ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి... | Man Jumped From Building In Fear Police Were Coming In Tadipatri | Sakshi
Sakshi News home page

ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి...

Published Mon, Dec 20 2021 10:01 AM | Last Updated on Mon, Dec 20 2021 10:01 AM

Man Jumped From Building In Fear Police Were Coming In Tadipatri - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తాడిపత్రి(అనంతపురం జిల్లా): పేకాటరాయుడు సాహసం చేశాడు. పోలీసులు వస్తున్నారంటూ మేడపై నుంచి కిందకు దూకేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు పద్మావతి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఓ శుభకార్యానికి హాజరైన వారిలో సుమారు 70 మంది పేకాటలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

చదవండి: పోర్న్‌ భూతం: అరచేతిలో ‘అశ్లీలం’..

పోలీసుల రాకను గమనించిన రైల్వే కొండాపురం మండలం కోనవారిపల్లికి చెందిన శేఖరరెడ్డి.. వెంటనే చేతిలోని పేకముక్కలు పక్కన పడేసి ఫంక్షన్‌ హాల్‌ పైగది నుంచి కిందకు దూకాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిని శేఖరరెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దిక్కుకొకరు చొప్పున పరారైన మిగిలిన వారిలో ఐదుగురిని గుర్తించి గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ మేరకు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement