land acqisation
-
పరిహారమివ్వకుండా సేకరణ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సరైన పరిహారం చెల్లించకుండా పౌరుల నుంచి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ఇప్పటికీ రాజ్యాంగపరమైన హక్కేనని గుర్తు చేసింది. పరిహారమివ్వకుండా భూ సేకరణ చెల్లదంటూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రోడ్డు విస్తరణ కోసం సేకరించదలచిన భూమికి గాను హైకోర్టు ఆదేశించిన మేరకు సొంతదారులకు హిమాచల్ సర్కారు ముందుగా పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. -
మా ప్రాణాలు తీసి.. భూములు లాక్కోండి
దుద్యాల్/ వికారాబాద్: ‘‘భూములే కావాలంటే.. ముందు మా ప్రాణాలు తీసి, లాక్కొండి. కొన్నాళ్లుగా మా ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక నిరసన తెలిపాం. ఇప్పుడు మా వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాం..’’ అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధిత గిరిజనులు వాపోయారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘లగచర్ల’ ఘటన, గిరిజనుల అరెస్టు నేపథ్యంలో శనివారం ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్.. ఫార్మా విలేజీ ప్రతిపాదిత గ్రామాలైన లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండాలలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో పోలీసులు మోహరించడంతో మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు. వ్యవసాయ పనులకూ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నలుగురు రిమాండ్‌కు.. లగచర్ల ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం పులిచర్లకుంటతండాకు చెందిన రూప్లా నాయక్, లగచర్లకు చెందిన మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు నలుగురిని శనివారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి విషయంలో స్పష్టత రాలేదు. కలెక్టర్‌తో ఏడీజీ భేటీ లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (ఏడీజీ) మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సమావేశమయ్యారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పోలీసులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంచారు. ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరో ఇద్దరు ఏఆర్ గన్మన్లను అదనంగా కేటాయించారు. పోలీసుల భయంతో వృద్ధురాలికి గుండెపోటు! ‘లగచర్ల’ ఘటనకు సంబంధించి పోలీసుల భయంతో డాకిడిబాయి అనే వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పులిచర్లకుంటతండాకు చెందిన డాకిడిబాయికి గ్రామ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఫార్మా విలేజీ భూసేకరణలో ఆ భూమి కూడా పోతోంది. ఆమె కుటుంబం ఈ ఆందోళనతోనే ఉంది. ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనంతరం.. ఆమె కుమారులు ఇద్దరు పోలీసుల భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. కుమారుల జాడ చెప్పాలంటూ ఒత్తిడి చేశారని, శుక్రవారం కూడా వచ్చి గట్టిగా బెదిరించారని స్థానికులు చెప్తున్నారు. ఈ భయాందోళనతో డాకిడిబాయి గుండెపోటుకు గురైందని పేర్కొంటున్నారు. తిండికి తిప్పలు వచ్చాయి ఇంట్లో బియ్యం, కారంపొడి తప్ప ఏమీ లేవు. కూరగాయలు అమ్మేందుకు సైతం తండాల్లోకి ఎవరూ రావడం లేదు. తిండికి తిప్పలొచ్చాయి. మాకున్న ఐదెకరాల భూమి ఫార్మా విలేజీలో పోతోంది. భూమి లేకపోతే ఏం చేసి బతకాలి. – సోనిబాయి, రోటిబండతండాపోలీసులమని బెదిరించి మేకలు ఎత్తుకెళ్లారుఅధికారులపై దాడి చేసిన వారి కోసం తండాలకు పోలీసులు తరచూ వస్తున్నారు. వారిలో కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు మామూలు డ్రెస్‌లలో ఉంటున్నారు. వచ్చినవారు ఎవరో తెలియడం లేదు. కొందరు దొంగలు పోలీసులమని బెదిరించి రెండు మేకలు ఎత్తుకెళ్లారు. తండాల్లో మగవాళ్లు ఎవరూ ఉండటం లేదని ఇలా చేస్తున్నారు. మాకు రక్షణ ఏది? – అంబిక, రోటిబండతండా -
వివాదాస్పద స్థలంలో విధ్వంసం
విశాఖపట్నం: కూర్మన్నపాలెం సర్వే నంబర్ 39/1సీలో 1.09 ఎకరాల స్థలం కొన్నేళ్లుగా ఖాళీ ఉంది. రెండేళ్లుగా ఆ స్థలంపై వివాదం నడుస్తోంది. ఇటీవల ఇదే స్థలంపై ఇరువర్గాలు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు. సివిల్ గొడవ కావడంతో కోర్టులో తేల్చుకోవాలని దువ్వాడ పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఓ వర్గానికి చెందిన సుమారు 100 మంది వివాదాస్పద స్థలంలో చొరబడి రేకుల ప్రహరీని ధ్వంసం చేశారు. దీంతో వ్యతిరేక వర్గం దువ్వాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దువ్వాడ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని రౌడీ మూకలను చెదరగొట్టారు. ఇందులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. 1980లో సర్వే నంబర్ 39/1, 2లో 9.30 ఎకరాల స్థలాన్ని అత్తిలి నారాయణరావు నుంచి కొనుగొలు చేశామని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బద్దిరాజు మురళీరాజు తెలిపారు. అప్పట్లో ఎల్పీ నంబర్ 3.80 తీసుకొని లేఅవుట్ కూడా వేసి 54 మందికి స్థలాన్ని విక్రయించామన్నారు. తరువాత శ్రీలక్ష్మి గణేష్ బిల్డర్‌కు 2005లో డెవలప్మెంట్కు ఇచ్చారు. ఈ భూమి మధ్యన రైవాడ కెనాల్ భూసమీకరణ చేయడంతో సదరు సర్వే నంబర్ సబ్ డివిజన్‌గా మార్చారు. 39/1ఎ, 39/1బి, 39/1సీలుగా విభజించారు. ఇందులో 39/1ఏ సుమారు 6 ఎకరాల్లో ఓషన్ గ్రీన్ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. 39/1బీ రైవాడ కాలువలో పోయింది. మిగిలిన 39/1సీ 1.09 ఎకరాల స్థలం ఖాళీగా ఉండడంతో ఆక్రమణదారుల కన్ను పడింది. అత్తిలి నారాయణరావు వద్ద ఆయన తమ్ముడు పెదవెంకటరమణ, మంతా సుబ్రహ్మణ్యం, ముదునూరి శ్రీనివాసరాజులు స్థలం కొన్నట్టు దస్తావేజులు చూపుతున్నారు. ఇరువర్గాలు ఆ స్థలం తమదంటే తమదని తరచూ గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్న బుద్ద మురళీరాజు గాజువాక కోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో మంతా సుబ్రహ్మణ్యం స్థలాన్ని చదును చేసి లే అవుట్‌గా మార్చి స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేసి, అక్కడ ఒక షెడ్డును కూడా నిర్మించడంతో మరో వర్గం జీవీఎంసీకి ఫిర్యాదు చేసింది. దీంతో జీవీఎంసీ అధికారులు వచ్చి షెడ్డును కూల్చివేశారు. దీంతో కక్ష పెట్టుకున్న మంతా సుబ్రహ్మణ్యం వర్గానికి చెందిన సుమారు వంద మంది మంగళవారం ఈ స్థలంలో చొరబడి రేకుల ప్రహరీని ధ్వంసం చేశారు. గాజువాక ఏసీపీ త్రినాథ్, దువ్వాడ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కృష్ణంరాజు, సుబ్రహ్మణ్యం, వంశీపై కేసు నమోదు చేశారు. -
చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
మధ్యప్రదేశ్: నరేంద్రమోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని చీతా(చిరుత పులుల్లో ఒక రకం) ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నేషనల్ పార్క్ సమీపంలో గ్రామాల్లోని ప్రజలు ఈ చిరుతల రాకతో భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది ఈ చిరుత కారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుందని, అందువల్ల ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ చాలామంది గ్రామస్తులు తమ భూములను లాక్కుంటారేమోనని భయపడుతున్నారు. ఈ చిరుతుల రాక మధ్యప్రదేశ్‌లోని షియాపూర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తుల్లో లేని భయాలను రేకెత్తించింది. వారిలో ఈ భయాందోళనలకు కారణం...గతంలో సుమారు నాలుగు నుంచి ఐదు గ్రామాలను పార్కు కోసం మార్చడం, అలాగే సుమారు 25 గ్రామాల ప్రజలను తరలించడం వంటివి జరిగాయి. దీంతో వారు తమ భూములను, నివాసాలను కోల్పోయి..ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు ఆ గ్రామానికి సమీపంలోని ఆనకట్ట ప్రాజెక్టు కారణంగా కూడా ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని రామ్‌కుమార్ గుర్జార్ అనే మరో రైతు చెబుతున్నాడు. మీ గ్రామానికి సమీపంలోని పార్కుల్లో చిరుతల రాక గురించి గ్రామస్తుల అభిప్రాయం గురించి ప్రశ్నించగా... జాతీయ ఉద్యానవనం కోసం గ్రామాలను లాక్కున్నారు. ఇప్పుడూ సమీపంలోని కునో నదిపై ఆనకట్ట ప్రాజెక్లు నిర్మించనున్నారు...ఇది మరో 50 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేషనల్ పార్క్‌ల వల్ల పర్యాటకులు పెరిగినప్పటికీ....ధనవంతులే వ్యాపారాలు నిర్వహించుకుంటారని, తమకు ఉపాధి దొరకదని అంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల కోసం తమ భూములను లాక్కుంటారని గ్రామస్తులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: కునో పార్కులో చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..) -
చిల్లర రాజకీయాలు నాకు చేతకాదు: మంత్రి ఈటల
-
మంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
-
ఈటలపై ఆరోపణలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సుమారు 100 ఎకరాల భూమిని ఈటల జమునా హ్యచరీస్ కోసం కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించారు. ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. కలెక్టర్ ద్వారా సమగ్ర రిపోర్ట్ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని డీజీ పూర్ణచంద్రరావుకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని కేసీఆర్ డీజీని ఆదేశించారు. చదవండి: సంచలనం: మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు -
బొండా.. ప్రజలు ఛీ కొడుతున్నారు
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగడాలు, భూ కబ్జాలు, దోపిడీలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన స్థలాన్ని నిస్సిగ్గుగా ఆక్రమించిన ఉమాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. బాబూరావు డిమాండ్ చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి స్థలాన్ని కబ్జా చేసిన ఘటనలో ఎమ్మెల్యే బొండా, అతని భార్య సుజాతతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి బొండా రాజీనామా చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమా ఆగడాలపై ఆయన బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కబ్జాకోరులకు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. భూ ఆక్రమణలు, అరాచకాలతో విజయవాడను తన గుప్పెట్లోకి తీసుకున్న బొండాను జనం ఛీ కొడుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సిగ్గు చేటన్నారు. బెజవాడను భ్రష్టు పట్టిస్తున్న బొండా.. బొండా ఉమా భూ ఆక్రమణల వల్ల విజయవాడ బ్రాండ్ ఇమేజ్ పాతాళంలోకి పడిపోయిందని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ మరణానికి కారణమైన బొండాను ఊరికే వదిలేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంద్రకీలాద్రిని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు టీడీపీ నాయకులు ఆరాటపడుతున్నారని... దసరా ఉత్సవాల్లో వెలుగు చూస్తున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేవస్థానాలను స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న చరిత్ర టీడీపీ నాయకులదేనని తెలిపారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనతో ఏం ఒరగబెట్టారో చెప్పకుండా ... నిస్సిగ్గుగా మళ్లీ నువ్వే రావాలి సీఎం అంటూ చంద్రబాబు ఫ్లెక్సీలను, హోర్డింగులను ప్రదర్శించడం నీతిమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. భూ ఆక్రమణల నేపథ్యంలో బొండాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతన్ని అన్ని పదవుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా సంఘాలతో చర్చించి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు డీవీ కృష్ణ, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా రేషన్ బియ్యం పంపిణీ
జడ్చర్ల : జిల్లాలో రేషన్‌బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో మంగళవారం ఆయన జడ్చర్ల స్టాక్ పాయింట్‌ను పరిశీలించి బియ్యం పంపిణీకి సంబంధించి ఆరా తీశారు. సకాలంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 804 రేషన్ దుకాణాలకు సంబంధించి 420 దుకాణాలకు డీలర్లు డీడీలు కట్టారని మిగతా 384 రేషన్ దుకాణాలకు ఐకేపీ, మెప్మా ద్వారా ఆర్ఓలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే 121 దుకాణాలకు బియ్యం స్టాక్ పాయింట్ల నుండి తరలించామని చెప్పారు. రాతీ, పగలు తేడా లేకుండా అదనపు లారీలను ఏర్పాటు చేసి గోదాముల నుండి అన్ని దుకాణాలకు బియ్యాన్ని చేరుస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 08542–241330 నంబర్ ఫోన్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ను నోడల్ అధికారిగా నియమించగా, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, ఐకేపీ సీసీలను పర్యవేక్షకులుగా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు. స్థానిక తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సివిల్ సప్లయీస్ డీటీ హరికృష్ణ, ఆర్ఐ రఘు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాపంపిణీ కార్యక్రమంలో భాగంగా సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు సూచించారు. జడ్చర్ల నుండి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించగా కలెక్టరేట్ నుండి డీసీఎస్ఓ శారదా ప్రియదర్శిని, సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 420 మంది డీలర్లు డీడీలు కట్టారని, మిగిలిన స్థానాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్నిచోట్ల ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీ చేయించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం చేయొద్దు మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయొ ద్దని జేసీ ఎస్.వెంకట్రావు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి నిర్మాణం ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
మరింత ఆలస్యం కానున్న బుల్లెట్ ట్రైన్..?
ముంబై : ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్’ మరింత ఆలస్యం కానునట్లు సమాచారం. జపాన్ దేశ సహకారంతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భూ సేకరణ అంత సులభంగా సాధ్యమయ్యేలా కనపడటంలేదని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ముంబై - అహ్మదాబాద్ మార్గంలో రూపొందనున్న ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కారిడార్‌లో ఐదోవంతు భాగం అనగా 108 కి.మీ. విస్తీర్ణం పాల్గార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం ముఖ్యంగా మామిడి, సపోట వంటి పండ్ల తోటలకు ప్రసిద్ధి. దాంతో ఈ భూములను వదులుకోవడానికి పాల్గార్ రైతులు సుముఖంగా లేరు. భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు కూడా పలు షరతులు విధిస్తున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అడగ్గా...మరికొందరు ప్రస్తుత మార్కెట్ విలువ కంటే 50శాతం ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రైతుల వద్ద నుంచి భూమిని సేకరించడం తమ వల్ల కాదంటూ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అధికారులు చేతులేత్తాసారు. దాంతో ప్రభుత్వం ఈ విషయం గురించి చర్చించడానికి భారతీయ రైల్వేకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను నియమించినట్లు సమాచారం. అయితే పాల్గార్ రైతులు మాత్రం బలవంతంగా తమ భూములను లాక్కుంటే నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది పాల్గార్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మిగితా రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలుపుతుకన్నాయి. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని...ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చించే సొమ్మును మన రైల్వేలను అభివృద్ధి పర్చడం కోసం వినియోగిస్తే మంచిద’ని వాదిస్తున్నాయి. ఈ వియషం గురించి జపాన్ ఇంటర్నేషనల్ కో - ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) అధికారి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి అనగా 2022, ఆగస్టు 15 నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. 2023 నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వినియోగంలోకి రావాలిని ఒప్పందం. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి భూ సేకరణ జరగాలి. కానీ భూ సేకరణకు రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ విషయం గురించి మేము భారతీయ రైల్వే అధికారులతో చర్చించినప్పడు వారు ఇదేమంత పెద్ద విషయం కాదు మేము చూసుకుంటామన్నా’రని తెలిపారు. మోదీ ‘మేకిన్ ఇండియా’లో భాగంగా...కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో 17 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియా జపాన్ నుంచి 50 ఏళ్ల కాలపరిమితితో అధిక మొత్తంలో రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. -
భూసేకరణ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కాశేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్ సాగర్ కోసం సిద్దిపేట జిల్లాలోని మూడు గ్రామాల్లో భూసేకరణను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణకు ముందు చేతివృత్తులు, రైతు కూలీలకు పునరావాసం, ఉపాధి కల్పన వంటి చర్యలు తీసుకోవా లని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిద్దిపేట జిల్లా ఇమామాబాద్, పెద్దకోడూరు, చాడ్లాపూర్ వంటి గ్రామాల్లో చేతివృత్తుల వారికి పునరావాసం కల్పించాకే భూసేకరణ చేయాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్‌రావు శుక్రవారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. పునరావాస చర్యలు తీసుకోలేదంటూ విశ్వనాథం భీమాచారి మరో ఏడుగురు వేసిన వ్యాజ్యం తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ.. జీవో 123 ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని రైతుల నుంచి కొనుగోలు చేసిందని, అయితే ఆ భూములపై ఆధారపడిన వారికి పునరావాస చర్యలు తీసుకోలేదన్నారు. భూమిని స్వాధీనం చేసుకున్నామే గానీ ఆ భూమి నుంచి ఎవరినీ ఖాళీ చేయించలే దని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు చెప్పారు. ఇరు వర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి.. ఉపాధి, పునరావాస చర్యలు తీసుకోకుండా భూ స్వాధీనానికి వీల్లేదని, అం దుకే నాలుగు వారాలపాటు భూసేకరణను నిలిపివేస్తున్నామని, ఈలోగా పునరావాస చర్యలు తీసుకుని ప్రభుత్వ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
ఇస్తావా.. చస్తావా!
ఈ ఫొటోలో మొక్కజొన్న తోట వద్ద నిలబడి ఉన్న రైతు పేరు అడబాల పద్మారావు.ఊరు పోలవరం. మూలలంక ప్రాంతంలో ఇతని పేరుతో 47 సెంట్లు, ఇతని భార్య కుమారి పేరుతో 50 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపైనే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి మొత్తం పోలవరం డంపింగ్‌యార్డ్ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. ఇతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయాలి. భూమిని ప్రభుత్వం తీసుకుంటే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కావటంలేదని పద్మారావు ఆవేదన చెందుతున్నారు. పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరమైన డంపింగ్ యార్డు కోసం రైతుల నుంచి భూములు సేకరించే విషయంలో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా ఉంది. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా, ఎంత నష్టపరిహారం ఇస్తారో తేల్చకుండా ఏకపక్షంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్) ప్రటించటం, నోటీసులు జారీ చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ధర చెల్లించకపోతే భూములు ఇచ్చేదిలేదని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు డంపింగ్‌యార్డ్ కోసం పోలవరం గ్రామంలోని మూలలంక ప్రాంతంలో 2016లో ప్రభుత్వం భూములు సేకరించింది. రెండో విడతగా ఈ ఏడాది మరికొన్ని భూములు సేకరించేందుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు సేకరిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్‌కుమార్ చెప్పటం మినహా, రైతులతో రేటు విషయంలో ఏ విధమైన చర్చలు జరపలేదు. ఆందోళనకు గురైన రైతులు ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ భూములకు న్యాయమైన ధర ఇప్పించాలని కోరారు. సీఎం జిల్లా కలెక్టర్ భాస్కర్‌ను అడగ్గా పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూములకు ఇచ్చిన ధర ఇస్తామంటూ స్పష్టం చేశారు. పట్టిసీమ భూములకు మూడేళ్ల కిందట ఎకరానికి రూ.19.53 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అప్పుడు ఇచ్చిన రేటే ఇప్పుడు కూడా చెల్లిస్తామని చెప్పటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతగా డంపింగ్ యార్డ్ కోసం 52 మంది రైతులకు సంబంధించి 88 ఎకరాల భూములు సేకరించేందుకు ఆర్డీఓ మోహన్‌కుమార్ ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను చాలా మంది రైతులు తీసుకోలేదు. మీ భూములకు ఎకరానికి రూ.15.39 లక్షలు రేటు నిర్ణయించామని, నోటీసు అందిన మూడు రోజుల్లోగా బ్యాంకు ఖాతా నంబర్‌తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్‌ను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో దాఖలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే నష్టపరిహారం సొమ్ము రైతుల ఖాతాకు జమచేయటం వీలు పడదని పేర్కొన్నారు. పత్రాలు దాఖలు చేయకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా భూములు సేకరించేందుకు చర్యలు చేపట్టటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం వేల కోట్లు పెరుగుతున్నా, తమకు మాత్రం న్యాయం జరగటంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి, పోలవరం డంపింగ్ యార్డ్‌కు, నిర్వాసితుల పునరావాసానికి, పోలవరం కుడి ప్రధాన కాలువకు భూములు ఇచ్చామని ఇక సాగు చేసుకునేందుకు కూడా భూమిలేని పరిస్థితి ఏర్పడిందని విలవిల లాడుతున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి, పోలవరం కుడి కాలువకు పెదవేగి, నూజివీడు, బాపులపాడు మండలాల్లో భూములకు చెల్లించిన ధర తమకు కూడా చెల్లించాలని కోరుతున్నారు. భూములు మొత్తం కోల్పోతున్నందున అవసరమైతే మిగిలిన ప్రాంతాల్లో ఇచ్చిన విధంగా జీఓ ఇచ్చి ఎకరానికి రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని రైతులు మిరియాల నాగమణి, ఓడపాటి సత్యన్నారాయణ, పంతులు గంగరాజు తదితరులు కోరుతున్నారు. -
బలవంతపు రిజిస్ట్రేషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ సమీకరణ సమయంలో ప్రకటించిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాట్లనే తమకు ఇవ్వాలని రైతులు డిమాండు చేస్తుండగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పొలాలను బిట్లుగా విభజించి యథాతథంగా రైతులకు అంటగట్టాలని చూస్తోంది. ప్రభుత్వం (సీఆర్డీఏ) వాటా కింద ఉంచుకునే ప్రాంతంలో వేగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తమకు ప్లాట్లు కేటాయించే ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కారు పంటలు పండే సారవంతమైన భూములను తాము త్యాగం చేసి రాజధాని కోసం ఇస్తే సర్కారు ఇలా ద్రోహం చేయడం దారుణమని రైతులు విమర్శిస్తున్నారు. భూసమీకరణ ఒప్పందాలు సమర్పించిన మూడు నెలల్లో ప్లాట్లు కేటాయిస్తామని చెప్పి మూడేళ్లయినా లేఅవుట్ల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండటం గమనార్హం. రైతుల విముఖత రాజధానికి భూ సమీకరణ కింద 33 వేల ఎకరాలు పైగా ఇచ్చిన రైతులకు ఎల్పీఎస్ ఒప్పంద నిబంధనల ప్రకారం నివాస, వాణిజ్య ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలి. అయితే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్లాట్లను రైతులకు కట్టబెట్టేందుకు సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. దీంతో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులు అంగీకరించడంలేదు. రాజధానికి ఎల్పీఎస్ కింద భూములు ఇచ్చిన వారికి సీఆర్డీఏ 59,014 ప్లాట్లు కేటాయించగా ఇప్పటి వరకూ 6,900 మంది మాత్రమే తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులోనూ అధికార పార్టీ నాయకులుగా పలుకుబడి ఉపయోగించి రోడ్ల పక్కన, పెద్ద ప్లాట్లను పొందిన వారే ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు. మిగిలిన 52,114 ప్లాట్లు రైతులు తీసుకునేందుకు ఇష్టపడడంలేదు. లేఅవుట్లు అభివృద్ధి చేయకుండా కా>గితాలపై ఇచ్చే ప్లాట్లు తమకెందుకని రైతులు మండిపడుతున్నారు. ఏకపక్ష రిజిస్ట్రేషన్ల కోసం... రైతులు ఎదురుతిరగడంతో ఏకపక్షంగా వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి చేతులు దులుపుకోవాలని సీఆర్డీఏ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ‘రైతుల హాజరు, సంతకాలతో సంబంధం లేకుండా వారి పేర్లతో సీఆర్డీఏ అధికారులు వచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తార’ంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సీఆర్డీ కమిషనర్ శ్రీధర్ లేఖ రాశారు. కొనుగోలుదారుల (స్వీకర్తల) ఆమోదం లేకుండా వారి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం వీలుకాదని ఆశాఖ అధికారులు తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి అయినా ఆ ప్లాట్లను రైతులకు కట్టబెట్టాలని సీఆర్డీఏ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్, సీఆర్డీఏ మధ్య వివాదం నెలకొంది. మూడేళ్లయినా అతీగతీ లేదు రాజధాని నిర్మాణానికి భూమి ఇస్తే రైతులకు అన్ని విధాలా లాభం కలిగేలా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారు. ఇంత వరకు ఒక్క రైతుకు కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. తొలుత రైతులకు తుళ్లూరులో ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్లాట్ల కాగితాలు ఇచ్చినప్పుడు నెల రోజుల్లో రైతులందరికి అభివద్ధి చేసి ప్లాట్లు అందిస్తామన్నారు. ఏడాది అయినా ఇంత వరకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కాగితపు స్థలాలు మాకు అవసరం లేదనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలేదు. – కొమ్మినేని కష్ణారావు, దొండపాడు రైతు -
649 ఎకరాల భూమి సేకరణ
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాలకు ఏర్పాట్లు లావేరు: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాలకు జిల్లాలో ఏడు మండలాల్లో 649 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల భూసేకరణ విభాగం స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ బి.గోవర్థనరావు అన్నారు. గురుగుబిల్లి, లావేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తోటపల్లి ప్రాజెక్టు కాలువల కోసం గురుగుబిల్లి వద్ద సేకరించిన భూములను పరిశీలించారు. అనంతరం లావేరులో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మండలంలో తోటపల్లి కాలువల కోసం సేకరించిన భూముల వివరాలుపై తహసీల్దార్, అధికారులతో చర్చించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాల కోసం లావేరు, రణస్థలం, జి.సిగడాం, రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో 649 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 50 ఎకరాలు మినహా మిగతా భూమిని అంతా కాలువల కోసం సేకరించామని చెప్పారు. కాలువల తవ్వకాలకు భూములు ఇవ్వడానికి ఏడు మండలాల్లో రైతులు బాగా సహకరించారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు మొదటి విడతగా రూ. 55 కోట్లు నష్టపరిహారం చెల్లించామని పేర్కొన్నారు. మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయనతో పాటు తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆమదాలవలస డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ డి.సన్యాసిరావు, లావేరు మండల సర్వేయర్ నాగభూషణరావు తదితరులు ఉన్నారు. -
బలవంతపు భూసేకరణ తగదు
వేములఘాట్‌లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి తొగుట: కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్మాణంలో భాగంగా బలవంతపు భూసేకరణ చేపట్టడం దర్మార్గమని దళిత బహుజన ఫ్రంట్ ( డీబీఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి ఆరోపించారు. వేములఘాట్‌లో బుధవారం మహిళలు చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. పోలీస్ పికెట్ , 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములఘాట్ ప్రజలకు న్యాయం జరిగేవరకు డీబీఎఫ్ అండగాఉండి పోరాడుతుందన్నారు. 88వ రోజుకు చేరిన ముంపు దీక్షలు వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 88వ రోజకు చేరాయి. దీక్షలో రేణుక ఎల్లమ్మ మహిళా సంఘం సభ్యులు దమ్మి రాజవ్వ , పల్లెపహాడ్ కిష్టవ్వ , లచ్చవ్వ , గడ్డమీది బాలవ్వ , లింగవ్వ , దొడ్ల లక్ష్మి, కూతూరి కమలమ్మ , మాచాపురం లక్ష్మి, విజయ , ప్యాట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలి
తెలుగు యువత రాష్ర్ట అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా కందుకూరు: తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతుందని, 1982కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనతో అర్థమవుతుందని తెలుగుయువత రాష్ర్ట అధ్యక్షుడు, పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి తూళ్ల వీరేందర్‌గౌడ్ విమర్శించారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సుశీలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ చట్టసభల్లో ఆమోదం పొందిన 2013 భూసేకరణ చట్టం బిల్లును కాదని రాష్ర్ట ప్రభుత్వం 123 జీఓ తీసుకొచ్చి భూములను సేకరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2013 చట్టాన్ని కాదని జీఓ 123 తేవడం చట్టసభలతో పాటు రాజ్యాంగాన్ని, రాష్ర్టపతిని అవమానించడమేనన్నారు. ఇప్పటికే 81 సార్లు కోర్టులు ప్రభుత్వ పాలనపై మొట్టికాయలు వేసినా తీరు మారలేదని ఆయన దుయ్యబట్టారు. బలవంతపు భూసేకరణను అడ్డుకుంటున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వారికి రేషన్ నిలిపివేశారని ఆరోపించారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చేపడితే చూస్తూ ఊరుకునేదిలేదని వీరేందర్‌గౌడ్ హెచ్చరించారు. ఫార్మాసిటీకి చేపడుతున్న భూసేకరణ 2013 చట్టానికి లోబడే చేయాలని లేనిపక్షంలో పెద్దఎత్తున్న ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లన్నసాగర్లో మాదిరి ఇక్కడా రైతులు తిరగబడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే 123 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఈ.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముచ్చర్ల సర్వే నంబర్ 288లోని సర్టిఫికెట్దారులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం దారుణమన్నారు. భూములు లేని వారికి మూడు ఎకరాల చొప్పున ఇస్తామని చెప్పిన సర్కార్.. సర్టిఫికెట్‌దారులను విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు జగదీష్‌బాబు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు సంధ్యాసల్మోహన్రెడ్డి, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, పర్వతాలు, సంజీవ, జాన్యానాయక్, సర్పంచ్ కాస నర్సింహా, ఎంపీటీసీ ఎం.నర్సింహా, నాయకులు అచ్చన పాండు, ఎగ్గిడి కృష్ణ, రవిగౌడ్, శేఖర్‌గౌడ్, యాదయ్య, ప్రవీణ్‌నాయక్, రాంరెడ్డి, వెంకటచారి, శాం్యసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎసరు
మచిలీపట్నం : పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో 36వేల ఎకరాలను మచిలీపట్నంలో సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూసమీకరణ కోసం నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేస్తుండడంతో ఎవరి భూములు పోతాయనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులు అంగీకరిస్తేనే భూ సమీకరణ అయినాl, భూసేకరణ అయినా ముందడుగు వేస్తుందని, రైతుల నిర్ణయంపైనే అన్నీ ఆధారపడి ఉంటాయనే వాదన వినిపిస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ... భూ సమీకరణలో తొలివిడతగా పోర్టు నిర్మాణం జరిగే చిలకలపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 4,636 ఎకరాలకు సమీకరణ నోటిఫికేషన్ జారీ చేసేందుకు మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రాత్రి వరకు కసరత్తు జరుగుతూనే ఉంది. ఎనిమిది మంది రెవెన్యూ సిబ్బంది గతంలో ఈ ఆరు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ కోసం జారీ చేసిన భూములను భూసమీకరణలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నారు. జేసీ గంధం చంద్రుడు సోమవారమే భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పినా భూముల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాకపోవడంతో మంగళవారం నోటిఫికేషన్ జారీ అవుతుందని రెవెన్యూ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. భూసమీకరణ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మచిలీపట్నం ఆర్డీవో పి సాయిబాబు విజయవాడ తీసుకువెళ్లడంతో ఏ క్షణంలోనైనా భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల అవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 9(1) ద్వారా భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తొలివిడత సమీకరించే ఆరు గ్రామాల్లో 2,282 ఎకరాల పట్టాభూమి, 413 ఎకరాల అసైన్డ్భూమి, 1941 ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూసేకరణ గడువు ముగిసే సమయంలో : గత ఏడాది ఆగస్టు 31వ తేదీన పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 30 వేల ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మరో నెల రోజుల వ్యవధిలో ఈ నోటిఫికేషన్ గడువు పూర్తవుతుంది. ఇంతకాలం పోర్టుకు అవసరమైన భూమిని సేకరించకుండా ప్రభుత్వం మిన్నకుండిపోయింది. భూసేకరణ నోటిఫికేషన్ గడువు ముగిసే సమయంలో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను తెరపైకి తెచ్చి అభివృద్ధి పేరుతో భూసమీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూసమీకరణ ప్రక్రియకు కనీసం ఏడాది సమయం పడుతుంది. భూసేకరణ, భూసమీకరణ చట్టాల్లోని అసలు అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా ఒకసారి భూసేకరణ, మరోసారి భూసమీకరణ అంటూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీతో రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులు అంగీకార పత్రాలు ఇస్తేనే .... పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో 36 వేల ఎకరాలకు పైగా మచిలీపట్నంలో సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసినా 80 శాతం మందికి పైగా రైతులు తమ భూములను ఇస్తామని అంగీకారపత్రాలు ఇస్తేనే భూ సమీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసేందుకు అవకాశం ఉంటుందని, రైతులు అంగీకరించకుంటే ఈ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులే అంటున్నారు. గతంలో మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిన ప్రభుత్వం అనంతరం ఈ జీవోను ఉపసంహరించుకుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించారా : పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం భూములను సేకరించేందుకు గత ఏడాది భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రైతులకు పంట రుణాలు నిలిచిపోయాయి. భూమిని విక్రయించకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సాగునీరు సకాలంలో విడుదల చేయకుండా ఇబ్బందుల పాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు రూ.15 లక్షలు, రూ. 20 లక్షలకు తమ భూములను మంత్రుల అనుచరులకు విక్రయించినట్లు అంగీకార ‡పత్రాలు రాసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం ఈ విధంగా కొన్న భూములను పోర్టు నిర్మాణానికి ఇస్తామని రైతులు ప్రకటనలు చేసే అవకాశం ఉందనే వాదన ఉంది. అయితే భూసేకరణ లేదా సమీకరణ చట్టం ప్రకారం ఈ అంగీకార పత్రాలు చెల్లవని, వాస్తవంగా సాగులో ఉన్న రైతులే తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంది.