Card game
-
‘అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?’
లక్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్‌వాది పార్టీ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్‌గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్‌వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్‌నిగంధ బాక్స్‌ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक! महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे। इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे। बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 pic.twitter.com/822d0fQDG7 — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చిన భారత్ -
ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి...
తాడిపత్రి(అనంతపురం జిల్లా): పేకాటరాయుడు సాహసం చేశాడు. పోలీసులు వస్తున్నారంటూ మేడపై నుంచి కిందకు దూకేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు పద్మావతి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఓ శుభకార్యానికి హాజరైన వారిలో సుమారు 70 మంది పేకాటలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చదవండి: పోర్న్ భూతం: అరచేతిలో ‘అశ్లీలం’.. పోలీసుల రాకను గమనించిన రైల్వే కొండాపురం మండలం కోనవారిపల్లికి చెందిన శేఖరరెడ్డి.. వెంటనే చేతిలోని పేకముక్కలు పక్కన పడేసి ఫంక్షన్ హాల్ పైగది నుంచి కిందకు దూకాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిని శేఖరరెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దిక్కుకొకరు చొప్పున పరారైన మిగిలిన వారిలో ఐదుగురిని గుర్తించి గ్యాంబ్లింగ్ యాక్ట్ మేరకు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. -
ఎంపీ మాగంటి బాబు ఆఫీస్‌లో పేకాట.. ఎస్పీ ఆగ్రహం!
సాక్షి, కృష్ణా: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా... జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేసిన ఘటనగా తాజాగా కలకలం రేపుతోంది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుకు చెందిన కృష్ణా జిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. 5వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా వసూలు చేసి... కనీసం 5 లక్షల రూపాయలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు 12 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంపీ మగంటి బాబు కార్యాలయంలో పేకాట కొనసాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంపీ మగంటి తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఈ మేరకు 'సాక్షి' ప్రచురించిన కథనాలపై జిల్లా పోలీసులు స్పందించారు. ఎంపీ మాగంటి బాబు కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. నెలల తరబడి పేకాట శిబిరం నడుస్తున్నా.. ఎందుకు పట్టించుకోలేదని స్థానిక పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
భాగ్యనగర్ కాలనీ (హైదరాబాద్) : పేకాట స్థావరంపై కూకట్పల్లి పోలీసులు మంగళవారం దాడి చేసి నిర్వాహకుడితో పాటు 10 మందిని అరెస్టు చేశారు. కూకట్పల్లి హెచ్ఎంటీ శాతవాహన నగర్‌లోని వాటర్ ట్యాంకర్ సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ క్రాంతి కుమార్ సిబ్బందితో ఆ స్థావరంపై దాడి చేసి నిర్వాహకుడు శ్రీనివాస్ సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,900 నగదు, మూడు బైక్‌లు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని శాంతినగర్‌లో ఓ పేకాట స్థావరంపై స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.53 వేల నగదు, మూడు సెల్ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట అడ్డాపై దాడి : 12 మంది అరెస్టు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : పేకాట అడ్డాపై పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. కొంపల్లి సురేఖ ఆస్పత్రి వెనుక భాగంలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో శుక్రవారం పేకాట అడ్డాపై ఆకస్మిక దాడి చేయగా 12 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 65,900 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు.