జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు | marie corn sales counters in districts | Sakshi
Sakshi News home page

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

Published Wed, Oct 19 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

marie corn sales counters in districts

అనంతపురం అర్బన్‌ : జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను 21వ తేదీ నుంచి ప్రారంభించాలని మార్కెటింగ్‌ శాఖ ఏడీ, మార్క్‌ ఫెడ్‌ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. ఆయన  బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ చిలమత్తూరు, హిందూపురం, లేపాక్షి, తాడిపత్రిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు.

మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వం రూ.1,365 మద్ధతు ధర ప్రకటించిందన్నారు. చిలమత్తూరు, హిందూపురం, తాడిపత్రి మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. లేపాక్షిలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement