హిందూపురం అర్బన్ :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆల్‌హిలాల్ స్కూల్‌మైదానంలో వైఎస్సార్‌సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పేదముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ ‘ఎ’ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్ అహ్మద్ అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎన్నికల్లో నిలిచిన ప్రతిసారి ముస్లింలు తనపై ప్రేమానురాగాలు చూపిస్తురన్నారు. అందుకు వారిపై అభిమానపాత్రుడుగా ఉంటానన్నారు. ఇదే రీతిలో ఇతర మతాల వారు కూడా ఎంతో ఆదరిస్తున్నారని, కష్టంలో సహాయపడిన వారిని మరిచిపోతే మానవత్వం అనిపించుకోదన్నారు. అనంతరం మతపెద్దలు జమియామసీదు మాజీ ముత్తవల్లిలు కరీం, బాషా మాట్లాడుతూ నవీన్‌నిశ్చల్ ముస్లింలపై ఎంతో ప్రేమానురాగాలు చూపుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ శివ, మహిళ కన్వీనర్ నాగమణి ప్రసంగించారు. అనంతరం ముస్లిం మహిళలంకు చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ముస్లిం మతపెద్దలు, మైనార్టీలు నవీన్‌నిశ్చల్‌ను ఘనంగా సన్మానించారు.