motkur
-
లాటరీలో వరించిన విజయం..
సాక్షి, మోత్కూరు : భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన మోత్కూరు మున్సిపాటిటీ ఓట్ల లెక్కింపులో 7వ వార్డు ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపింది. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్‌కు వచ్చాయి. 7వ వార్డు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చి టై అయ్యింది. 7వ వార్డులో అత్యధికంగా 8మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నాగార్జునరెడ్డి మధ్యే పోటీ జరిగింది. 1,104 ఓట్లకు గాను 1,001 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒక పోస్టల్ బ్యాలెట్, 2 ఓట్లు నోటాకు పోలయ్యా యి. లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సావిత్రికి 378 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జునరెడ్డికి 377 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కాంగ్రెస్‌కు పడటంతో ఇద్దరికి సమానంగా 378 ఓట్లు రావడంతో టై అయ్యింది. దీంతో అభ్యర్థులు మళ్లీ కౌంటింగ్ చేయాలని కోరడంతో అధికారులు లెక్కించగా అవే ఓట్లు వచ్చాయి. సుమారు రెండు గంటలకు పైగా ఫలితం ఎటూ తేలకపోవడంతో కౌంటింగ్ హాల్ లోపల ఉన్న అభ్యర్థులతో పాటు బయట ఉన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చివరికి అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతను ప్రకటించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు అంగీకరించారు. దీంతో ఒక్కో అభ్యర్థి పేరుతో 5 చీటీలు మొత్తం 10 చీటీలు రాసి లాటరీ తీశారు. లాటరీలో తీపిరెడ్డి సావిత్రి పేరు రావడంతో అధికారులు ఆమెను విజేతగా ప్రకటించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
మోత్కూరు : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మోత్కూరు మండల కేంద్రంలో శనివారం పట్టుకున్నట్లు ఎస్సై కె.రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపెల్లి మండలం దెయ్యంబండతండాకు చెందిన యువకులు నవీన్, జయేందర్ టాటాఏస్‌లో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ బియ్యాన్ని పనకబండ గ్రామంతో పాటు మోత్కూరు పట్టణంలోని అన్నెపువాడలో లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి కోనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మోత్కూరు : జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కోరారు. శుక్రవారం మోత్కూరులోని జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో తెలంగాణ మాదిగ జేఏసీ జెండాను పిడమర్తి రవి ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వచ్చేనెల 13న హైదరాబాద్ నిజాం కళాశాలలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాదిగల శక్తి ప్రదర్శనను సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఎస్సీవర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన వర్గీకరణ ఊసెత్తడంలేదని ఆరోపించారు. శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగజేఏసీ రాష్ట్రచైర్మన్ గద్దల అంజిబాబు, నాయకులు చేడె మహేందర్, చేడె మధు, మిట్టగడుపుల లరమేష్, సైదులు, నవీన్, నరేష్, సురేష్, శోభన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల అభివృద్ధే ధ్యేయం
మోత్కూరు: రైతుల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం జరిగిన మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై ప్రసంగించారు. రైతులు దోపిడీకి గురికాకుండా దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి గోదాంల నిర్మాణాలు చేపట్టిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి వల్లే జిల్లాకు 12 గోదాంలు మంజూరైనట్లు తెలిపారు. గందమల్ల రిజర్వాయర్‌తో మోత్కూరు ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. భీమలింగం, బునాదిగాని కాల్వల నిర్మాణం కోసం రీడిజైన్‌కు సీఎం రూ. 100 కోట్లు కేటాయించారని, త్వరలో పూర్తి కానున్నాయన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో నల్లగొండ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారనుందని వివరించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంతవరకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఆవిశ్రాంతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపెల్లి మహేంద్రనాథ్ , వైస్ చైర్మన్ లాగ్గాని రమేష్, డెరైక్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల ఎంపీపీలు ఓర్సులక్ష్మి, భాగ్యశ్రీ, సంగి వేణుగోపాల్, జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఎం.పాండురంగారావు, సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడి, సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, ఎంపీటీసీలు జంగ శ్రీను, కురిమిళ్ల ప్రమీళ, ముద్దం జయశ్రీ, జిల్లా పశు గణాభివృద్ధి సంఘం చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర ఎం.ఎ. అలీమ్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ టి.మేఘారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు
మోత్కూరు: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యానికి మద్దతుగా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం స్థానికంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత జవాన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భారత సైన్యం తీసుకున్న నిర్ణయానికి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీసెల్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి జహంగీర్‌పాషా, ఐఎన్టీయూసీ యూత్ రాష్ట్ర కార్యదర్శి ఎండి. అయాజ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, జిల్లా కార్యదర్శి కల్యాణ్ చక్రవర్తి, నాయకులు కొత్తపెల్లి వెంకటేశ్వర్లు, సైదులు, సోములు, ఎండి.సమీర్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మోత్కూరు: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారృం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని జమ్మిచెట్టు కాలనీలో నివాసముంటున్న గీత కార్మికుడు గుండు నర్సయ్య(58) ఇంట్లోని నీటిసంపులో వరదనీరు చేరింది. ఉదయం నల్లాసంపులో చిన్నమోటారు సహాయంతో బురదనీరు తొలగించేందుకు నర్సయ్య ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జి.దశరథ సందర్శించారు. ఆయన వెంట వీఆర్వోలు శంకర్, సోమయ్యలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆధుకోవాలని ఎంపీటీసీ సభ్యురాలు ఎలుగు పార్వతమ్మయాదయ్య కోరుతున్నారు. ఏఎస్ఐ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గోడకూలి వృద్ధురాలి మృతి
మోత్కూరు భారీ వర్షాలకు ఓ వృద్ధురాలు బలైంది. ఈ ఘటన మోత్కూరు మండలం బొడ్డుగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సప్పిడి మణెమ్మ(85)కు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మణెమ్మ మాత్రం గ్రామంలోనే శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటిగోడలు నాని శుక్రవారం కూలిపోయాయి. దీంతో ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మణెమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. ఇరుగుపొరుగు వారు గమనించి కుమారుడికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జి.దశరథ, డిప్యూటీ తహసీల్దార్ ఎం.కృష్ణ సందర్శించి పరిశీలించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. -
58 మంది బైండోవర్
మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు జరిపిన 58 మంది పాత నేరస్తులను శుక్రవారం స్థానిక తహసీల్దార్ జి.దశరథ ఎదుట ఎక్సైజ్ సీఐ బొడిగ అశోక్ బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ కేసులు నమోదై సంవత్సరం కాలం పూర్తయిన పాత నేరస్తులను తిరిగి మరో సంవత్సర కాలానికి బైండోవర్ చేసినట్లు తెలిపారు. సారా తయారు చేసినా.. విక్రయించినా రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ. కె.సంతోష్‌కుమార్, కానిస్టేబుల్స్ కట్ట అశోక్, బి.నాగరాజు, ఎం.వెంకటేశ్వర్లు, కె.వనజాతలు ఉన్నారు. -
మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి
మోత్కూరు : సంఘం బంధం తీర్మానాలతోనే స్వయం సహాయక పొదుపు మహిళా గ్రూపులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.అంజయ్య అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేజ్ బుక్‌కీపర్సు రుణా మంజూరులో చేతివాటం ప్రదర్శించడం , అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో మహిళా సంఘాలకు సంఘబంధం చేసిన తీర్మానాలతోనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అనాజిపురంసంఘం బంధంలో అవకతవకలు జరిగాయని.. మూడు నెలలుగా సుమారు రూ.70 లక్షలు రుణ బకాయిలు చెల్లించడంలేదని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రమేష్‌కుమార్, పీడీ దృష్టికి తీసుకెళ్లారు. వారంలోగా మూడోవిడత పంట రుణాలు.. మూడోవిడత పంట రుణాలను వారంలోగా రైతులకు పంపిణీ చేస్తామని లీడ్‌బ్యాంక్ మేనేజర్ సూర్యం లె లిపారు. 12.5 శాతం నిధులను ప్రభుత్వం విడుదలచేసిందని చెప్పారు. కౌలు రైతులకు పంట రుణాలను మంజూరుచేసే విషయంంలో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జి.దశరథ, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, స్వయం ఉపాధికల్పన శిక్షణ సంస్థ జిల్లా అధికారి రాజశేఖర్ ఐకేపీ బ్యాంక్ లేకేజీ డీపీఎం రామకృష్ణ, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, ఏపీఎంలు వెంకటేశ్వర్లు, పక్కీరయ్య, ఆనంద్, మండల వ్యవసాయాధికారి కె.స్వప్న, మండల పశువైద్యాధికారి పి.అశోక్‌కుమార్, ఈఓఆర్డీ జి.సుజాత, బ్యాంక్ మేనేజర్లు రాజు, రమేష్‌కుమార్ వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. -
మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి
మోత్కూరు : సంఘం బంధం తీర్మానాలతోనే స్వయం సహాయక పొదుపు మహిళా గ్రూపులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.అంజయ్య అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేజ్ బుక్‌కీపర్సు రుణా మంజూరులో చేతివాటం ప్రదర్శించడం , అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో మహిళా సంఘాలకు సంఘబంధం చేసిన తీర్మానాలతోనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అనాజిపురంసంఘం బంధంలో అవకతవకలు జరిగాయని.. మూడు నెలలుగా సుమారు రూ.70 లక్షలు రుణ బకాయిలు చెల్లించడంలేదని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రమేష్‌కుమార్, పీడీ దృష్టికి తీసుకెళ్లారు. వారంలోగా మూడోవిడత పంట రుణాలు.. మూడోవిడత పంట రుణాలను వారంలోగా రైతులకు పంపిణీ చేస్తామని లీడ్‌బ్యాంక్ మేనేజర్ సూర్యం లె లిపారు. 12.5 శాతం నిధులను ప్రభుత్వం విడుదలచేసిందని చెప్పారు. కౌలు రైతులకు పంట రుణాలను మంజూరుచేసే విషయంంలో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జి.దశరథ, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, స్వయం ఉపాధికల్పన శిక్షణ సంస్థ జిల్లా అధికారి రాజశేఖర్ ఐకేపీ బ్యాంక్ లేకేజీ డీపీఎం రామకృష్ణ, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, ఏపీఎంలు వెంకటేశ్వర్లు, పక్కీరయ్య, ఆనంద్, మండల వ్యవసాయాధికారి కె.స్వప్న, మండల పశువైద్యాధికారి పి.అశోక్‌కుమార్, ఈఓఆర్డీ జి.సుజాత, బ్యాంక్ మేనేజర్లు రాజు, రమేష్‌కుమార్ వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. -
చిన్నారులను శిశువిహార్‌కు తరలింపు
మోత్కూరు: మోత్కూరుకు చేరిన చిన్నారులను ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని శిశువిహార్‌కు తరలించారు. వివరాలు.. మోత్కూరు కొత్త బస్టాండ్‌లో ఆదివారం రాత్రి ఓ తండ్రి కిషన్ (4), అంజలి(3)ని వదిలి వెల్లాడు. అక్కడ స్థానికులు గమనించి మీది ఏ ఊరు, ఎక్కడి వచ్చారని వివరాలు అడిగారు. దీంతో మానాన్న పేరు నర్సింహ్మ, అమ్మ అనిత అని, మాది పాలమూరు అని చెప్పారు. మా నాన్న ఇక్కడ నిలిచోపెట్టి మల్లివస్తానని వెళ్లాడని చిన్నారులు తెలిపారు. రాత్రి కావడంతో స్థానిక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్కె. జానీమియాకు అప్పగించారు. అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, సునితలకు అప్పగించగా స్థానిక కస్తూరిభా బాలికల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ యాదమ్మ వద్దకు తీసుకెళ్లారు. చిన్నారులు సరైన వివరాలు చెప్పకపోవడంతో ఎంఈఓ మన్నె అంజయ్య సమక్షంలో హెడ్‌కానిస్టేబుల్ జానిమియా, సీడీపీఓ వై.వి ఝాన్సీలక్ష్మీకి అప్పగించారు. వీరిని నల్లగొండలోని ప్రభుత్వ శిశు విహార్‌లో చేర్పించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. హైదరాబాద్‌లోని లాలాపేట ప్రాంతంలో తాము అమ్మనాన్నలతో ఉన్నట్లు చిన్నారులు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు మంగమ్మ, ప్రమీళ, ఎస్ఓ యాదమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, నిర్మల, హోంగార్డు సిద్దక్ తదితరులు ఉన్నారు. . -
వైఎస్సార్ ప్రాజెక్టులనే రీడిజైన్ చేస్తున్న సీఎం
మోత్కూరు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం మోత్కూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్‌రెడ్డి సుమారు 75 ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తికాగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి రాజశేఖర్‌రెడ్డి పేరు మరిపించడానికి కేసీఆర్ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎంపీటీసీలు కూరిమిళ్ల ప్రమీళ, ముద్దం జయశ్రీ, మాజీ సర్పంచ్‌లు కె.వెంకటేశ్వర్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, కల్యాణ్‌చక్రవర్తి, బుంగపట్ల యాకయ్య, ఎండి. అయాజ్, జహంగీర్‌పాషా తదితరులు ఉన్నారు. -
పొడిచేడు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ
మోత్కూరు మండలంలోని పొడిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 40వేల విలువ గల కంప్యూటర్ సెట్‌ను , నాలుగు సీలింగ్‌ఫ్యాన్లు అదేగ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త పేలపూడి పిచ్చయ్యచౌదరి (పీపీచౌదరి) బహూకరించారు. ఈ సందర్భంగా దాతను మంగళవారం పాఠశాల ఉపా«ధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వంగాల లలిత. ఉప సర్పంచ్ బండ రామనర్సయ్య, ప్రధానోపాధ్యాయులు మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పేలపూడి మధు తదితరులు పాల్గొన్నారు.