సాక్షి, న్యూఢిల్లీ: నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని భూసేకరణ వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవడానికి సుప్రీకోర్టు గురువారం నిరాకరించింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో భూసేకరణను రద్దు చేసి తమ భూములు వెనక్కి ఇప్పించాలని, లేదా అధిక నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కానీ గ్రేటర్ నోయిడా అథారిటీ అందుకు అంగీకరించడం లేదు. భూసేకరణను రద్దు చేసేది లేదని పేర్కొంటూ అభివృద్ధి చేసిన భూమిలో 10 శాతం రైతులకు ఇవ్వాలని, వారికి నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని గ్రేటర్ నోయిడా అథారిటీని ఆదేశిస్తూ అలహాబాద్ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.
దానిని సవాలుచేస్తూ రైతులు, గ్రేటర్ నోయిడా అథారిటీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటన్నింటినీ కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులే అమలవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం నిర్ణయం బిల్డర్లకు, నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో ఫ్లాట్లు కొన్నవారికి, గ్రేటర్ నోయిడా అథారిటీకి ఊరటనిన్చింది. సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించనట్లయితే రైతుల భూముల్లో నిర్మించిన భవనాలను కూలగొట్టవలసి వచ్చేదని ఓ న్యాయవాది తెలిపారు. ఈ తీర్పు నోయిడా ఎక్స్‌టెన్షన్ పరిధి కింద ఉన్న 65 గ్రామాల రైతులపై ప్రభావం చూపనుంది.
నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో భూసేకరణకు సమర్థన
Published Fri, May 15 2015 1:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement