Compensation for farmers
-
పరిహారమివ్వకుండా సేకరణ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సరైన పరిహారం చెల్లించకుండా పౌరుల నుంచి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ఇప్పటికీ రాజ్యాంగపరమైన హక్కేనని గుర్తు చేసింది. పరిహారమివ్వకుండా భూ సేకరణ చెల్లదంటూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రోడ్డు విస్తరణ కోసం సేకరించదలచిన భూమికి గాను హైకోర్టు ఆదేశించిన మేరకు సొంతదారులకు హిమాచల్ సర్కారు ముందుగా పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రావట్లేదు: బండి సంజయ్
-
ఒక్క ఎకరా పండితే ఒట్టు..!
సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం): భూమాత ఘోషిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తన విత్తు భూమిలోనే ఎండిపోయింది. పైకి అరకొరగా వచ్చిన మొక్కలు ఎదుగులేక చతికిలబడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో వేల ఎకరాల్లో శనగ రైతులు కోట్లలో నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ తాము చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క గింజ కూడా రైతులు చేతికి రాలేదు. ఎన్నో ఆశలతో ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేలకు వేలకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూతాపం..రైతులకు శాపం.. మండలంలో ఎక్కువగా సాగయ్యే పంటల్లో శనగ ఒకటి. ఇక్కడి ఇసుక భూముల్లో శనగ పంట వేలాది ఎకరాల్లో సాగు చేశారు. మండల పరిధిలోని ఆలూరు, గాదెపాలెం, కొత్తపట్నం, అల్లూరు, గవళ్లపాలెం, చింతల, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో సుమారు 8250 ఎకరాల్లో ఈ ఏడాది శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతులు ఎంతో సాహసం చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి శనగ సాగు చేశారు. ఎకరాకు శనగ సాగుకు దుక్కి దున్నడం, విత్తనాలు ఎదపెట్టడం, ఎరువులు, కూలీ..ఇలా మొత్తం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చయింది. కౌలు రైతులకు కౌలు అదనపు ఖర్చు. అయితే పంట వేసిన నాటి నుంచి ఒక్క చినుకు వర్షం కూడా కురవకపోవడంతో మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మొక్క కూడా బయటకు రాలేదు. అరకొరగా వచ్చిన మొక్క సైతం నీటి తడులు లేక ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు మేతగా వదిలేశారు. 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తే కనీసం ఒక్క గింజ కూడా చేతికి రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మండలంలోనే రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పరిహారం ఎక్కడ..? పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి మండలంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినా మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, కానీ గింజ కూడా చేతికి రాకుండా లేనంతగా ఎప్పుడూ లేదని, ఇలాంటి గడ్డు పరిస్థితులను తామెప్పుడూ చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. బీమా అయినా వస్తుందా..? మండలంలోని 8 వేల ఎకరాల్లో శనగ సాగు చేసిన రైతుల్లో కొంత మంది బీమా కోసం ఎకరాకు రూ.330 ప్రీమియం చెల్లించారు. ఫసల్ బీమా పథకం కి,ద పంటనష్టం వాటిల్లితే ఎకరాకు రూ.22 వేల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారి సుచిరితను వివరణ కోరగా.. మండలంలో సాగు చేసిన శనగ పంట పూర్తిగా నష్టపోయింది వాస్తవమేనన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నష్టపోయిన పంట జాబితాను సిద్ధం చేసి పంపించామని తెలిపారు. ఫసల్ బీమా కింద ప్రీమియ, చెల్లించిన రైతులకు బీమా నగదు చెల్లించేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గింజ కూడా చేతికి రాలేదు నాలుగు ఎకరాల్లో శనగ సాగు చేశాను. మొత్తం రూ.50 వేల వరకు ఖర్చయింది. వేసిన పంట వేసినట్లే ఎండిపోయింది. గింజ కూడా చేతికి రాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అధికారులన్నా గుర్తించి శనగ రైతులను ఆదుకోవాలి. - రాము, అల్లూరు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు వ్యవసాయం మానేసి కూలి పనులకు వెళ్లడం మేలనిపిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేస్తే రూపాయికి కూడా చేతికి రాలేదు. పంట మొత్తం పూర్తిగా నష్టపోయా. పంటల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నష్టపరిహార, చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. - చిరుతోటి విద్యాసాగర్ -
రైతుకు దన్ను.. మోదీ ముందు 3 మార్గాలు
న్యూఢిల్లీ: పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోయిన రైతులకు ఊరట కలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత డబ్బు జమ చేయడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే పంటలను విక్రయించి నష్టపోయిన రైతుకు పరిహారం అందజేయడం, రుణ మాఫీ పథకం అమలు చేయడం ఇందులో ఉన్నాయి. ‘స్థూలంగా ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది..అవి రుణమాఫీ, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు, నేరుగా రైతులకే డబ్బు బదిలీ ఇందులో ఉన్నాయి’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రామీణ ప్రాంత ఓటర్లే కారణం. కానీ, పంటల ధరల నిర్ణయంలో మార్కెట్లదే పైచేయి కావడం, ప్రభుత్వ జోక్యం తగ్గడంతో రైతులు ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో 26 కోట్లకు పైగా ఉన్న రైతులు సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం రైతులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని తీవ్రంగా యోచిస్తోంది. ఎన్నికల లోపే రైతులందరికీ నేరుగా, సులువుగా డబ్బును అందించే ఈ మూడు మార్గాల్లో దేనిని అమలు చేసినా ఖజానాపై భారీగానే భారం పడనుంది. ఆ మూడూ ఇవే.. మొదటిది..సత్వరం అమలు చేయటానికి వీలైనదీ, ప్రభుత్వ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్న ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు బంధు’ మాదిరి పథకం. దీని కింద సొంత భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.1,700 నుంచి రూ.2,000 చొప్పున ప్రభుత్వం జమ చేయడం. ఈ పథకం అమలుకు సుమారు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువకే తమ పంటలను విక్రయించుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం రెండో ప్రత్యామ్నాయం. దీనిని అమలు చేస్తే రూ.50వేల కోట్లతోనే సరిపోతుంది. ఇక మూడోది.. అత్యంత ఖరీదైంది..ప్రభుత్వ వర్గాల్లో అంతగా సానుకూలత లేని రైతు రుణమాఫీ. దేశ వ్యాప్తంగా రూ.లక్షలోపు ఉన్న రైతురుణాలకు మాఫీ వర్తింప జేస్తే దేశ ఖజానాపై కనీసం రూ.3 లక్షల కోట్ల భారం పడుతుందని అధికార వర్గాల అంచనా. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాగా ప్రకటించుకుంది. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ! న్యూఢిల్లీ: సకాలంలో చెల్లించే రైతుల పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.15వేల కోట్ల మేర ఉన్న వడ్డీ భారాన్ని భరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆహార ధాన్యాల పంటలకు పూర్తిగాను, ఉద్యాన పంటలకు కొంత మేర రద్దు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతులకు రూ.3 లక్షల వరకు 7 శాతం వడ్డీపై బ్యాంకులు స్వల్ప కాలిక రుణాలిస్తున్నాయి. కానీ, సకాలంలో తిరిగి చెల్లించే రైతుల నుంచి మాత్రం 4శాతం వడ్డీనే తీసుకుంటున్నాయి. సాధారణంగా 9 శాతం వడ్డీని రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. సకాలంలో రుణాలు చెల్లించే రైతులందరికీ ఈ మాఫీ వర్తింప జేస్తే కేంద్రం రూ.30వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణ వితరణ లక్ష్యాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.11.69 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ప్రకటించనుంది’ అని తెలిపారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. -
రైతుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం
-
హైటెన్షన్’ బాధిత రైతులకోసం ప్రత్యేక చట్టం
కోదండరాం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో బాధిత రైతుల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమా వేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు కోల్పో యిన రైతుల కోసం తెచ్చిన చట్టం మాదిరిగా విద్యుత్ లైన్ల కోసం భూములు కోల్పోయిన వారికోసం కొత్తగా చట్టాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 400 కేవీ, 765 కేవీ లైన్ల కోసం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో భూములు కోల్పోతున్నారని అన్నారు. కానీ ఆయా సంస్థలు అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయన్నారు. చట్టప్రకారం పరిహారం పంపిణీపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ... వాటిని అమలు చేయలేదన్నారు. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పరిహారం కావాలని ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు పక్షం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఇదిలా ఉండగా బాధిత రైతులు సర్పంచ్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఉద్యమ కమిటీలు ఏర్పాటు చేశారు. -
కుప్పం బ్రాంచి కెనాల్‌కు తొలగిన అడ్డంకి
ఒప్పందం మేరకు రైతులకు పరిహారం ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఫలించిన కలెక్టర్, జేసీ, ఎస్ఈ ప్రయత్నాలు తిరుపతి: కుప్పం బ్రాంచి కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణకు అడ్డంకులు తొలిగాయి. గ్రామసభలో అధికారులు, రైతుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించవచ్చంటూ ప్రభుత్వం సోమవారం జీవో (నంబర్ 219 ) జారీచేసింది. దీంతో భూసేకరణ పనులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా, ఇరిగేషన్ ఎస్ఈ మురళీనాథరెడ్డి రైతులతో చర్చించి కొంతమేర భూమిని స్వాధీనం చేసుకుని కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. వారు చెప్పిన గడువులోపు పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు పలుచోట్ల కాలువ పనులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లాకలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్ విలువ ప్రకారం కాకుండా అక్కడ చర్చల ద్వారా నిర్ణయించిన ధరలు చెల్లిస్తామని జీవో జారీ చేయకపోతే పనులు జరగడం కష్టమని తెలియజేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భూమి మార్కెట్ విలువకంటే 30 నుంచి 40 శాతం పెంచి రైతులకు పరిహారం ఇచ్చే వెసలుబాటు కల్పించింది. ఆ ప్రకారం ఎకరా విలువ దాదాపు రూ.7లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులతో ఒప్పందం కుదిరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మే నెలలో పరిహారం కుప్పం బ్రాంచి కెనాల్ కోసం భూములు సేకరించిన రెతులకు మే నెలలో పరిహారం ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ కాలువ కోసం గంగవరం, బెరైడ్డిపల్లె, పెద్దపంజాణి, వి,కోట, రామకుప్పం, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో 1,800 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇందులో దాదాపు 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. దాంతోపాటు భూములు కోల్పోయే రైతులు దాదాపు 1,500 నుంచి 1,600 మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు దాదాపు రూ.90కోట్లు పరిహారం చెల్లించాల్సి వస్తుందని అధికారులు తాత్కాలిక అంచనా వేసినట్టు సమాచారం. పనులను వేగవంతం చేస్తాం ప్రభుత్వం 219 జీవో జారీచేయడంతో భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూములకు పరిహారం చెల్లిస్తాం. ఇక కాలువ పనులను వేగవంతం చేస్తాం. - మురళీనాథరెడ్డి, ఎస్ఈ, హంద్రీ-నీవా