ప్రజాసాధికార సర్వే, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాలను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు.
అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాలను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో టñ లీకార్ఫరెన్స్ నిర్వహించారు.
బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా 100 గ్రామాలను ఆగస్టు 15న ప్రకటించాల్సి ఉందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు వంద శాతం సరుకులు అందాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీనివాసులు, తహశీల్దారు శ్రీనివాసులు, ఎన్నికల విభాగం డీటీ భాస్కరనారాయణ పాల్గొన్నారు.