చంచల్‌గూడ: జర్నలిస్ట్ ఆసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) ప్రచురించిన ‘తెలంగాణ విమోచనం - భారతజాతి విజయం’ అనే పుస్తకాన్ని శుక్రవారం కుర్మగూడ మహంకాళీ ఆలయంలో స్థానిక జర్నలిస్టులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హైందవ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దడిగె మనోజ్‌కుమార్, జాట్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి దౌల్తబాద్ లక్ష్మీకాంత్, జాట్ నియోజక కన్వీనర్‌లు రేగు అనిల్‌కుమార్, బండ రాహుల్‌కిషోర్‌యాదవ్, సాయి ఉన్నారు.