సాక్షి, కృష్ణా: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా... జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేసిన ఘటనగా తాజాగా కలకలం రేపుతోంది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుకు చెందిన కృష్ణా జిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. 5వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా వసూలు చేసి... కనీసం 5 లక్షల రూపాయలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు 12 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఎంపీ మగంటి బాబు కార్యాలయంలో పేకాట కొనసాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంపీ మగంటి తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఈ మేరకు 'సాక్షి' ప్రచురించిన కథనాలపై జిల్లా పోలీసులు స్పందించారు. ఎంపీ మాగంటి బాబు కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. నెలల తరబడి పేకాట శిబిరం నడుస్తున్నా.. ఎందుకు పట్టించుకోలేదని స్థానిక పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment