హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం తేదీల మార్పు | HMDA Postponed Plot Auction Dates | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం తేదీల మార్పు

Published Fri, Apr 6 2018 2:45 AM | Last Updated on Fri, Apr 6 2018 2:45 AM

HMDA Postponed Plot Auction Dates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్లాట్ల వేలం తేదీలు మారాయి. ఈ ప్లాట్ల కొనుగోలుకు అనూహ్య స్పందనతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు, ప్రవాస భారతీయుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగాల్సిన ఈ–వేలంను 20, 21, 22 తేదీల్లోకి మార్చినట్టు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు గురువారం తెలిపారు. ఈ–వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి 18వ తేదీ వరకు గడువు పొడిగించామన్నారు.

అలాగే ప్లాట్లను ఈ–టెండర్‌ ద్వారా కాకుండా కేవలం ఆన్‌లైన్‌ వేలం ద్వారానే విక్రయించనున్నట్టు తెలిపారు. మరింత సమాచారం కోసం తార్నాక హెచ్‌ఎండీఏ కార్యాలయంలోని హెల్ప్‌డెస్క్‌ను ఫోన్‌ ద్వారా, లేదంటే వ్యక్తిగతంగా సంప్రదించవచ్చని చెప్పారు. అలాగే ఈ–వేలంలో ప్లాట్లు కొనుగోలు చేయాలనుకున్నవారి అవగాహన కోసం ఈ నెల ఏడున తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు. 

ఈ–వేలం ద్వారానే... 

హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన 19 లే అవుట్లలోని 141 ప్లాట్లు, హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్లలోని 88 గిఫ్ట్‌ డీడ్‌ ప్లాట్ల అమ్మకాలు ఈ–వేలంలోనే నిర్వహించనున్నారు. వివాదాలకు తావులేకుండా అమ్మకాలను థర్డ్‌ పార్టీ.. కేంద్రానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన 19 లే అవుట్లలో మిగిలి ఉన్న 80,556.36 చదరపు గజాల్లో ఉన్న 141 ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి.

అత్తాపూర్‌ రెసిడెన్షియల్‌ లే అవుట్, అత్తాపూర్‌ ముష్క్‌ మహల్‌ రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్, చందానగర్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్, గోపన్‌పల్లి హుడా టౌన్‌ షిప్, మాదాపూర్‌ సెక్టర్‌–1, మాదాపూర్‌ సెక్టర్‌–3 , మైలార్‌ దేవ్‌పల్లి మధుబన్‌ రెసిడెన్సియల్‌ కాలనీ, మియాపూర్‌ రెసిడె న్షియల్‌ కాంప్లెక్స్, నల్లగండ్ల రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్, నెక్నాంపూర్, సరూర్‌నగర్‌ చిత్ర లేఅవుట్, సరూర్‌నగర్‌ హుడా ఎం ప్లాయీస్, సరూర్‌నగర్‌ రెసిడెన్షియల్, సరూర్‌నగర్‌ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్, షేక్‌పేట హుడా హైట్స్, హుడా ఎన్‌క్లేవ్, జూబ్లీహిల్స్‌లోని నందగిరి లేఅవుట్, తెల్లాపూర్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్, సాహెబ్‌నగర్‌ కలాన్‌ (వనస్థలిపురం)ల్లో హెచ్‌ఎం డీఏ ప్లాట్లు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ అనుమతినిచ్చిన పోచారం, అంతారం, దూలపల్లి, మంకల్, మామిడిపల్లి, భువన గిరి, బాచుపల్లి, జాలపల్లి, శంకర్‌పల్లి, ఘటకేసర్, అమీన్‌పూ ర్‌ల్లో ప్రైవేట్‌ లే–అవుట్లలో 81 గిఫ్ట్‌ డీడ్‌ ప్లాట్లు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement