వైఎస్సార్ ప్రాజెక్టులనే రీడిజైన్ చేస్తున్న సీఎం
వైఎస్సార్ ప్రాజెక్టులనే రీడిజైన్ చేస్తున్న సీఎం
Published Fri, Sep 2 2016 10:55 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
మోత్కూరు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం మోత్కూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్‌రెడ్డి సుమారు 75 ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తికాగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి రాజశేఖర్‌రెడ్డి పేరు మరిపించడానికి కేసీఆర్ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎంపీటీసీలు కూరిమిళ్ల ప్రమీళ, ముద్దం జయశ్రీ, మాజీ సర్పంచ్‌లు కె.వెంకటేశ్వర్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, కల్యాణ్‌చక్రవర్తి, బుంగపట్ల యాకయ్య, ఎండి. అయాజ్, జహంగీర్‌పాషా తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement