laxmikanth
-
పనివాడే ప్రధాన సూత్రధారి?
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన వద్ద పని చేస్తున్న వ్యక్తే ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్థారించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. లక్ష్మీకాంత్ శర్మ ప్రతిరోజూ బంజారాహిల్స్ రోడ్ నెం.7లో ఉన్న ఓ టీవీ కార్యాలయానికి వస్తుంటారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు డ్రైవర్లు, సహాయకుడితో కలిసి వచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో టీవీ కార్యక్రమం పూర్తయిన తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కారు ముందు సీట్లో కూర్చున్న అతడిని సఫారీ సూట్లలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ నిమిత్తం రావాలంటూ చెప్పి బలవంతంగా వెనుక సీట్లో కూర్చోబెట్టారు. డ్రైవర్లతో పాటు సహాయకుడినీ కారు నుంచి దింపేసిన వారు ఇద్దరి సెల్ఫోన్లు సైతం లాక్కుని లక్ష్మీకాంత్ ఐదు నిమిషాల్లో వస్తారని చెప్పారు. ఆయనను వాహనంతో సహా రోడ్ నెం.7లోని వాటర్‌ట్యాంక్ వైపు తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడ వేచి చూసిన అతని అనుచరులు ముగ్గురిలో ఒకరి సెల్‌ఫోన్‌కు లక్ష్మీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది. తనను ఎంక్వైరీ కోసం తీసుకువెళ్తున్నారంటూ చెప్పిన ఆయన అది పూర్తయిన తర్వాత వస్తానని, మీరు ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఈ ముగ్గురూ చిలకలగూడ పరిధిలోని మధురానగర్‌లో ఉన్న లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో లక్ష్మీకాంత్‌కు చెందిన వాహనంలోనే ఇంటికి వచ్చిన ‘ఆ నలుగురూ’ ఓ చిన్న లేఖ తీసుకువచ్చి లక్ష్మీకాంత్ తండ్రి రాజగోపాల్రావుకు ఇచ్చారు. అందులో ‘నాన్న సార్ వారు వస్తారు. వాళ్లు అడుగుతారు మీకు తెలిసింది చెప్పండి’ అంటూ లక్ష్మీకాంత్ చేతిరాతతోనే రాసి ఉంది. దీనిని చూపించిన దుండగులు తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని వెళ్ళారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లు సైతం తొలగించిన దుండగులు డీవీఆర్ పట్టుకెళ్లారు. మరుసటి రోజు (శుక్రవారం) లక్ష్మీకాంత్ శర్మను ఆరామ్‌ఘర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆయన చిలకలగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి తన కళ్లకు గంతలు కట్టారని, బెదిరించి చీటీ రాయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి శుక్రవారం బంజారాహిల్స్ ఠాణాలో లక్ష్మీకాంత్ డ్రైవర్ చంద్రశేఖర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదైంది. మరోపక్క ఆయన తండ్రి రాజగోపాలరావు ఫిర్యాదుతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టరైంది. చంద్రశేఖర్ తన ఫిర్యాదు లో ఇంటికి వచ్చిన దుండగులు రూ.30 లక్షల నగదు, 30 తులాల బంగారం తీసుకువెళ్లారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. లక్ష్మీకాంత్ తండ్రి తన ఫిర్యాదులో 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకువెళ్లారంటూ పేర్కొ న్నారు. ఈ రెండు కేసుల్నీ బంజారాహిల్స్, చిలకలగూడ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నా రు. ప్రాథమికంగా చిలకలగూడ పోలీసుల లక్ష్మీకాంత్ శర్మ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన వారి వివరాలు సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఓ పనివాడే సూత్రధారిగా ఈ వ్యవహారం సాగినట్లు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేసిన చిలకలగూడ పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని వి చారిస్తున్న పోలీసులు మిగిలిన నిందితుల్ని పట్టుకోవడంతో పాటు రికవరీలపై దృష్టి పెట్టారు. అయితే ఈ కేసులో అనేక అంశాలు మిస్టరీగా ఉన్నాయన్న అధికారులు నిందితులందరూ చిక్కితేనే చిక్కుముడులు వీడతాయని పేర్కొన్నారు. -
జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
అనంతపురం అర్బన్ : జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను 21వ తేదీ నుంచి ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ ఏడీ, మార్క్ ఫెడ్ అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. ఆయన బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిలమత్తూరు, హిందూపురం, లేపాక్షి, తాడిపత్రిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వం రూ.1,365 మద్ధతు ధర ప్రకటించిందన్నారు. చిలమత్తూరు, హిందూపురం, తాడిపత్రి మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. లేపాక్షిలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. -
నిత్యావసర ధరలు నియంత్రణలో ఉండాలి
– అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఇష్టానుసార ధరలకు విక్రయించకుండా మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కందిబేడలు కిలో రూ.100 వరకు ఉందని, ఇంతకు మించి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార కల్తీపై కూడా నిఘా పెట్టాలన్నారు. దాడులు నిర్వహించి ఎక్కడైనా కల్తీకి పాల్పడుతున్నట్లు గుర్తిస్తే తక్షణం కేసులు నమోదు చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎనిమిది ప్రభుత్వ వసతి గహాలకు రైతు బజార్ నుంచి కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అక్రమ నిలువలపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ –క్రాప్ బుకింగ్ చేయాలి జిల్లాలో ఈ – క్రాప్ బుకింగ్ వంద శాతం చేయాలని మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ, ఎంపీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 4లోపు ఈ–క్రాప్ బుక్కింగ్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. -
దోమలపై దండయాత్ర
– సమష్టిగా విజయవంతం చేయాలి – అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : ‘డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శనివారం మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొంటారు. సమష్టిగా విజయవంతం చేయాలి.’ అని జేసీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య, ఆరోగ్య, మునిసిపల్, విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దోమల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచే ందుకు ‘దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత’పై శనివారం ఉదయం 10 గంటలకు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీలో పాల్గొనే విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకునేలా చూడాలన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ అంజయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లు, కమిషనర్ చల్లాఓబుళేసు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి శనివారం డ్రైడే : ఇకపై ప్రతి శనివారం ప్రజలు కచ్చితంగా డ్రైడే పాటించేలా అవగాహన పెంచాలని అధికారులను జేసీ ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. దోమల నివారణకు డమ్ములు, తొట్లు, కూలర్లులో నీరు రెండు రోజులకోసారి తొలగించేలా, దొమ తెరలు వాడేలా అవగాహన కల్పించాలన్నారు. -
‘దీపం’ నిర్లక్ష్యం చేస్తే చర్యలు
అనంతపురం అర్బన్ : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. కేటాయించిన కోటా మేరకు అర్హులైన లబ్ధిదారులకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీఓ మలోలా, డీఎస్ఓ ప్రభాకర్‌రావుతో కలిసి గ్యాస్ ఏజెన్సీల యజమానులతో దీపం కనెక్షన్ల మంజూరుపై సమావేశం నిర్వహించారు. సర్వేలో మునిసిపాలిటీలు వెనబడ్డాయి ప్రజా సాధికార సర్వేలో మునిసిపాలిటీలు వెనకబడి ఉన్నాయంటూ మునిసిపల్ కమిషనర్లపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వేపై గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి ఆర్డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
సెలవులో జాయింట్ కలెక్టర్
అనంతపురం అర్బన్ : జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వ్యక్తిగత పనులపై గురువారం నుంచి సెలవులో వెళ్లారు. ఆయన తిరిగి ఈ నెల 13 లేదా 14 తేదీల్లో విధులకు హాజరవుతారని అధికారులు తెలిపారు. అప్పటి వరకు జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ ఇన్చార్జి జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
లక్ష్యాలు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాలను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో టñ లీకార్ఫరెన్స్ నిర్వహించారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా 100 గ్రామాలను ఆగస్టు 15న ప్రకటించాల్సి ఉందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు వంద శాతం సరుకులు అందాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్ఓ మల్లీశ్వరిదేవి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీనివాసులు, తహశీల్దారు శ్రీనివాసులు, ఎన్నికల విభాగం డీటీ భాస్కరనారాయణ పాల్గొన్నారు. -
సర్వే పక్కాగా నిర్వహించండి
అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే పక్కాగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్షీ్మకాంతం ఆదేశించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని తపోవనంలో జరుగుతున్న సర్వేను ఆయన గురువారం పరిశీలించారు. స్వయంగా ఓ ఇంటికి వెళ్లిన జాయింట్ కలెక్టర్ సర్వే వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరించి, నమోదు చేశారు. సర్వే ద్వారా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, దీనిపై అపోహలు వీడాలని ప్రజలకు చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.49 లక్షల కుటుంబాలను సర్వే చేసి 4.69 లక్షల సభ్యుల వివరాలను నమోదు చేశామన్నారు.15.43 శాతంతో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీఓ మలోలా, తహశీల్దారు శ్రీనివాసులు ఉన్నారు. -
తెలంగాణ విమోచనంపై పుస్తకం
చంచల్‌గూడ: జర్నలిస్ట్ ఆసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) ప్రచురించిన ‘తెలంగాణ విమోచనం - భారతజాతి విజయం’ అనే పుస్తకాన్ని శుక్రవారం కుర్మగూడ మహంకాళీ ఆలయంలో స్థానిక జర్నలిస్టులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హైందవ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దడిగె మనోజ్‌కుమార్, జాట్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి దౌల్తబాద్ లక్ష్మీకాంత్, జాట్ నియోజక కన్వీనర్లు రేగు అనిల్‌కుమార్, బండ రాహుల్కిషోర్యాదవ్, సాయి ఉన్నారు. -
'టీచర్లు అంటే మాకెంతో గౌరవం... చంపం'
బెంగళూరు: లిబియాలో ఇద్దరు తెలుగు వారితో సహా నలుగురిని కిడ్నాప్ చేసింది ఐఎస్ఎస్ ఉగ్రవాదులేనని నిర్ధారయింది. అపహరణకు గురైన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన విజయ్ కుమార్(56) తెలిపారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన విజయ కుమార్ సిర్త్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తమను చీకటి గదిలో బంధించారని తెలిపారు. కిడ్నాపర్లు తమ పేర్లు, మతం, ఉద్యోగాల గురించి అడిగారని చెప్పారు. తాము యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నామని చెప్పగానే తమ పట్ల వారి వైఖరిలో సానుకూల మార్పు కనబడిందని వివరించారు. కిడ్నాపర్ల నాయకుడు తన పేరు షేక్ గా పరిచయం చేస్తున్నాడని తెలిపారు. ఎవరికో ఫోన్ చేసి అరబిక్ మాట్లాడారని, తర్వాత అతడి వైఖరితో మార్పు వచ్చిందన్నారు. 'టీచర్లు అంటే మాకెంతో గౌరవం. మీ కారణంగానే లిబియాలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. మీకు ఎటువంటి హాని తలపెట్టం' అని షేక్ తమతో చెప్పాడని వెల్లడించారు. సిర్త్‌యూనివర్సిటీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తమను నలుగురు దుండగులు తమను కిడ్నాప్ చేశారని లక్ష్మీకాంత్ చెప్పారు. తర్వాత తమను పెద్ద గోడ ఉన్న పెద్ద హాల్ లోకి తీసుకెళ్లి తమదగ్గరున్న డబ్బు, వస్తువులు తీసుకున్నారని తెలిపారు. 'లిబియాను ఎందుకు విడిచి వెళుతున్నారు, ఇస్లాం గురించి మీకేం తెలుసో చెప్పాలని షేక్ తమను ప్రశ్నించాడు. ఆరు నెలల వయసున్న నా కుమార్తెను చూసేందుకు వెళ్లాలని నన్ను విడిచి పెట్టాలని కోరాను. ఇస్లాం గురించి వివరించాను. ఇండియాలో హిందూ, ముస్లింలు ఐకమత్యంగా కలిసివుంటున్నారని, మతసామర్యంతో పండుగలు జరుపుకుంటున్నారని తెలిపాను. ఆ రాత్రి మాకు ఆహారం పెట్టలేదు' అని లక్ష్మీకాంత్ తెలిపారు. వీరిద్దరినీ శుక్రవారం విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. -
పట్టాలిచ్చారు కానీ.. స్థలాలు చూపించడంలేదు
కదిరి అర్బన్: ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపడం లేదని అనంతపురం జిల్లా కదిరి పట్టణ మహిళలు శుక్రవారం స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కాంతాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిపట్టాలు 2009లో ఇచ్చారని, ఇంతవరకూ రెవెన్యూ అధికారులు వాటికి సంబంధించిన స్థలాలను చూపలేదన్నారు. అధికారపార్టీ నాయకులు స్థలాలు చూపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు స్థలాలు చూపేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో నాలుగురోజుల్లోగా ఎవరి స్థలాలు వారికి చూపించి రిజిస్టర్‌ను తనకు పంపాలని ఆర్డీఓ రాజశేఖర్, తహశీల్దార్ నాగరాజులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు జిఎల్ నరిసంహులు, హరి, వేమనారాయణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.