‘దీపం’ నిర్లక్ష్యం చేస్తే చర్యలు | joint collector orders to deepam employees | Sakshi
Sakshi News home page

‘దీపం’ నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Published Thu, Sep 22 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

joint collector orders to deepam employees

అనంతపురం అర్బన్‌ : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులను జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం హెచ్చరించారు. కేటాయించిన కోటా మేరకు అర్హులైన లబ్ధిదారులకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్‌డీఓ మలోలా, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావుతో కలిసి గ్యాస్‌ ఏజెన్సీల యజమానులతో దీపం కనెక్షన్ల మంజూరుపై సమావేశం నిర్వహించారు.

సర్వేలో మునిసిపాలిటీలు వెనబడ్డాయి
ప్రజా సాధికార సర్వేలో మునిసిపాలిటీలు వెనకబడి ఉన్నాయంటూ మునిసిపల్‌ కమిషనర్లపై జాయింట్‌ కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వేపై గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి ఆర్‌డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement