కర్ణాటకలోని బెంగళూరులో బహుళ అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం హుక్కా బార్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో జనం పరుగలు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టంలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
అగ్నిప్రమాదం తర్వాత పేలుడు సంభవించింది. దీంతో మంటల్లో చిక్కుకున్న ఒక యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఇది వీడియోలో రికార్డు కావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బాధితుడు తిలక్‌నగర్‌లోని కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రద్దీగా ఉండే కోరమంగళ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం టెర్రస్‌పై ఉన్న మడ్‌పైప్ కేఫ్‌లో జరిగింది. ఈ సంఘటన వెనుక కారణాన్ని మేము ఇంకా నిర్ధారించనప్పటికీ, గ్యాస్ లీకేజీ కారణంగా పైకప్పు రెస్టారెంట్‌లో పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.
దాదాపు 10 మంది సిబ్బంది ఉండగా వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పించుకున్నారు. 35కి పైగా అగ్నిమాపక సిబ్బందితో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలుమంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.మరోవైపు పాకిస్థాన్, ఆస్ట్రేలియా క్రికెట్ మధ్య శుక్రవారం ఇక్కడ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనలో పడిపోయారు.
Blast in Bangalore. And they say India is safe. Pakistan must raise security concerns for the cricket team which is currently in this city and have their match against Australia on Friday. pic.twitter.com/SP3kkD6BjQ
— Wajahat Kazmi (@KazmiWajahat) October 18, 2023
Comments
Please login to add a commentAdd a comment