కందవాడ (చేవెళ్లరూరల్):
వె ంచర్ యజమానులు గ్రామస్తులే కదా అని నమ్మి ప్లాట్లు కొన్న ఇద్దరు నట్టేట మునిగిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రియల్ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా చూస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట వాపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కందవాడ గ్రామంలో సర్వేనెంబర్ 284లో రెండు ఎకరాల భూమిని 2012లో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పెంటారెడ్డి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మల్లేశ్‌తో కలిసి వెంచర్ చేశాడు. సుమారు 50 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. వెంచర్ యజమానులు తమ గ్రామానికి చెందిన వారే కదా అని నమ్మిన కందవాడకు చెందిన కావలి శ్రీశైలం, కావలి శ్రీనివాస్‌లు తమ భార్యల పేరుమీద 150 గజాల చొప్పున రూ. 1.5 లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇటీవల వాని ప్లాట్లు ట్రాక్టర్ దున్ని వెంచర్ యజమానులు ఇతర వ్యక్తులకు అమ్మేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు వెంచర్ యజమానులు ప్రశ్నించగా ప్లాట్లతో మీకు ఎలాంటి సంబంధం లేదని బెదిరించారు. దీంతో చేసేదిలేక బాధితులు ఈనెల 19న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చే యలేదు. కాగా తమపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారా..? అంటూ రియల్ వ్యాపారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట సోమవారం వాపోయారు. తాము రెక్కలుముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టుకుంటే ఇలా మోసం చేయడం ఎంతవరకు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ యజమానులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి కొనుగోలు చేశామని.. ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పారు. ఈవిషయమై ఎస్‌ఐ లక్ష్మీరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగాా.. ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఇరువర్గాల వారు రాజీ కుదుర్చుకుంటామని చెబితే కేసు నమోదు చేయలేదు. బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో కేసు నమోదు చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని తెలిపారు.
ఈ విషయమై వెంచర్ యజమాని పెంటారెడ్డి మాట్లాడుతూ.. బాధితు లకు తాము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. తాము ఎవరినీ బెదిరించలేదని తెలియ జేశారు. రాజకీయంగా తమను ప్రత్యర్థులు దెబ్బతీసేందుకు యత్నిస్త్త్త్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
నమ్మి కొంటే.. నట్టేట ముంచారు!
Published Mon, Jun 23 2014 11:26 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement