాబాద్ మండలం మనుమర్రి గ్రామానికి చెందిన సత్యనారాయణ కూతురు సౌమ్య గురుకుల ప్రవేశ పరీక్ష రాసింది. వికారాబాద్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఆరో తరగతికి సీటు రావడంతో జూన్ 18న వికారాబాద్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో సౌమ్యను చేర్పించారు. నెల రోజులు గడిచాక బుధవారం పాఠశాల నుంచి సౌమ్య తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసిన ఉపాధ్యాయులు..మీ కూతురు అడ్మిషన్ విషయంలో మాట్లాడాలని చెప్పారు. దీంతో సత్యనారాయణ గురువారం పాఠశాలకు చేరుకునేలోపు సౌమ్య పాఠశాల ఆవరణలోని చెట్టు కింద సామానుతో ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన సత్యనారాయణ ఈ విషయమై ఉపాధ్యాయులను నిలదీయగా స్పందన రాలేదు. విషయం తెలుసుకున్న వికారాబాద్ జెడ్పీటీసీ ముత్తార్‌షరీఫ్ అక్కడికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. తల్లిదండ్రులు రాకముందే విద్యార్థినిని ఎలా బయటకు పంపిస్తారని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక ఉపాధ్యాయులు నీళ్లు నమిలారు. విద్యార్థిని మహబూబ్‌నగర్ జిల్లాలోని పాఠశాలలో చదవడంతో ఆమె అడ్మిషన్‌ను వెనక్కి పంపినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వర్ణలత చెప్పారు. విద్యార్థిని జిల్లాలోని షాబాద్ మండలానికి చెందినా రెండేళ్ల పాటు మహబూబ్‌నగర్‌లో చదివిందన్నారు. అంతమాత్రాన జిల్లాకు సంబంధం లేనట్లుగా బయటకు పంపుతారా..? అని జెడ్పీటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, నెలరోజుల పాటు విద్యార్థిని పాఠశాలలో భోజనం, బస చేసినందుకు ఉపాధ్యాయులు డబ్బులు అడిగారని ఆరోపించారు. -
‘కస్తూర్బా’ నుంచి ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్
♦ టీసీ ఇచ్చి పంపించేసిన అధికారులు ♦ విచారణ చేపట్టిన జీసీడీవో శకుంతల ఎడపల్లి : ఎడపల్లి శివారులో గల కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆరో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు ఈ నెల 17న రాత్రి అనుమతి లేకుండా పాఠశాల నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, అటుగా వచ్చిన కారు డ్రైవర్ వారిని గమనించి స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించారు. దీంతో పోలీసులు కాస్తుర్బా పాఠశాల ప్రిన్సిపల్‌కు సమాచారమివ్వగా, ఆమె వచ్చి విద్యార్థినులను పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారం డీఈవోకు తెలియడంతో విచారణ జరపాలని బాలికల సంరక్షణ అధికారి (జీసీడీవో) శకుంతలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం కస్తూర్బా పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థినులు బయటకు పోతున్నా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న వార్డెన్‌ను ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ మీరాబాయి, నైట్ వాచమన్ మహేరాబేగం, హెచ్ఎం కాయకాసంలను విచారించారు. ఇంత జరిగినా అధికారులకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముదం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించి, టీసీ ఇచ్చి పంపించేశారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
పరిగి : రెండు రోజుల్లో జరగాల్సిన బాల్యవివాహాన్ని పోలీసులు, ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు ఆదివారం అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన మమత (14) పరిగి నంబర్ 1 ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మూడు రోజుల క్రితం బాలికకు మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండల రుద్రారానికి చెందిన మల్లేశం (40)కి ఇచ్చి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. మల్లేశంకు ఇది రెండో వివాహం. అయితే ఈ విషయం ఉపాధ్యాయుల ద్వారా ఎంవీఎఫ్ ఆర్గనైజర్లకు తెలిసింది. వారు ఎస్ఐ నగేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన శనివారం రాత్రి సిబ్బందితో అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి పనులను నిలిపి వేయించాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆదివారం ఉదయం ఎంవీఎఫ్ సిబ్బందితో కలిసి మరో మారు బాలిక తల్లిదండ్రులకు, పెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం బాలికను కస్తూర్బా గాంధీ పాఠశాలకు పంపించారు. వివాహ వయస్సు వచ్చే వరకు వివాహం చేయరాదని వారి వద్ద రాయించుకున్నారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు రాములు, నరసింహులు, దేవకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కస్తూరిబాలో ఆకలి కేకలు
సంతమాగులూరు, న్యూస్‌లైన్: పేద కుటుంబాల్లోని బాలికలను విద్యావంతులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల లక్ష్యం అటకెక్కుతోంది. సంతమాగులూరు మండలం పత్తేపురం హిందూ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న కస్తూరిబా పాఠశాలలోని విద్యార్థినులకు సక్రమంగా భోజనం పెట్టకపోవడంతో వారు ఇంటిదారి పడుతున్నారు. సంతమాగులూరులో 2011లో కేజీబీవీని అద్దెభవనంలో ప్రారంభించారు. అక్కడ విద్యార్థినులకు కనీస వసతులు కూడా లేకపోవడంతో 2013 లో ఈ పాఠశాలను పత్తేపురం హిందూ ప్రాథమిక పాఠశాలలోకి మార్చారు. పాఠశాల మార్చిన తరువాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి 185 మందికి చేరింది. కేజీబీవీలకు మహిళా అధ్యాపకులే ఎస్‌ఓలుగా పనిచేయాలనే నిబంధన రావడంతో 2012 నవంబర్‌లో కొరిశపాడు మండలం తిమ్మాయపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మణమ్మ సంతమాగులూరు కేజీబీవీ ఎస్ఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అరకొర వసతులతో పాఠశాల నిర్వహిస్తూ వచ్చారు. 2013 విద్యా సంవత్సరంలో కేజీబీవీలకు ఎస్‌ఓలుగా కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అప్పటి నుంచి తనను ఎక్కడ బాధ్యతల నుంచి తొలగిస్తారోనని ఎస్ఓ మణమ్మ సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ఐదు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. విద్యార్థుల మెనూను కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. రోజూ ఆహారంలో ఇవ్వాల్సిన కోడిగుడ్డు ఇవ్వక మూడు నెలలైంది. ఉదయం పూట అల్పాహారం మానేసి కూడా మూడు నెలలు దాటింది. మజ్జిగ పోయక రెండు నెలలు. సాయంత్రం వేళ ఇవ్వాల్సిన ఫలాల విషయం వీరికి అసలు తెలియదు. భోజనంలోకి కూరలు లేక పోవడంతో బాలికలు ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న పచ్చళ్లతో, కారంతో సరిపెట్టుకుంటున్నారు. బియ్యం ఉన్నా కూరలకు మాత్రం ఎస్ఓ తగినంత డబ్బు ఇవ్వక పోవడంతో రెండు మూడు రోజులకు ఒక కూర చేస్తూ వంటవారు తమ పని ముగిస్తున్నారు. ఒక్కో రోజు వంటవారు అన్నం మాత్రం వండుతుండటంతో పచ్చళ్లు వేసుకుని తిని కడుపునింపుకోవాల్సి వ స్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ ఆకలి కేకలు తెలిసిన బాలికల తల్లిదండ్రులు వారిని పాఠశాల మాన్పించి వేస్తుండటంతో 185 మంది పిల్లలకు గాను సంక్రాంతి తరువాత 70 మంది మాత్రమే తిరిగి పాఠశాలకు వచ్చారు. నిధులు లేకే ఇబ్బందులు... ఎస్ఓ మణమ్మ, ఎస్ఓ బడ్జెట్ రాకనే ఇబ్బందులు పడుతున్నా. పాఠశాలలో అంతగా ఇబ్బందులేమీలేవే . జీతాలకు సంబంధించి సెప్టెంబర్ నిధులు వచ్చినా సిబ్బందికి ఇంకా ఇవ్వలేదు. వాటిని సోమవారంలోగా చెల్లిస్తాను. ప్రభుత్వం నుంచి మూడు నెలలకు 1.50 లక్షలు రావాల్సి ఉంది. పిల్లల ఆహారానికి సంబంధించిన నిధులు ఐదు నెలలకు 4 లక్షలు రావాలి. -
‘కస్తూర్బా’లో పర్యవేక్షణ కరువు
‘కస్తూర్బా’లో పర్యవేక్షణ కరువు విద్యాలయాలలో సిబ్బంది ఇష్టారాజ్యం స్థానికంగా ఉండని ఉద్యోగులు ఎప్పుడో అటకెక్కిన వైద్యసేవలు నిర్వహణ లోపం.. విద్యార్థులకు శాపం ‘పిట్లం’ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాల యాల నిర్వహణలో నిండా నిర్లక్ష్యం పేరుకుపోయింది. అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమం గా లేకపోవడంతో అనుకోని దారుణాలు జరుగుతున్నాయి. పిట్లం కస్తూర్బా విద్యాలయంలో ఒక విద్యార్థిని ప్రసవించిన వైనం ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. బడికి దూరంగా ఉన్న ఆడ పిల్లలకు వసతి ఏర్పాటు చేసి విద్యనందించే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ విద్యాలయాలను నెలకొల్పింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు, వివక్షకు గురైన పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, నిర్వహణ లోపాలు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో 36 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నా యి. ఇందులో రాష్ట్రీయ విద్యామిషన్ పరిధిలో 19, ఏపీ రెసిడెన్షియల్ పరిధిలో తొమ్మిది, గిరి జన సంక్షేమ శాఖ పరిధిలో ఐదు, సాంఘిక సం క్షేమ శాఖ పరిధిలో మూడు నడుస్తున్నాయి. వీటన్నింటిలో మొత్తం 5,891 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఒక్కో విద్యాలయంలో ఒక ప్రత్యేక అధికారి, ఏడుగురు అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్ఎంతో పాటు నలుగురు సిబ్బం ది ఉంటారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారి, అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్ఎం విద్యాలయంలోనే ఉంటూ సేవలందించాలి. ఉద్యోగ నియామకం సమయంలోనే అధికారులు వీరికి ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. కాగా తర్వాత ఉద్యోగులు ఏవో కారణాలు చెబుతూ విద్యాల యాలలో ఉండకుండా రాకపోకలు సాగిస్తున్నా రు. దీంతో పర్యవేక్షణ లేక అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా ఇటీవల రెంజల్, బాన్సువాడ కస్తూర్బా విద్యాలయాలలో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం, పారిశుధ్య లోపంతోనే విద్యార్థినులు వాంతు లు, విరోచనాలు చేసుకున్నట్లు అధికారులు తర్వాత తేల్చారు. ప్రస్తుతం పిట్లంలో విద్యార్థిని ప్రసవం విద్యాలయాల నిర్వహణ లోపాలకు అద్దం పడుతోంది. విద్యాలయం నుంచి బాలిక ఇంటికి వెళ్లి రెండు నెలలు గడిచినా ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తర్వాత వచ్చిన బాలికను నిరభ్యంతరంగా చేర్చుకున్నారు.