కదిరి అర్బన్: ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపడం లేదని అనంతపురం జిల్లా కదిరి పట్టణ మహిళలు శుక్రవారం స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కాంతాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిపట్టాలు 2009లో ఇచ్చారని, ఇంతవరకూ రెవెన్యూ అధికారులు వాటికి సంబంధించిన స్థలాలను చూపలేదన్నారు. అధికారపార్టీ నాయకులు స్థలాలు చూపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు స్థలాలు చూపేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు.
దీంతో నాలుగురోజుల్లోగా ఎవరి స్థలాలు వారికి చూపించి రిజిస్టర్‌ను తనకు పంపాలని ఆర్డీఓ రాజశేఖర్, తహశీల్దార్ నాగరాజులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు జిఎల్ నరిసంహులు, హరి, వేమనారాయణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
పట్టాలిచ్చారు కానీ.. స్థలాలు చూపించడంలేదు
Published Fri, May 22 2015 4:27 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement