న్యూఢిల్లీ: సరైన పరిహారం చెల్లించకుండా పౌరుల నుంచి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ఇప్పటికీ రాజ్యాంగపరమైన హక్కేనని గుర్తు చేసింది.
పరిహారమివ్వకుండా భూ సేకరణ చెల్లదంటూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రోడ్డు విస్తరణ కోసం సేకరించదలచిన భూమికి గాను హైకోర్టు ఆదేశించిన మేరకు సొంతదారులకు హిమాచల్ సర్కారు ముందుగా పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment