‘దీపం’లో...రూ.75 లక్షల దోపిడీ | deepam scheme Rs 75 lakshs robbery | Sakshi
Sakshi News home page

‘దీపం’లో...రూ.75 లక్షల దోపిడీ

Published Thu, Jun 22 2017 11:35 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

deepam scheme Rs 75 lakshs robbery

‘దీపం’లో...
రూ.75 లక్షల దోపిడీ
– ‘దీపం’ పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్‌ ధర రూ.800
– రూ.850 తీసుకుంటున్న గ్యాస్‌ ఏజెన్సీలు 
– దీపం పథకం కింద 1,65,401 కనెక‌్షన్లు మంజూరు 
– రూ.50 అదనంతో రూ.75 లక్షల పేదల సొమ్ము దోపిడీ 
.
సాక్షి, రాజమహేంద్రవరం: పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్‌ ఏజెన్సీలు పేదల నుంచి నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కనెక‌్షన్‌కు రూ.50ల చొప్పున అధికంగా వసూలు చేస్తూ చక్రం తిప్పుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్రంలో దీపం పథకం కింద రేషన్‌కార్డులున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తున్నారు. గ్యాస్‌తో నిండి ఉన్న సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్‌ పుస్తకం కింద గత నెల రూ.880లు దీపం పథకం గ్యాస్‌ కనెక‌్షన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. స్టౌవ్‌ అవసరమైతే వినియోగదారులు నగదు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. గ్యాస్‌ బండకు సంబంధించిన డిపాజిట్టు కింద రూ.1200 ప్రభుత్వం చెల్లించింది. పథకం ప్రారంభించిన కొత్తలో ప్రచారం లేకపోవడం, ఇతర కారణాల వల్ల గత నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అతి తక్కువగానే కనెక‌్షన్లు మంజూరు చేశారు. జూన్‌ 8వ తేదీ నాటికి అనుకున్న లక్ష్యం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ కనెక‌్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వేగం పుంజుకుంది. నూతన విధానం ప్రకారం ప్రతి నెల కూడా మార్కెట్‌ ధర ఆధారంగా గ్యాస్‌ ధర మారుతూ ఉంటోంది. ఈ నెల గ్యాస్‌ బండ ధర రూ.595లుగా ఉంది. అదే రెండు నెలల క్రితం ఈ ధర రూ.900 వరకూ వెళ్లింది. మే నెలలో గ్యాస్‌ బండ ధర  రూ.675లుగా ఉంది. దీంతో దీపం పథకం కనెక‌్షన్ల ధర రూ. 880గా నిర్ణయించారు. ఇందులో రూ.675 గ్యాస్‌ బండ ధర, మిగిలిన రూ.205లు రెగ్యులేటర్, పైపు, గ్యాస్‌ పుస్తకం కోసం తీసుకునేవారు. ఈ నెల గ్యాస్‌ ధర రూ.80 తగ్గడంతో ఒకటో తేదీ నుంచి దీపం పథకం లబ్థిదారులకు రూ.800లకు గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తున్నారు. కానీ గ్యాస్‌ ఏజెన్సీలు మాత్రం లబ్ధిదారుల నుంచి రూ.850 లెక్కన వసూలు చేస్తున్నాయి. 
.
దీపంలో రూ.75 లక్షలు దోపిడీ.... 
దీపం పథకం ప్రారంభించిన గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 72 ఏజెన్సీల ద్వారా 1,65,401 గ్యాస్‌ కనెక‌్షన్లు లబ్థిదారులకు ఇచ్చారు. గత నెలలో నాలుగు రోజులు మినహా ఈ నెలలో దాదాపు 1,50,000 గ్యాస్‌ కనెక‌్షన్లు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.800లకు బదులు రూ.850 లెక్కన దాదాపు జిల్లాలోని అన్ని గ్యాస్‌ ఏజెన్సీలు వసూలు చేశాయి. ఒక్కొక్క కనె‍క‌్షన్‌కు రూ.50 చొప్పున 1,50,000 కనెక‌్షన్లకు రూ.75 లక్షలు గ్యాస్‌ ఏజెన్సీలు దీపం పథకంలో లబ్థిదారుల నుంచి దోపిడీ చేశాయి. మొత్తం కనెక‌్షన్లలో జూన్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీకి మధ్య దాదాపు 80 శాతం మంజూరు చేశారు. ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులకు ప్రస్తుతం కూడా కనెక‌్షన్లు ఇస్తున్నారు. గ్యాస్‌ కనెక‌్షన్‌ కోసం వచ్చిన లబ్ధిదారులకు ఆయా ఏజెన్సీల సిబ్బంది దీపం పథకంలో గ్యాస్‌ కావాలంటే ఏఏ పత్రాలు తీసుకురావాలో చెబుతూ రూ.850 కట్టాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలు నిర్వహించడంతో ఆ పనిలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉండడంతో ఇదే అదునుగా గ్యాస్‌ ఏజెన్సీలు లబ్ధిదారుల నుంచి రూ.50 అదనంగా వసూలు చేశాయి. 
–––––––––––––––––––– 
రూ.800 మించి తీసుకుంటే చర్యలు 
గత నెల దీపం పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్‌ రూ.880గా నిర్ణయించాం. ఈ నెల గ్యాస్‌ ధర తగ్గిన మేరకు రూ.800లకు దీపం పథకంలో గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తున్నారు. అంతకు మంచి వసూలు చేసిన ఆయా గ్యాస్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు మాకు ఫిర్యాదులు చేయాలి. 
– వేమూరి రవికిరణ్, డీఎస్‌వో. కాకినాడ. 
============================ 
 
  ‘దీపం’ పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్‌ ధర రూ.800
 రూ.850 తీసుకుంటున్న గ్యాస్‌ ఏజెన్సీలు 
 దీపం పథకం కింద 1,65,401 కనెక‌్షన్లు మంజూరు 
 రూ.50 అదనంతో రూ.75 లక్షల పేదల సొమ్ము దోపిడీ 
సాక్షి, రాజమహేంద్రవరం:
పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్‌ ఏజెన్సీలు పేదల నుంచి నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కనెక‌్షన్‌కు రూ.50ల చొప్పున అధికంగా వసూలు చేస్తూ చక్రం తిప్పుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్రంలో దీపం పథకం కింద రేషన్‌కార్డులున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తున్నారు. గ్యాస్‌తో నిండి ఉన్న సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్‌ పుస్తకం కింద గత నెల రూ.880లు దీపం పథకం గ్యాస్‌ కనెక‌్షన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. స్టౌవ్‌ అవసరమైతే వినియోగదారులు నగదు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. గ్యాస్‌ బండకు సంబంధించిన డిపాజిట్టు కింద రూ.1200 ప్రభుత్వం చెల్లించింది. పథకం ప్రారంభించిన కొత్తలో ప్రచారం లేకపోవడం, ఇతర కారణాల వల్ల గత నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అతి తక్కువగానే కనెక‌్షన్లు మంజూరు చేశారు. జూన్‌ 8వ తేదీ నాటికి అనుకున్న లక్ష్యం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ కనెక‌్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వేగం పుంజుకుంది. నూతన విధానం ప్రకారం ప్రతి నెల కూడా మార్కెట్‌ ధర ఆధారంగా గ్యాస్‌ ధర మారుతూ ఉంటోంది. ఈ నెల గ్యాస్‌ బండ ధర రూ.595లుగా ఉంది. అదే రెండు నెలల క్రితం ఈ ధర రూ.900 వరకూ వెళ్లింది. మే నెలలో గ్యాస్‌ బండ ధర  రూ.675లుగా ఉంది. దీంతో దీపం పథకం కనెక‌్షన్ల ధర రూ. 880గా నిర్ణయించారు. ఇందులో రూ.675 గ్యాస్‌ బండ ధర, మిగిలిన రూ.205లు రెగ్యులేటర్, పైపు, గ్యాస్‌ పుస్తకం కోసం తీసుకునేవారు. ఈ నెల గ్యాస్‌ ధర రూ.80 తగ్గడంతో ఒకటో తేదీ నుంచి దీపం పథకం లబ్థిదారులకు రూ.800లకు గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తున్నారు. కానీ గ్యాస్‌ ఏజెన్సీలు మాత్రం లబ్ధిదారుల నుంచి రూ.850 లెక్కన వసూలు చేస్తున్నాయి. 
.
దీపంలో రూ.75 లక్షలు దోపిడీ.... 
దీపం పథకం ప్రారంభించిన గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 72 ఏజెన్సీల ద్వారా 1,65,401 గ్యాస్‌ కనెక‌్షన్లు లబ్థిదారులకు ఇచ్చారు. గత నెలలో నాలుగు రోజులు మినహా ఈ నెలలో దాదాపు 1,50,000 గ్యాస్‌ కనెక‌్షన్లు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.800లకు బదులు రూ.850 లెక్కన దాదాపు జిల్లాలోని అన్ని గ్యాస్‌ ఏజెన్సీలు వసూలు చేశాయి. ఒక్కొక్క కనె‍క‌్షన్‌కు రూ.50 చొప్పున 1,50,000 కనెక‌్షన్లకు రూ.75 లక్షలు గ్యాస్‌ ఏజెన్సీలు దీపం పథకంలో లబ్థిదారుల నుంచి దోపిడీ చేశాయి. మొత్తం కనెక‌్షన్లలో జూన్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీకి మధ్య దాదాపు 80 శాతం మంజూరు చేశారు. ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులకు ప్రస్తుతం కూడా కనెక‌్షన్లు ఇస్తున్నారు. గ్యాస్‌ కనెక‌్షన్‌ కోసం వచ్చిన లబ్ధిదారులకు ఆయా ఏజెన్సీల సిబ్బంది దీపం పథకంలో గ్యాస్‌ కావాలంటే ఏఏ పత్రాలు తీసుకురావాలో చెబుతూ రూ.850 కట్టాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలు నిర్వహించడంతో ఆ పనిలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉండడంతో ఇదే అదునుగా గ్యాస్‌ ఏజెన్సీలు లబ్ధిదారుల నుంచి రూ.50 అదనంగా వసూలు చేశాయి. 
రూ.800 మించి తీసుకుంటే చర్యలు 
గత నెల దీపం పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్‌ రూ.880గా నిర్ణయించాం. ఈ నెల గ్యాస్‌ ధర తగ్గిన మేరకు రూ.800లకు దీపం పథకంలో గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తున్నారు. అంతకు మంచి వసూలు చేసిన ఆయా గ్యాస్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు మాకు ఫిర్యాదులు చేయాలి. 
– వేమూరి రవికిరణ్, డీఎస్‌వో. కాకినాడ 
 
 ‘దీపం’ పథకం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement