అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే పక్కాగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్షీ్మకాంతం ఆదేశించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని తపోవనంలో జరుగుతున్న సర్వేను ఆయన గురువారం పరిశీలించారు. స్వయంగా ఓ ఇంటికి వెళ్లిన జాయింట్ కలెక్టర్ సర్వే వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరించి, నమోదు చేశారు. సర్వే ద్వారా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, దీనిపై అపోహలు వీడాలని ప్రజలకు చెప్పారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.49 లక్షల కుటుంబాలను సర్వే చేసి 4.69 లక్షల సభ్యుల వివరాలను నమోదు చేశామన్నారు.15.43 శాతంతో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్‌డీఓ మలోలా, తహశీల్దారు శ్రీనివాసులు ఉన్నారు.
సర్వే పక్కాగా నిర్వహించండి
Published Fri, Jul 29 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
Advertisement