deepam scheme
-
ఎల్ఐసీ అమ్మక పరిమాణం ఓకే
ముంబై: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. వెరసి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. -
ఎల్ఐసీ ఐపీవోకు సలహాదారులు కావలెను
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్టంగా పది వరకు మర్చంట్ బ్యాంకర్లు, ఒక న్యాయ సలహా సేవల సంస్థను ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) ఎంపిక చేయనుంది. బిడ్ల దాఖలుకు ఆగస్ట్ 6 వరకు గడువు ఇచ్చింది. గత వారమే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. 2022 జనవరి–మార్చి మధ్యలో ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటివరకు కేవలం రూ.7,500 కోట్ల మేరకే సమీకరించింది. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం, ఎల్ఐసీ ఐపీవో రూపంలో గణనీయమైన మొత్తం సమకూరనుంది. -
కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్ ఫ్రీ సిటీ’
సాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్‌ను కిరోసిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా ప్రతి ఇంటా వంట గ్యాస్ వెలుగులు అందించాలనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కూడా ముందుకు సాగడం లేదు. గత ఆరు మాసాల్లో ఒక్క కనెక్షన్ కూడా జారీ కాలేదంటే ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టమవుతోంది. విశ్వ నగరిగా పరుగులు తీస్తున్న మహా నగరంలో నిరుపేద కుటుంబాలు కిరోసిన్ పైనే ఆధారపడి వంటవార్పు కొన సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కిరోసిన్ లబ్ధి దారులకు కనెక్షన్లు మంజూరు చేయించడంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలం చెందినట్లు కనిపిస్తోంది. వాస్తవంగా పౌరసరఫరా శాఖ ఎల్పీజీ సిలిండర్ లేని వారిని గుర్తించి కొందరికి ప్రొసీడింగ్ జారీ చేసినా ... ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రోసీడింగ్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. నాలుగు లక్షల కుటుంబాలకు నో గ్యాస్ మహా నగరంలో సుమారు 28 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో 24 లక్షల కుటుంబాలకు మాత్రమే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన నాలుగు లక్షల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు లేవు. బీపీఎల్ కింద ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగి వంట గ్యాస్ లేని కుటుంబాలను పౌరసరఫరాల గుర్తించి చేపట్టిన చర్యలు మొక్కుబడిగా మారాయి. వాస్తవంగా దీపం పథకం కింద కిరోసిన్ లబ్ధి కుటుంబాలను గుర్తించినప్పటికి వాటిలోనే సగం మందికి కూడా కనెక్షన్లు అందలేదనంటే సంబంధిత శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 1,67,182 కుటుంబాలను గుర్తించి కనెక్షన్లకు అమోదం తెల్పినా... ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 84,713 కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన ఎల్పీజీ ప్రొసీడింగ్ పెండింగ్‌లో పడిపోయాయి. పౌరసరఫరాల విభాగాలు సైతం జారీ చేసిన ప్రొసీడింగ్ గ్రౌండింగ్‌లను పర్యవేక్షించక పోవడంతో గత ఆరుమాసాల్లో ఒక్క కనెక్షన్ కూడా జారీ కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కనెక్షన్ల పరిస్ధితి ఇలా.. గ్రేటర్ పరిధిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం అమలు ను పరిశీలిస్తే పౌరసరఫరాల విభాగాల పనితీరు అధ్వానంగా కనిపిస్తోంది. ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యంపై కనీసం చర్యలు చేపట్టక పోవడం మెతక వైఖరీని అద్దం పడుతోంది. పౌరసరఫరాల విభాగం హైదరాబాద్ పరిధిలో సుమారు 1,13,993 కుటుంబాలను గుర్తించి ప్రొసీడింగ్ జారీ చేస్తే కేవలం 57,824 కుటుంబాలకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లను ఆయిల్ కంపెనీలు జారీ చేశాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 32,014 కుటుంబాలను గుర్తిస్తే 18,469 కనెక్షన్లు, మేడ్చల్ జిల్లా పరిధిలో 21,175 కుటుంబాలకు గాను 8,420 కనెక్షన్లు మాత్రమే జారీ అయ్యాయి. దీంతో సంబంధిత అధికారుల ఉదాసీన వైఖరీ స్పష్టమవుతోంది. -
‘దీపం’ వెలిగేనా..
అశ్వాపురం: గ్రామీణ ప్రాంత మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి కట్టెల పొయ్యి కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. వారి కష్టాలు తప్పడం లేదు. మహిళలు పొగ బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం అమలు చేస్తోంది. ఆహారభద్రత కార్డు ఉండి, గ్యాస్ లేని వారికి కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు చేపడుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పేదలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చేందుకు చర్యలుతీసుకుంటోంది. జిల్లాలో 2,75, 536 ఆహారభద్రత కార్డులు ఉండగా 1,76, 938 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 98, 598 కుటుంబాలు కట్టెల పొయ్యితోనే కాలం వెల్లదీస్తున్నాయి. తహసీల్దార్లచే ఎంపిక.. దీపం పథకంలో అర్హుల ఎంపిక బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్లకు అప్పగించింది. గతంలో ఎంపీడీఓలు చూసేవారు. అయితే అమలులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తహసీల్దార్లకు అప్పగించారు. ఆహారభద్రత కార్డుల జారీచేసేది వారే కాబట్టి అర్హుల ఎంపిక ప్రక్రియ వేగవంతమవుతుందనే ఉద్దేశంతో మార్పులు చేశారు. అర్హులైన వారు తమ ఆధార్, ఆహారభద్రత కార్డులు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేస్తారు. గ్రామసభ ఆమోదంతో తుది జాబితాను పౌరసరఫరాల శాఖ అధికారులకు అందిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ అనుమతితో కనెకషన్లు మంజూరు చేస్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన.. పేదల కష్టాలు తీర్చేందుకు కేంద్రం ఈనెల 14న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారికి ఉచితంగానే గ్యాస్ అందించనుంది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం లేకుండా కనెక్షన్ల మంజూరు బాధ్యతను ప్రైవేటు కంపెనీల డీలర్లకు అప్పగించింది. వారు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 20 నుంచి ప్రత్యేక మేళాలు నిర్వహించి కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాల శాఖకు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉజ్వల పథకం రావడంతో ప్రస్తుతం అమలవుతున్న దీపం పథకం ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద అన్ని మండలాలలో అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ రెండింటికీ సంబంధం లేదని, దీపం పథకం యథావిధిగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. కరకగూడేనికి చెందిన ఈమె పేరు షేక్ ఫాతి మా. గ్యాస్ కనెక్షన్ కోసం ఎన్నోసార్లు అధికారులకు దరఖాస్తులు అందజేసింది. ఏళ్లు గడుస్తున్నా నేటికీ మంజూరు కాలేదు. కట్టెల పొయ్యి కింద వంట చేస్తూ పొగ బారి న పడుతోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి గ్యా స్ ఇప్పిం చాలని వేడుకుం టోంది. -
కట్టెల పొయ్యిపైనే..
మహిళలకు కట్టెల పొయ్యిపై వంట కష్టాలను దూరం చేయడానికి ప్రభుత్వాలు దీపం వంటి పథకాలు తీసుకువచ్చినా.. పేదింట మాత్రం గ్యాస్‌పొయ్యి వెలగడం లేదు. సిలిండర్లను రీఫిల్ చేయించుకోవడం ఆర్థికంగా భారం కావడంతో చాలా మంది దీపం కనెక్షన్లనూ మూలన పడేశారు. గ్రామాల్లో చాలా ఇళ్లలో కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నారు. సాక్షి,కామారెడ్డి: కట్టెల పొయ్యిపై వంట చేస్తే వచ్చే పొగతో మహిళలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే వంట చెరుకుకోసం చెట్లను నరికివేస్తుండడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తుండడంతో ఉచితంగా కనెక్షన్లుకూడా ఇస్తున్నాయి. దీంతో సిలిండర్ల వినియోగం పెరిగింది. అయితే గ్యాస్‌బండ పేదలకు గుదిబండగా మారుతోంది. సిలిండర్‌ను రీఫిల్ చేయించుకోవడం ఆర్థిక భారమవుతోంది. చాలా కుటుంబాల్లో ఒక సిలిండర్ నెలన్నరకుమించి రావడం లేదు. వర్షాకాలం, చలికాలాలలో స్నానానికి వేడి నీళ్లను కాగబెట్టుకుంటే మరో పదిరోజుల ముందే గ్యాస్ అయిపోతోంది.. మరోవైపు సిలిండర్ ధర ఎప్పటికప్పుడు మారుతుండడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 725.50 ఉంది. గత నెలలో సిలిండర్ ధర రూ. 760 ఉండింది. సిలిండర్‌పై సబ్సిడీని ప్రభుత్వం వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడున్న ధర ప్రకారం రూ. 216 సబ్సిడీ ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలా మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో సరిగా జమ కావడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెన్సీల వద్దకు వెళ్లి అడిగితే మాకు సంబంధం లేదనే సమాధానం వస్తోంది. కాగా ఇప్పటికిప్పుడు సిలిండర్‌కు రూ. 725 చెల్లించడం పేదలకు ఎంతో భారంగా ఉంటోంది. సిలిండర్ ధర రూ. 509 అవుతోంది. పైగా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేవాళ్లు ఒక్కో సిలిండర్‌కు రవాణా చార్జీ కింద రూ. 20 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న కుటుంబాల్లో సిలిండర్ అయిపోతే.. నిండు బుడ్డీ కోసం ఇరుగుపొరుగు ఇళ్లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని కష్టాల మధ్య గ్యాస్ బుడ్డీ వాడుడు తమతో కాదంటూ చాలా మంది మూలన పడేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో టీ కాయడానికి, కూర వండడానికి గ్యాస్ పొయ్యిని వాడుతూ, అన్నం వండడానికి, నీళ్లు కాగబెట్టుకోవడానికి కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. మరికొన్ని కుటుంబాలకైతే ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్లు కూడా లేవు. దీపం పథకం కింద కనెక్షన్లు తీసుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. 86 వేల కుటుంబాలకు.. జిల్లాలో 2,77,355 కుటుంబాలు (సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం) ఉండగా.. 1,90,742 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 86,613 కుటుంబాలకు కనెక్షన్లు లేవు. వారంతా కట్టెలపొయ్యిపైనే వంట చేసుకుంటున్నారు. పేదల ఇళ్లలో మూలకే.... వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన వారిలో చాలా మంది గ్యాస్ పొయ్యిలను వాడడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ పొయ్యిల వాడకం గురించి ప్రశ్నిస్తే ‘అన్ని పైసలు పెట్టి యాడికెళ్లి తెచ్చుకుంటాం సార్’ అన్న సమాధానం వస్తోంది. కొందరైతే గ్యాస్ సిలిండర్ కొనే తాహత్తు తమకు లేదంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్ సిలిండర్లను చాలా మంది అమ్ముకున్నారు. కొందరు అటక ఎక్కించారు. వారి పేర్లపై కనెక్షన్లు కొనసాగుతున్నా.. వేరే వ్యక్తులు వాడుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. కట్టెలపొయ్యే నయ్యమున్నది నాలుగు కట్టె పుల్లలు ఇరుసుకచ్చి పొయ్యికింద పెడితే వంట అయితది. గ్యాస్‌పొయ్యికి వందలకు వందలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటం. గందుకే గ్యాస్ పొయ్యిని మూలకు పెట్టినం. వానలు పడ్డప్పుడు మాత్రం గ్యాస్ పొయ్యిమీద వండుతం. లేకుంటే కట్టెలపొయ్యిమీదనే వంట అయితది. – సాయవ్వ, సోమార్పేట, ఎల్లారెడ్డి మండలం -
‘దీపం’లో...రూ.75 లక్షల దోపిడీ
‘దీపం’లో... రూ.75 లక్షల దోపిడీ – ‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్ ధర రూ.800 – రూ.850 తీసుకుంటున్న గ్యాస్ ఏజెన్సీలు – దీపం పథకం కింద 1,65,401 కనెక్షన్లు మంజూరు – రూ.50 అదనంతో రూ.75 లక్షల పేదల సొమ్ము దోపిడీ . సాక్షి, రాజమహేంద్రవరం: పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్ ఏజెన్సీలు పేదల నుంచి నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కనెక్షన్‌కు రూ.50ల చొప్పున అధికంగా వసూలు చేస్తూ చక్రం తిప్పుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్రంలో దీపం పథకం కింద రేషన్కార్డులున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. గ్యాస్‌తో నిండి ఉన్న సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం కింద గత నెల రూ.880లు దీపం పథకం గ్యాస్ కనెక్షన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. స్టౌవ్ అవసరమైతే వినియోగదారులు నగదు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. గ్యాస్ బండకు సంబంధించిన డిపాజిట్టు కింద రూ.1200 ప్రభుత్వం చెల్లించింది. పథకం ప్రారంభించిన కొత్తలో ప్రచారం లేకపోవడం, ఇతర కారణాల వల్ల గత నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అతి తక్కువగానే కనెక్షన్లు మంజూరు చేశారు. జూన్ 8వ తేదీ నాటికి అనుకున్న లక్ష్యం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వేగం పుంజుకుంది. నూతన విధానం ప్రకారం ప్రతి నెల కూడా మార్కెట్ ధర ఆధారంగా గ్యాస్ ధర మారుతూ ఉంటోంది. ఈ నెల గ్యాస్ బండ ధర రూ.595లుగా ఉంది. అదే రెండు నెలల క్రితం ఈ ధర రూ.900 వరకూ వెళ్లింది. మే నెలలో గ్యాస్ బండ ధర రూ.675లుగా ఉంది. దీంతో దీపం పథకం కనెక్షన్ల ధర రూ. 880గా నిర్ణయించారు. ఇందులో రూ.675 గ్యాస్ బండ ధర, మిగిలిన రూ.205లు రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం కోసం తీసుకునేవారు. ఈ నెల గ్యాస్ ధర రూ.80 తగ్గడంతో ఒకటో తేదీ నుంచి దీపం పథకం లబ్థిదారులకు రూ.800లకు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. కానీ గ్యాస్ ఏజెన్సీలు మాత్రం లబ్ధిదారుల నుంచి రూ.850 లెక్కన వసూలు చేస్తున్నాయి. . దీపంలో రూ.75 లక్షలు దోపిడీ.... దీపం పథకం ప్రారంభించిన గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 72 ఏజెన్సీల ద్వారా 1,65,401 గ్యాస్ కనెక్షన్లు లబ్థిదారులకు ఇచ్చారు. గత నెలలో నాలుగు రోజులు మినహా ఈ నెలలో దాదాపు 1,50,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.800లకు బదులు రూ.850 లెక్కన దాదాపు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేశాయి. ఒక్కొక్క కనెక్షన్‌కు రూ.50 చొప్పున 1,50,000 కనెక్షన్లకు రూ.75 లక్షలు గ్యాస్ ఏజెన్సీలు దీపం పథకంలో లబ్థిదారుల నుంచి దోపిడీ చేశాయి. మొత్తం కనెక్షన్లలో జూన్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీకి మధ్య దాదాపు 80 శాతం మంజూరు చేశారు. ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులకు ప్రస్తుతం కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ కోసం వచ్చిన లబ్ధిదారులకు ఆయా ఏజెన్సీల సిబ్బంది దీపం పథకంలో గ్యాస్ కావాలంటే ఏఏ పత్రాలు తీసుకురావాలో చెబుతూ రూ.850 కట్టాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలు నిర్వహించడంతో ఆ పనిలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉండడంతో ఇదే అదునుగా గ్యాస్ ఏజెన్సీలు లబ్ధిదారుల నుంచి రూ.50 అదనంగా వసూలు చేశాయి. –––––––––––––––––––– రూ.800 మించి తీసుకుంటే చర్యలు గత నెల దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ రూ.880గా నిర్ణయించాం. ఈ నెల గ్యాస్ ధర తగ్గిన మేరకు రూ.800లకు దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. అంతకు మంచి వసూలు చేసిన ఆయా గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు మాకు ఫిర్యాదులు చేయాలి. – వేమూరి రవికిరణ్, డీఎస్వో. కాకినాడ. ============================ ‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్ ధర రూ.800 రూ.850 తీసుకుంటున్న గ్యాస్ ఏజెన్సీలు దీపం పథకం కింద 1,65,401 కనెక్షన్లు మంజూరు రూ.50 అదనంతో రూ.75 లక్షల పేదల సొమ్ము దోపిడీ సాక్షి, రాజమహేంద్రవరం: పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్ ఏజెన్సీలు పేదల నుంచి నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కనెక్షన్‌కు రూ.50ల చొప్పున అధికంగా వసూలు చేస్తూ చక్రం తిప్పుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్రంలో దీపం పథకం కింద రేషన్కార్డులున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. గ్యాస్‌తో నిండి ఉన్న సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం కింద గత నెల రూ.880లు దీపం పథకం గ్యాస్ కనెక్షన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. స్టౌవ్ అవసరమైతే వినియోగదారులు నగదు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. గ్యాస్ బండకు సంబంధించిన డిపాజిట్టు కింద రూ.1200 ప్రభుత్వం చెల్లించింది. పథకం ప్రారంభించిన కొత్తలో ప్రచారం లేకపోవడం, ఇతర కారణాల వల్ల గత నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అతి తక్కువగానే కనెక్షన్లు మంజూరు చేశారు. జూన్ 8వ తేదీ నాటికి అనుకున్న లక్ష్యం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వేగం పుంజుకుంది. నూతన విధానం ప్రకారం ప్రతి నెల కూడా మార్కెట్ ధర ఆధారంగా గ్యాస్ ధర మారుతూ ఉంటోంది. ఈ నెల గ్యాస్ బండ ధర రూ.595లుగా ఉంది. అదే రెండు నెలల క్రితం ఈ ధర రూ.900 వరకూ వెళ్లింది. మే నెలలో గ్యాస్ బండ ధర రూ.675లుగా ఉంది. దీంతో దీపం పథకం కనెక్షన్ల ధర రూ. 880గా నిర్ణయించారు. ఇందులో రూ.675 గ్యాస్ బండ ధర, మిగిలిన రూ.205లు రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం కోసం తీసుకునేవారు. ఈ నెల గ్యాస్ ధర రూ.80 తగ్గడంతో ఒకటో తేదీ నుంచి దీపం పథకం లబ్థిదారులకు రూ.800లకు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. కానీ గ్యాస్ ఏజెన్సీలు మాత్రం లబ్ధిదారుల నుంచి రూ.850 లెక్కన వసూలు చేస్తున్నాయి. . దీపంలో రూ.75 లక్షలు దోపిడీ.... దీపం పథకం ప్రారంభించిన గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 72 ఏజెన్సీల ద్వారా 1,65,401 గ్యాస్ కనెక్షన్లు లబ్థిదారులకు ఇచ్చారు. గత నెలలో నాలుగు రోజులు మినహా ఈ నెలలో దాదాపు 1,50,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.800లకు బదులు రూ.850 లెక్కన దాదాపు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేశాయి. ఒక్కొక్క కనెక్షన్‌కు రూ.50 చొప్పున 1,50,000 కనెక్షన్లకు రూ.75 లక్షలు గ్యాస్ ఏజెన్సీలు దీపం పథకంలో లబ్థిదారుల నుంచి దోపిడీ చేశాయి. మొత్తం కనెక్షన్లలో జూన్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీకి మధ్య దాదాపు 80 శాతం మంజూరు చేశారు. ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులకు ప్రస్తుతం కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ కోసం వచ్చిన లబ్ధిదారులకు ఆయా ఏజెన్సీల సిబ్బంది దీపం పథకంలో గ్యాస్ కావాలంటే ఏఏ పత్రాలు తీసుకురావాలో చెబుతూ రూ.850 కట్టాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలు నిర్వహించడంతో ఆ పనిలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉండడంతో ఇదే అదునుగా గ్యాస్ ఏజెన్సీలు లబ్ధిదారుల నుంచి రూ.50 అదనంగా వసూలు చేశాయి. రూ.800 మించి తీసుకుంటే చర్యలు గత నెల దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ రూ.880గా నిర్ణయించాం. ఈ నెల గ్యాస్ ధర తగ్గిన మేరకు రూ.800లకు దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. అంతకు మంచి వసూలు చేసిన ఆయా గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు మాకు ఫిర్యాదులు చేయాలి. – వేమూరి రవికిరణ్, డీఎస్వో. కాకినాడ ‘దీపం’ పథకం -
దీపం అమలులో టీడీపీ విఫలం
► కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు భీమవరం : గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీపం పథకంపై తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసినా.. అమలులో విజయం సాధించలేకపోయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చిన ఆయన సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రత్యేక ప్రతిపాదన ఏదీ లేదని అవసరం, అవకాశాలను బట్టి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గతంలో రైతులు ఎరువుల కోసం షాపుల వద్దకు ఎగబడితే పోలీసులు లాఠీచార్జీలు చేసిన ఘటనలు అనేకం ఉండేవన్నారు. నేడు ఆ పరిస్థితి లేదని, ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలే దీనికి కారణమని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలవడం వల్ల టీడీపీ భయపడుతోందనే వాదన సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఆయన వెంట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. కాంగ్రెస్ మాటలు విడ్డూరం అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భీమవరంలో నిర్వహించిన అందరితో కలసి అందరి అభివృద్ధి సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలవరం నిర్మాణం మోదీ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతోందన్నారు. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
వెలగని దీపం !
– ఆర్థిక సంవత్సరం లక్ష్యం 98,542 – ఈ ¯ð లాఖరులోగా ఇవ్వాల్సింది 57,477 – మంజూరు చేసింది 32,933 అనంతపురం అర్బన్ : దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారికి ‘దీపం’ అందడం లేదు. దీపం పథకాన్ని వారి దరి చేర్చడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఆపసోపాలు పడుతున్నారు. పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షలు లక్ష్యం సాధించే దిశగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఇందుకు అధికారిక లెక్కలే నిదర్శనం. లక్ష్యం 98 వేలు .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి జిల్లాలో దీపం పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు 98,542 కనెక్షన్లు మంజూరు లక్ష్యంగా ఉంది. ఈ (డిసెంబరు) నెలాఖరుకు 57,477 కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అయితే ఇప్పటి వరకు 32,933 కనెక్షన్లను (57శాతం) మాత్రమే ఏజెన్సీలు ఇవ్వగలిగాయి. అంటే ఈ నెలాఖరుకు నిర్ధేశించిన లక్ష్యం మేరకు 14,544 బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం మంజూరు చేసినవి పోనూ ఆర్థిక సంవత్సరం లక్ష్యం మేరకు 2017 మార్చి నాటికి ఇంకా 65,609 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తక్కిన మూడు నెలల్లో ఈ లక్ష్యం సాధించాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి నిర్ధేశించి లక్ష్యమే పూర్తి కాలేదు. దీన్ని బట్టి చూస్తే మార్చి నాటికి 65,609 కనెక్షన్లు మంజూరు ఏ మేరకు సాధిస్తారో అధికారులకే తెలియాలి. ఫలితమివ్వని సమీక్షలు : దీపం పథకం కింద నిర్ధేశించిన లక్ష్యం సాధించాలంటూ సంబంధిత శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షలు ఫలితమివ్వడం లేదని స్పష్టమవుతోంది. ప్రతి ఏజేన్సీకి నెలవారీ లక్ష్యం విధిస్తున్నా, ఆ మేరకు మంజూరు కావడం లేదని తెలిసింది. లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి ఏజెన్సీలకు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ సీఎస్‌డీటీలకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆచరణలో మాత్రం ఉన్నతాధికారులు ఆదేశాల అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
‘దీపం’ నిర్లక్ష్యం చేస్తే చర్యలు
అనంతపురం అర్బన్ : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. కేటాయించిన కోటా మేరకు అర్హులైన లబ్ధిదారులకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీఓ మలోలా, డీఎస్ఓ ప్రభాకర్‌రావుతో కలిసి గ్యాస్ ఏజెన్సీల యజమానులతో దీపం కనెక్షన్ల మంజూరుపై సమావేశం నిర్వహించారు. సర్వేలో మునిసిపాలిటీలు వెనబడ్డాయి ప్రజా సాధికార సర్వేలో మునిసిపాలిటీలు వెనకబడి ఉన్నాయంటూ మునిసిపల్ కమిషనర్లపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వేపై గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి ఆర్డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
‘దీపం’ పంపిణీ నెల రోజుల్లో పూర్తి చేయాలి
కాకినాడ సిటీ : జిల్లాకు మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో దీపం కనెక్షన్ల పంపిణీ పురోగతిపై సమీక్షించారు. జిల్లాకు 2,26,000 దీపం కనెక్షన్లు మంజూరైనట్టు తెలిపారు. వీటిలో 1,31,000 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. మిగిలిన కనెక్షన్లను త్వరితగతిన పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎంపీడీఓల సమన్వయంతో లబ్ధిదారుల జాబితాలకు జన్మభూమి గ్రామ కమిటీల ఆమోదంతో త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అన్ని కనెక్షన్లను డోర్ డెలివరీ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. సర్వే సత్వరమే పూర్తి చేయాలి ప్రజాసాధికార సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. సర్వే ప్రగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఎన్యూమరేటర్లను ఉదయమే క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, ఎన్యూమరేటర్లుగా ఉన్న మహిళలను సాయంత్రం విధుల నుంచి రిలీవ్ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీకి తీసుకున్న ట్యాబ్‌లను ఐదో తేదీ సాయంత్రానికి తహసీల్దార్లకు అప్పగించాలని ఎంపీడీఓలకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పద్మ, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
2.25 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేయాలి
జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశం ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ ఏడాది దీపం పథకం కింద 2.25 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో దీపం పథకంపై పౌరసరఫరాల అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్ లేని ఏపీఎల్, బీపీఎల్ కుటుంబాలకు దీపం పథకం కింద అందించాలన్నారు వార్షిక లక్ష్యాన్ని నెలవారీగా, మూడు నెలలు, ఆరునెలలు విభజించి సంబంధిత ఆయిల్ కంపెనీలకు పంపించాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్ల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ అవగాహన సదస్సులు రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, వీఆర్ఏలు కూడా గ్యాస్కనెక్షన్ల మేళాకు సహకరించాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాల జాబితాలు మండలాల వారీగా తయారుచేసి మూడు రోజుల్లో సంబంధిత ఆయిల్ కంపెనీలకు అందించాలన్నారు. గ్యాస్ కనెక్షన్ కోసం మొదటిగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీలకు అందించాలన్నారు. సమావేశంలో సహాయ పౌరసరఫరాల అధికారులు హనుమంతరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా రెండోవిడుత రుణమాఫీ
మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంగ్డిలో దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు రెండో విడుత రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీపం పథకం నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోందని మంత్రి ఈటల అన్నారు. -
‘దీపం’ మార్గదర్శకాలు ఖరారు
లబ్ధిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లకే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ సి. పార్థసారథి గురువారం విడుదల చేశారు. గతంలో లబ్ధిదారుల తుది ఎంపిక ఇన్చార్జి చేతుల్లో ఉండగా దాన్ని మార్పు చేసి ఎంపిక అధికారం జిల్లా కలెక్టర్లకే కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలతోపాటు ఐకేపీ గ్రూపుల్లో సభ్యులైన మహిళలకు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఎలాంటి కనెక్షన్లు లేనివారికే కొత్త కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఐకేపీ పీడీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎల్పీజీ జిల్లా కోఆర్డినేటర్లు సభ్యులుగా, డీఎస్వో కన్వీనర్‌గా ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని వెల్లడించారు. -
‘దీపం’లో అక్రమ వసూళ్లు
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్ : దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయంలో నిర్వాహకులు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని మండల పరిధిలోని బుస్సాపూర్‌కు చెందిన లబ్ధిదారులు శనివారం స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బుస్సాపూర్ గ్రామానికి చెందిన 39 మంది మహిళలు దీపం పథకానికి ఎంపికయ్యారు. శనివారం గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు సిద్దిపేటలోని కావేరి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చారు. వాస్తవానికి దీపం కనెక్షన్‌కు రూ. 715 చెల్లించాల్సి ఉంది. అయితే ఏజెన్సీ నిర్వాహకులు రూ. 1050 చెల్లించాలని సూచించారు. అయితే ఇచ్చిన డబ్బుకు రశీదు ఇవ్వాలని లబ్ధిదారులు కోరగా అందుకు నిర్వాహకులు నిరాకరించారు. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో బుస్సాపూర్ గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు ఏజెన్సీ నిర్వాహకులతో బేరసారాలకు దిగి రూ. 800గా ధరను నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులు చేసేది లేక ఆ మొత్తాన్ని చెల్లించి కనెక్షన్ తీసుకున్నారు. ఈ విషయమై ఏజెన్సీ మేనేజర్ వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. తాము లబ్ధిదారుల నుంచి రూ. 715 మాత్రమే తీసుకున్నట్లు వివరించారు. అందులో రూ. 445 రీఫిల్లింగ్, రూ. 170 సురక్ష పైపు, రూ. 50 డాక్యుమెంట్, రూ. 50 పాస్ బుక్ కోసం తీసుకుంటున్నట్లు తెలిపారు. సిలిండర్, రెగ్యులేటర్ ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆందోళనలో బుస్సాపూర్ గ్రామానికి చెందిన సుజాత, రేణుక, అమృతమ్మ, లక్ష్మి, లావణ్య, నజీమ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.