న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 పట్ట ణాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ల వద్ద అమ్ముడుకాని అందుబాటు ధరల ఫ్లాట్లు 4.12 లక్షలు ఉన్నట్టు ప్రాప్ టైగర్ డాట్ కామ్ తెలిపింది. ఇవన్నీ కూడా రూ.45 లక్షల ధరల్లోపువేనని పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, నోయిడా, గుర్‌గ్రామ్‌లో అమ్ముడు కాకుండా డెవలపర్ల వద్ద మొత్తం 7,97,623 గృహ యూనిట్లు ఉన్నాయి. ఇందులో అందుబాటు ధరల్లోనివి (రూ.45 లక్షల్లోపు) 4,12,930. హైదరాబాద్‌లో అమ్ముడవకుండా ఉన్న అందుబాటు ధరల ఫ్లాట్లు 4,881. అత్యధికంగా ముంబైలో 1,39,984 యూనిట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment