సాక్షి, బెంగళూరు: పీయూసీ, ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 31వేల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేసే కార్యక్రమాన్ని సీఎం సిద్ధరామయ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
కాగా, ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు పరిమితమైన ఈ పథకాన్ని వెనకబడినవర్గాలకు చెందిన వారితో పాటు ఇతర అన్ని వర్గాల్లోని పేద ప్రతిభావంత విద్యార్థులకు త్వరలోనే విస్తరించనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 1.5లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు.
విధానసౌధలోని బాంక్వెట్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెంగళూరు, బెంగళూరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీఎం సిద్ధరామయ్య ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సంపన్నులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లను కొని ఇవ్వగలరు. అయితే నిరుపేదలు ల్యాప్‌టాప్‌లను పిల్లలకు కొనివ్వాలంటే అది వారికి శక్తికి మించిన పని. ఈ నేపథ్యంలోనే నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభావంత విద్యార్థులకు సైతం ఉత్తమ శిక్షణ లభించే దిశగా ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment