
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. లేఅవుట్‌లో 54.29 ఎకరాల స్థలంలో ఉందన్న న్యాయమూర్తి.. అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 10 శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి అప్పగించామని ఏజీ సమాధానమిచ్చారు.
ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్ కేపీహెచ్‌బీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దన్న హైకోర్టు.. లేఅవుట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment