అధికారులను నిలదీస్తున్న రైతులు
* సవరణలు పూర్తయ్యాక లాటరీ తీయాలని రైతుల డిమాండ్
* వారి మొర ఆలకించని అధికారులు
* సభ నుంచి వెళ్లిపోయిన బోరుపాలెం రైతులు
తుళ్లూరు: స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన ప్లాట్ల పంపిణీ రసాభాసగా మారింది. మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనకార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, కమిషనర్ శ్రీధర్, ఐటీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాకే ప్లాట్లు పంపిణీ చేయాలని రైతులు మొర పెట్టుకున్నారు. అధికారులు వినకపోవడంతో రైతులు వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు మీకు ఇష్టమొచ్చినట్లు ఇచ్చే ప్లాట్లు మాకొద్దని నిరసన తెలిపారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు స¿¶ æనుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కొండమరాజు పాలేనికి చెందిన రైతులు జరీబు కింద పొలాలు తీసుకుని నేలపాడు సమీపంలోని గుంటల్లో ప్లాట్లు ఇస్తున్నారని ఏకరవు పెట్టారు. ఇప్పుడే ఇలా వేధిస్తుంటే అన్నీ మీ చేతుల్లోకి వచ్చాక మా బతుకులు ఏమి కావాలంటూ మండిపడ్డారు. అధికారులు మాత్రం కొండమరాజుపాలెం గ్రామానికి చెందిన 568 మంది రైతులకు 763 ఎకరాలకుగాను 494 రెసిడెన్షియల్, 497 కమర్షియల్, బోరుపాలేనికి సంబంధించి 346 మంది రైతుల నుంచి 349 ఎకరాలకు 494 నివాస, 497 కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు.