మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి
మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి
Published Wed, Sep 14 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
మోత్కూరు : సంఘం బంధం తీర్మానాలతోనే స్వయం సహాయక పొదుపు మహిళా గ్రూపులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.అంజయ్య అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేజ్ బుక్‌కీపర్సు రుణా మంజూరులో చేతివాటం ప్రదర్శించడం , అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో మహిళా సంఘాలకు సంఘబంధం చేసిన తీర్మానాలతోనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అనాజిపురంసంఘం బంధంలో అవకతవకలు జరిగాయని.. మూడు నెలలుగా సుమారు రూ.70 లక్షలు రుణ బకాయిలు చెల్లించడంలేదని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రమేష్‌కుమార్, పీడీ దృష్టికి తీసుకెళ్లారు.
వారంలోగా మూడోవిడత పంట రుణాలు..
మూడోవిడత పంట రుణాలను వారంలోగా రైతులకు పంపిణీ చేస్తామని లీడ్‌బ్యాంక్ మేనేజర్ సూర్యం లె లిపారు. 12.5 శాతం నిధులను ప్రభుత్వం విడుదలచేసిందని చెప్పారు. కౌలు రైతులకు పంట రుణాలను మంజూరుచేసే విషయంంలో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జి.దశరథ, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, స్వయం ఉపాధికల్పన శిక్షణ సంస్థ జిల్లా అధికారి రాజశేఖర్ ఐకేపీ బ్యాంక్ లేకేజీ డీపీఎం రామకృష్ణ, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, ఏపీఎంలు వెంకటేశ్వర్లు, పక్కీరయ్య, ఆనంద్, మండల వ్యవసాయాధికారి కె.స్వప్న, మండల పశువైద్యాధికారి పి.అశోక్‌కుమార్, ఈఓఆర్డీ జి.సుజాత, బ్యాంక్ మేనేజర్లు రాజు, రమేష్‌కుమార్ వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement