joint collector orders
-
ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించండి
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఎక్కడా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండరాదన్నారు. సోమ, మంగళవారాల్లో మునిసిపాలిటీల్లో పర్యటించి, తనిఖీ చేస్తామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు ఉంటాయని జేసీ హెచ్చరించారు. -
‘దీపం’ నిర్లక్ష్యం చేస్తే చర్యలు
అనంతపురం అర్బన్ : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. కేటాయించిన కోటా మేరకు అర్హులైన లబ్ధిదారులకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీఓ మలోలా, డీఎస్ఓ ప్రభాకర్‌రావుతో కలిసి గ్యాస్ ఏజెన్సీల యజమానులతో దీపం కనెక్షన్ల మంజూరుపై సమావేశం నిర్వహించారు. సర్వేలో మునిసిపాలిటీలు వెనబడ్డాయి ప్రజా సాధికార సర్వేలో మునిసిపాలిటీలు వెనకబడి ఉన్నాయంటూ మునిసిపల్ కమిషనర్లపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వేపై గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి ఆర్డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.