Greater Noida Authority
-
బిల్డర్ ప్లాట్ స్కీమ్‌లో 8,000 ఫ్లాట్లు!
గ్రేటర్ నోయిడా అథారిటీ ఐదు బిల్డర్ ప్లాట్ల కేటాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో కనీస ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందని, 8,000 కొత్త ఫ్లాట్ల నిర్మాణం నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో ఈ-వేలం ద్వారా కేటాయింపు జరుగుతుందని అధికారిక ప్రకటనలో అథారిటీ తెలిపింది.గ్రేటర్ నోయిడా అథారిటీ బిల్డర్ విభాగం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మొత్తం 99,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వన్ ఎ, ఎంయూ, సిగ్మా 3, ఆల్ఫా 2, పై వన్ సెక్టార్లలో ప్లాట్లు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాను ఆగ్రా, మథురలతో కలిపే యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే (ఈపీఈ)తో ఈ సెక్టార్లకు మంచి కనెక్టివిటీ ఉందని అధికారులు తెలిపారు. ఈ సెక్టార్లు జెవార్‌లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడా అనుసంధానం కానున్నాయి.ప్లాట్ పరిమాణం, స్థలాన్ని బట్టి చదరపు మీటరుకు రూ.48,438 నుంచి రూ.54,493 వరకు ధర నిర్ణయించారు. రిజర్వ్ ధర ప్రకారం ఈ ఐదు భూముల మొత్తం ధర సుమారు రూ.500 కోట్లు. ప్లాట్ల కేటాయింపు ఈ-వేలం ద్వారా జరుగుతుంది. దీని తేదీని ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ జూలై 2న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 23. ఆసక్తి గలవారు జూలై 29లోగా తమ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్‌లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్‌లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నోయిడా ఎక్స్టెన్షన్లో భూసేకరణకు సమర్థన
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని భూసేకరణ వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవడానికి సుప్రీకోర్టు గురువారం నిరాకరించింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. నోయిడా ఎక్స్టెన్షన్లో భూసేకరణను రద్దు చేసి తమ భూములు వెనక్కి ఇప్పించాలని, లేదా అధిక నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కానీ గ్రేటర్ నోయిడా అథారిటీ అందుకు అంగీకరించడం లేదు. భూసేకరణను రద్దు చేసేది లేదని పేర్కొంటూ అభివృద్ధి చేసిన భూమిలో 10 శాతం రైతులకు ఇవ్వాలని, వారికి నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని గ్రేటర్ నోయిడా అథారిటీని ఆదేశిస్తూ అలహాబాద్ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దానిని సవాలుచేస్తూ రైతులు, గ్రేటర్ నోయిడా అథారిటీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటన్నింటినీ కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులే అమలవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం నిర్ణయం బిల్డర్లకు, నోయిడా ఎక్స్టెన్షన్లో ఫ్లాట్లు కొన్నవారికి, గ్రేటర్ నోయిడా అథారిటీకి ఊరటనిన్చింది. సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించనట్లయితే రైతుల భూముల్లో నిర్మించిన భవనాలను కూలగొట్టవలసి వచ్చేదని ఓ న్యాయవాది తెలిపారు. ఈ తీర్పు నోయిడా ఎక్స్టెన్షన్ పరిధి కింద ఉన్న 65 గ్రామాల రైతులపై ప్రభావం చూపనుంది.