కొత్త అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా..ఇంకా నిర్మాణం పూర్తవ్వకముందే బుక్ చేసుకుంటున్నారా..అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే. ఒప్పందం ప్రకారమే నిర్మాణం పూర్తవుతుందని బిల్డర్ హామీ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి తాళాలు ఇవ్వకపోతే, జాప్యం జరిగిన సమయానికి అదనంగా 6 శాతం వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తానని చెబుతుంటాడు. అయితే అనుకున్న సమయానికి మీరే ఫ్లాట్ ధర చెల్లించడంలో ఆలస్యం చేస్తే మాత్రం సుమారు 18 శాతం వడ్డీ కట్టాలని ఒప్పందం చేసుకుంటాడు.
రియల్ ఎస్టేట్ రిగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం..ముందే చేసుకున్న ఒప్పందం ఆధారంగా నిర్మాణం పూర్తి చేయడంలో బిల్డర్లు విఫలమైతే వినియోగదారులకు ఏమేరకు వడ్డీ చెల్లిస్తారో అదే మొత్తం వినియోగదారుల చెల్లింపులకు వర్తిస్తుంది. పైన తెలిపిన విధంగా చూస్తే, అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయకపోతే 6 శాతం వడ్డీతో డబ్బు చెల్లిస్తానని బిల్డర్ చెబుతాడు. ఒకవేళ ఫ్లాట్ కొనుగోలుదారుడు కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల చెల్లింపులు జాప్యం చేస్తే అదే వడ్డీని లెక్కగట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రెరా చట్టం ప్రకారం ఎక్కువ వడ్డీ చెల్లించకూడదు.
ఇదీ చదవండి: భారీ పెట్టుబడులకు చర్చలు
Comments
Please login to add a commentAdd a comment