సాక్షి, విజయవాడ: అమరావతిలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది.
జీవో 45పై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. కాబట్టి నిర్మాణాలు చేసుకోవచ్చని అర్థం అని ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనానికి వినిపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కొంతమంది అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు 1656 ఎకరాలను సంస్థలకు అమ్మేస్తే ఎందుకు స్పందించలేదు? మాస్టర్ ప్లాన్ తప్పు కాబట్టే సవరించామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు.
చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్
సీఆర్డీఏ చట్టంలో 5 శాతం భూమిని నిరుపేదలకు ఇవ్వాలని ఉంది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment