
న్యూఢిల్లీ : బిల్డర్ నుంచి డబ్బులు లాగేందుకు ఏకంగా గ్యాంగ్‌స్టర్ సహాయాన్ని తీసుకొని కటకటాలపాలయ్యాడు ఏ పోలీసు అధికారి. గతంలో ఈయన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి పురస్కారం సహా పలు అవార్డులు అందుకున్నారు. వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌బీర్ సింగ్ (48) ఓ బిల్డర్‌ను బెదిరించి 2 కోట్లు వసూలు చేయాలని ప్రణాళిక రచించారు. వెంటనే బిల్డర్ ఫోన్ నెంబర్‌ను గ్యాంగ్‌స్టర్ కాలాకు పంపి ప్లాన్ అమలు చేయమని కోరాడు. బిల్డర్ డబ్బులు ఇవ్వకపోతే అతని కొడుకు కారుపై దాడిచేయమని డెరెక్షన్ కూడా ఇచ్చాడు. కాల్ ఉదంతాన్ని బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదు నెలల అనంతరం రాజ్‌బీర్ సింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో సింగ్‌తోపాటు గ్యాంగ్‌స్టర్, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (33 కేసులు.. 22 సార్లు జైలు.. )
2005లో రాజ్‌బీర్ సింగ్ రాష్ట్రపతి పురస్కారంతో పాటు, ఏడుసార్లు అసాధారన్ కార్య పురస్కార్ అవార్డులు అందుకున్నారు. 2015లో అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ కూడా పొందారు. అయితే తాజా వ్యవహారంతో పతకాలు వెనక్కి తీసుకోవాలని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ అన్నారు. ఇప్పటికే సింగ్‌ను పదవి నుంచి తొలిగించామన్నారు. ఫోన్‌డేటా ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని, ఇప్పటికే వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ కాలాకు రాజ్‌బీర్ సింగ్‌తో గత పది, పన్నెండేళ్లుగా పరిచయం ఉన్నట్లు విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. అయితే తనపై చేస్తున్న ఆరోపణల్ని రాజ్‌బీర్ సింగ్ ఖండించారు. తాను నేరం చేశానని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని తెలిపాడు. (200 మీటర్ల సొరంగం; ఆత్మాహుతి దాడికి యత్నం! )
Comments
Please login to add a commentAdd a comment