- ‘కస్తూర్బా’లో పర్యవేక్షణ కరువు
- విద్యాలయాలలో సిబ్బంది ఇష్టారాజ్యం
- స్థానికంగా ఉండని ఉద్యోగులు
- ఎప్పుడో అటకెక్కిన వైద్యసేవలు
- నిర్వహణ లోపం.. విద్యార్థులకు శాపం
- ‘పిట్లం’ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాల యాల నిర్వహణలో నిండా నిర్లక్ష్యం పేరుకుపోయింది. అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమం గా లేకపోవడంతో అనుకోని దారుణాలు జరుగుతున్నాయి. పిట్లం కస్తూర్బా విద్యాలయంలో ఒక విద్యార్థిని ప్రసవించిన వైనం ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. బడికి దూరంగా ఉన్న ఆడ పిల్లలకు వసతి ఏర్పాటు చేసి విద్యనందించే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ విద్యాలయాలను నెలకొల్పింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు, వివక్షకు గురైన పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, నిర్వహణ లోపాలు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 36 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నా యి. ఇందులో రాష్ట్రీయ విద్యామిషన్ పరిధిలో 19, ఏపీ రెసిడెన్షియల్ పరిధిలో తొమ్మిది, గిరి జన సంక్షేమ శాఖ పరిధిలో ఐదు, సాంఘిక సం క్షేమ శాఖ పరిధిలో మూడు నడుస్తున్నాయి. వీటన్నింటిలో మొత్తం 5,891 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఒక్కో విద్యాలయంలో ఒక ప్రత్యేక అధికారి, ఏడుగురు అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్‌ఎంతో పాటు నలుగురు సిబ్బం ది ఉంటారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారి, అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్‌ఎం విద్యాలయంలోనే ఉంటూ సేవలందించాలి. ఉద్యోగ నియామకం సమయంలోనే అధికారులు వీరికి ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. కాగా తర్వాత ఉద్యోగులు ఏవో కారణాలు చెబుతూ విద్యాల యాలలో ఉండకుండా రాకపోకలు సాగిస్తున్నా రు. దీంతో పర్యవేక్షణ లేక అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకుంటున్నాయి.
గతంలో కూడా
ఇటీవల రెంజల్, బాన్సువాడ కస్తూర్బా విద్యాలయాలలో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం, పారిశుధ్య లోపంతోనే విద్యార్థినులు వాంతు లు, విరోచనాలు చేసుకున్నట్లు అధికారులు తర్వాత తేల్చారు. ప్రస్తుతం పిట్లంలో విద్యార్థిని ప్రసవం విద్యాలయాల నిర్వహణ లోపాలకు అద్దం పడుతోంది. విద్యాలయం నుంచి బాలిక ఇంటికి వెళ్లి రెండు నెలలు గడిచినా ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తర్వాత వచ్చిన బాలికను నిరభ్యంతరంగా చేర్చుకున్నారు.