సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్టం కింద సేకరిం చ తలపెట్టిన భూమి విషయంలో బాధిత భూమి యజమాని ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధిత వ్యక్తి వాదనలు విని, విచారణ జరిపి ఆ భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తప్పనిసరని తేల్చి చెప్పింది.
ఇలా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, బాధిత వ్యక్తి వాదనలు వినకుండా చేపట్టే భూసేకరణ చెల్లదని పరోక్షంగా తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.కె.అగర్వాల్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఓ ప్రజోపయోగం కోసం హిమాచల్‌ప్రదేశ్ ప్రభు త్వం భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది.
దీనిపై బాధిత భూ యజమానులు చట్టం నిర్దేశించిన గడువులోపే కలెక్టర్ ముందు అభ్యంతరాలు దాఖలు చేశా రు. కలెక్టర్ బాధిత భూ యజమానుల వాదనలు వినలేదు. ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. దీనిపై ఆ భూయజమానులు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వారి పిటిషన్‌ను కొట్టేస్తూ 2016లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భూ యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment