సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ పూలింగ్ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన స్థలాలపై వుడా అధికారులు శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. కలెక్టర్, జీవీ ఎంసీ, సబ్‌రిజిస్ట్రార్, పంచాయతీలకు నోటిఫికేషన్ కాపీలు పంపారు. అడ్డగోలుగా ప్లాట్లు దక్కించుకున్న వారికి షో కాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుం చి వచ్చిన సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో నిబంధనలను పక్కనపెట్టి ఎటువంటి షరతులు విధించకుండా అడ్డగోలుగా ప్రత్యామ్నాయ భూములు కేటాయించారు.
ప్రభుత్వ భూములనే ప్రైవే టు వ్యక్తుల నుంచి సేకరించినట్లు చూ పించి ప్రత్యామ్నాయంగా వారికి విలువైన భూములు కట్టబెట్టారు. భూములు కోల్పోయిన వారికి అదే ప్రాంతంలో అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా విలువ ఎక్కు వ ఉన్న ఎంవీపీ కాలనీ, సాగర్‌నగర్, రుషికొండ భూములు ముట్టజెప్పారు. అసలు నిజమైన లబ్ధిదారులో కాదో అన్నది రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ లేకుండా ఇష్టానుసారంగా ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చారు.
లబ్ధిపొం దిన రైతులకు కొంచెం స్థలాన్ని ఇచ్చి కేటాయించిన భూముల్ని మూడో పార్టీ రిజిస్ట్రేషన్ కింద తమ బినామీలకు అప్ప టి అధికారులు బదలాయించారు. ఈ అక్రమాలన్నింటినీ వుడా అధికారులు గుర్తించడమేకాకుండా వాటి జాబితాను తయారు చేశారు. 92 ఫైళ్ల ద్వారా 306 మంది నిబంధనలకు విరుద్ధంగా స్థలా లు పొందినట్టు తేల్చారు.
సర్వే నంబర్లు, స్థలం, లబ్ధిదారుల పేర్లతో శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రతులను కలెక్టర్, జీవీఎంసీ, మధురవాడ, భీమిలి సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపారు. అక్రమాలు జరిగిన మధురవాడ, రుషికొండ, పరదేశిపాలెం, ఎండాడ పంచాయతీలకు పం పించారు. బహిరంగంగా చూసేందుకు ఆయా కార్యాలయాల్లో అతికించనున్నా రు. అంతేకాకుండా అక్రమంగా స్థలాలు పొందిన వారికి ఎందుకు చర్య తీసుకోకూడదో తెలియజేయాలని కోరారు.
వుడా భూమాయపై నోటిఫికేషన్
Published Sun, Sep 29 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement